రెనాల్ట్ కార్లపై బంపరాఫర్‌.. రూ.40 వేల వరకు డిస్కౌంట్! | Renault Car Discount Offers in January 2022 | Sakshi
Sakshi News home page

రెనాల్ట్ కార్లపై బంపరాఫర్‌.. రూ.40 వేల వరకు డిస్కౌంట్!

Jan 10 2022 7:46 PM | Updated on Jan 10 2022 8:08 PM

Renault Car Discount Offers in January 2022 - Sakshi

మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. రెనాల్ట్ ఇండియా ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కిగర్, ట్రైబర్, క్విడ్ , డస్టర్ వంటి 4 మోడళ్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో రెనాల్ట్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. 

రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ మీద ప్రస్తుతం రూ. 35,000 వరకు కంపెనీ డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, రైతులకు ప్రత్యేక ఆఫర్‌ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ నెలలో క్విడ్‌ను కొనుగోలు చేస్తే రూ. 10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్ తో పాటు, స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

రెనాల్ట్ కిగర్
రెనాల్ట్ కిగర్ గత నెలలో భారత మార్కెట్లో ఫ్రెంచ్ ఆటోమేకర్ రెండవ అత్యధికంగా అమ్ముడైన మోడల్. అయితే ఈ నెలలో ఈ కారు మీద రూ.10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్ అందిస్తుంది. 

రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. అయితే, విఎన్ 2021 మోడల్ కొనుగోలు చేసినప్పుడు ప్రయోజనాలు రూ.30,000కు తగ్గుతాయి. ఇది కాకుండా స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 ప్రయోజనం కూడా పొందవచ్చు.

రెనాల్ట్ డస్టర్
రెనాల్ట్ డస్టర్‌ పై రూ.1.10 లక్షల విలువైన ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలు అందిస్తుంది. రూ. 1.30 లక్షల ముందస్తు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement