Renault Duster
-
రెనో డస్టర్ మళ్లీ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ రెనో.. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ డస్టర్‌ను తిరిగి ప్రవేశపెడుతోంది. వచ్చే ఏడాదికల్లా ఇక్కడి రోడ్లపై పరుగుతీసే అవకాశం ఉంది. 2012లో భారత్‌లో డస్టర్ అడుగుపెట్టింది. రెనో ఇండియా ఈ మోడల్ తయారీని 2022లో నిలిపివేసింది. డస్టర్ పేరుతోనే రీఎంట్రీ ఇస్తుందని రెనో ఇండియా సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిల్లపల్లె వెల్లడించారు. కైగర్, ట్రైబర్, క్విడ్ ఫేస్ లిఫ్ట్ మోడళ్లను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు భద్రతా ఫీచర్లను జోడిస్తూ ఏ, ఏ ప్లస్ ప్యాసింజర్ కార్ల విభాగంలో పోటీపడతామని అన్నారు. కార్ల ధరలను పెంచలేదని, 2024 కోసం కొత్త శ్రేణిని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. మూడేళ్లలో అయిదు కొత్త మోడళ్లు.. వచ్చే మూడేళ్లలో భారత విపణిలో రెనో అయిదు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో రెండు బ్రాండ్ న్యూ ఎస్‌యూవీలు, ఒకటి ఎలక్ట్రిక్ వెహికిల్ ఉండనుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లలో ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తామని వెంట్రామ్ వెల్లడించారు. ‘ఒకసారి చార్జింగ్‌తో గరిష్టంగా 320 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుంది. భారత్ కోసం ఈవీని రూపొందిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్లకు ఈవీలను ఎగుమతి చేస్తాం. లిథియం నిల్వలు భారత్ చేతుల్లో ఉంటే బ్యాటరీల ధరలను నియంత్రించే ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో మార్కెట్లో అన్ని ధరల శ్రేణిలో ఎలక్ట్రిక్ కార్లు లభిస్తాయి’ అని వివరించారు. -
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్‌లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్‌ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్‌పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా!
కార్ల కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్. మన దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనాల్ట్' రెనాల్ట్ ఇండియా' కార్ల కొనుగోలు దారులకు కళ్లు చెదిరేలా డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జనవరి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రెనాల్ట్ ఇండియా పలు కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇక రెనాల్ట్ ఇండియా కార్లపై డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ రెండు వెర్షన్ల కారు కొనుగోలు దారులు డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మోడల్ 1.0-లీటరు వెర్షన్ కారు కొనుగోలుపై రూ 5,000 మై 2022 మోడళ్ల (08.లీటర్ వెర్షన్లు తప్ప)పై రూ 10,000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్‌ను దక్కించుకోవచ్చు.కార్పొరేట్, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000, రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆర్ఎక్స్ఈ 0.8 లీటర్ వేరియంట్ పై రూ.10,000 లాయల్టీ ప్రయోజనాల్ని పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్ కారు కొనుగోలు దారులకు లాయల్టీ బెన్ఫిట్ కింద రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు.దీంతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కారు కొనుగోలు దారులకు రూ.10,000, రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలు దారులు ఎంవై 2021 మోడల్‌పై రూ. 10,000 (ఆర్ఎక్స్ఈ వేరియంట్ మినహా) డిస్కౌంట్, ఎక్ఛేంజ్ కింద రూ.20,000 వరకు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎక్స్ఈ వేరియంట్‌పై లాయల్టీ బోనస్ రూ.10,000, రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయితీ సభ్యులకు రూ.5,000 డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. సెలక్ట్ చేసిన వేరియంట్లపై కార్పొరేటర్లు,పీఎస్‌యూల(ప్రభుత్వ ఉద్యోగస్తులకు) రూ.10,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా ఎంచుకోవచ్చు రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ అన్ని వేరియంట్లపై (ఆర్ఎక్స్ జెడ్1.5 ట్రిమ్ మినహా) రూ.50,000 ఎక్ఛేంజ్ ఆఫర్, రూ.50,000 డిస్కౌంట్ పొందవచ్చు. కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన వేరియంట్లలో రూ.30,000, గ్రామీణ ప్రాంతాల కొనుగోలు దారులు రూ.15,000 వరకు సొంతం చేసుకోవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
రెనాల్ట్ కార్లపై బంపరాఫర్.. రూ.40 వేల వరకు డిస్కౌంట్!
మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. రెనాల్ట్ ఇండియా ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కిగర్, ట్రైబర్, క్విడ్ , డస్టర్ వంటి 4 మోడళ్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో రెనాల్ట్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ మీద ప్రస్తుతం రూ. 35,000 వరకు కంపెనీ డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, రైతులకు ప్రత్యేక ఆఫర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ నెలలో క్విడ్‌ను కొనుగోలు చేస్తే రూ. 10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్ తో పాటు, స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్ గత నెలలో భారత మార్కెట్లో ఫ్రెంచ్ ఆటోమేకర్ రెండవ అత్యధికంగా అమ్ముడైన మోడల్. అయితే ఈ నెలలో ఈ కారు మీద రూ.10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్ అందిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. అయితే, విఎన్ 2021 మోడల్ కొనుగోలు చేసినప్పుడు ప్రయోజనాలు రూ.30,000కు తగ్గుతాయి. ఇది కాకుండా స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 ప్రయోజనం కూడా పొందవచ్చు. రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ పై రూ.1.10 లక్షల విలువైన ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలు అందిస్తుంది. రూ. 1.30 లక్షల ముందస్తు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. -
ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
Year End Offers On Cars 2021: మీరు కారు కొనాలనుకుంటున్నారా..! అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. నిస్సాన్, మహీంద్రా, హోండా, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులు ఇయర్ ఎండ్సేల్ను ప్రకటించాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2021 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుబాటుకానున్నాయి. ఇయర్ ఎండ్ సేల్ భాగంగా పలు కార్లపై ఆయా కంపెనీలు అందిస్తోన్న ఆఫర్లు..! రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ ఇండియా ఈ నెలలో డస్టర్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 50 000 ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, రూ. 50వేల వరకు నగదు తగ్గింపు, రూ. 30 వేల వరకు కార్పొరేట్ తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. కంపెనీ reli.ve స్క్రాప్‌పేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. మహీంద్రా అల్టురాస్ G4 మహీంద్రా అల్టురాస్ G4 ఎస్యూవీ కొనుగోలుపై మహీంద్రా రూ. 81, 500 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఇతర ఆఫర్లను కొనుగోలుదారులకు మహీంద్రా ప్రకటించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ కొనుగోలుపై గరిష్టంగా రూ. 50వేల వరకు తగ్గింపును పొందవచ్చును. ఈ ఆఫర్స్ టర్బో వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఇతర పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రూ.25,000 వరకు తగ్గింపులను పొందవచ్చును. స్పోర్ట్జ్ పెట్రోల్ DT వేరియంట్‌పై ఏలాంటి ప్రత్యేక ఆఫర్లు లేవు. సీఎన్జీ మోడల్స్‌పై రూ.17,300 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ హోండా సిటీ కారుపై హోండా ఇండియా పలు ఆఫర్లను ప్రకటించింది. ఐదోవ తరం హోండా సిటీ సెడాన్‌పై గరిష్టంగా రూ. 45,108 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్స్ అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. ఇందులో రూ. 7,500 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 8,108 వరకు ఎఫ్ఓసీ ఉపకరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా రూ. 15,000 ఎక్సేచేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 9,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..! -
రెనాల్ట్ కార్ల కొనుగోలుపై రూ.80 వేల వరకు బంపర్ ఆఫర్స్..!
ఫ్రాన్స్‌కు చెందిన మల్టీనేషనల్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. రెనాల్ట్ శ్రేణిలోని కార్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్స్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన మోడల్ లైనప్‌లో పలు ప్రయోజనాలను ప్రకటించింది. రెనాల్ట్ సుమారు రూ 80 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను అందించనుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! రెనాల్ట్ అందిస్తోన్న ఆఫర్లు ఆయా మోడల్, ప్రాంతాల్లో మారుతూ ఉంటాయి. ‘బై నౌ, పే ఇన్ 2022’ అనే సరికొత్త స్కీమ్‌తో రెనాల్ట్ ముందుకొచ్చింది. ఈ స్కీమ్ సెలక్టెడ్ కార్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో భాగంగా తొలి ఆర్నెల్ల సమయంలో ఈఎమ్ఐ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కారు కొన్న వెంటనే ఈఎమ్ఐ చెల్లించనక్కర్లేదు. రెనాల్ట్ తన RELi.VE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద సుమారు రూ. 10 వేల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ క్విడ్ , ట్రైబర్ లేదా డస్టర్‌పై వర్తిస్తుంది. రెనాల్ట్ క్విడ్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ సేల్‌లో రూ.40 వేల వరకు గరిష్ట ప్రయోజనాలతో అమ్మకానికి ఉంది. ఈ ఆఫర్లలో పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్, 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, పదివేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ ట్రైబర్ ఎమ్పీవీపై రెనాల్ట్ విభిన్న ప్రయోజనాలను అందిస్తోంది. రెనో 2020 మోడల్ ట్రైబర్‌పై కొనుగోలుదారులు సుమారు రూ. 60 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో రూ. 25 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. 2021 మోడల్ ఇయర్ ట్రైబర్ కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ. 50 వేల వరకు ప్రయోజనాలను పొందుతారు. వీటిలో రూ. 15 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ కొనుగోలుపై సుమారు రూ. 80 వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. వీటిలో రూ. 30 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఈ మూడు మోడళ్లకు ‘ఇప్పుడు కొనండి 2022లో చెల్లించండి’ స్కీమ్ వర్తించనుంది. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించే విషయంలో మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్ల పని తీరు అస్సలు బాగోలేదంటూ లాటిన్ ఎన్సీఏపీ స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ రెండు కార్లు దారుణమైన ఫలితాలను పొందాయి. క్రాష్ టెస్ట్ కార్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి వివిద దేశాలు న్యూ కార్ ఎస్సెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) పేరుతో క్రాష్ టెస్ట్‌లు నిర్వహించి రేటింగ్స్ ఇస్తుంటాయి. ఇటీవల లాటిన్ ఎన్సీపీఏ పరీక్షలు నిర్వహించగా మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్లు ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఇటీవల కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించగా ఈ రెండు ప్రముఖ కార్లు దారుణంగా జీరో స్టార్స్ రేటింగ్ సాధించి నిరాశజనకమైన ఫలితాలు కనబరిచాయి. మారుతి స్విఫ్ట్ పరిస్థితి మారుతి సిఫ్ట్కి సంబంధించి హ్యాచ్‌బ్యాక్, సెడాన్ రెండు కార్లు సైతం ఈ టెస్టులో అత్తెసరు మార్కులు కూడా సాధించలేపోయాయి. ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 15.53 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో సున్నా శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 66 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 6.98 శాతం పాయింట్లనే సాధించగలిగింది. దీంతో మారుతి స్విఫ్ట్‌కి లాటిన్ ఎన్సీఏపీ జీరో రేటింగ్ ఇచ్చింది. డస్టర్దీ అదే దారి రెనాల్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ డస్టర్‌కి ఈ క్రాష్ టెస్ట్‌లో ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 29.47 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో 22.93 శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 50.79 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 34.88 శాతం పాయింట్లనే సాధించగలిగింది. రక్షణ చర్యలేవి లాటిన్ ఎన్సీఏపీ పరీక్షలో విఫలమైన మారుతి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ల్ కార్లలో స్టాండర్డ్‌గా రెండు ఎయిర్‌బ్యాగులు అందించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ విషయంలో ఈ రెండు కార్లలో భద్రతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని లాటిన్ ఎన్సీఏపీ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం పెద్దలోటని తెలిపింది. ఇప్పుడే కష్టం యూఎన్ 95 నిబంధనలకు తగ్గట్టుగా స్విఫ్ట్ , డస్టర్ కార్లలో భద్రతా ఏర్పాట్లు లేనందున వీటిని ఇప్పుడే లాటిన్ దేశాల్లో అనుమతించే అవకాశం లేదు. 2018లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్‌కి 2 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈసారి రేటింగ్ మెరుగవుతుందని భావిస్తే దారుణంగా పడిపోయింది. యూరోపియన్, లాటిన్ దేశాల్లో కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌లు తప్పనిసరిగా మారాయి. చదవండి : హ్యుందాయ్ సంచలనం! త్వరలో హైడ్రోజన్ వేవ్ కారు!! -
క్రాష్ టెస్టులో మరో కారు ఫెయిల్.. 0 స్టార్ రేటింగ్
భారతదేశంలో తయారైన కార్లలో ఇటీవలి కాలంలో బాగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన కార్లలో.. రెనో డస్టర్ ఒకటి. అయితే ఈ కారు బేస్ మోడల్ మాత్రం క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమైంది. అంతర్జాతీయంగా నిర్వహించే గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ టెస్టులో దీనికి 0 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వెనకాల సీట్లో ఉన్న పిల్లల రక్షణ విషయంలో దీనికి 2 స్టార్ల రేటింగ్ ఇచ్చారు. 2017 సంవత్సరానికి గాను భారతదేశంలో తయారైన కార్లకు క్రాష్ టెస్టు చేయడం ఇది రెండో రౌండు. తొలిరౌండులో షెవ్రోలె ఎంజాయ్, ఫోర్డ్ ఫిగో యాస్పైర్ కార్లను టెస్ట్ చేశారు. 2014 నుంచి గ్లోబల్ ఎన్కాప్ మన కార్లకు క్రాష్ టెస్టులు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన టెస్టింగ్ ప్రోటోకాల్ ప్రకారం గంటకు 56 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా కారు ముందు భాగానికి, పక్క భాగాలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలని మన దేశంలో చెబుతున్నారు. అయితే గ్లోబల్ ఎన్కాప్ మాత్రం 64 కిలోమీటర్ల వేగంతో చూస్తుంది. రెనో డస్టర్ బేసిక్ మోడల్‌కు ఎయిర్‌బ్యాగ్స్ ఉండవు. అందుకే అది ఈ టెస్టులో విఫలమైందని అంటున్నారు. డ్రైవర్ సీట్లో ఎయిర్‌బ్యాగ్ ఉండే డస్టర్ మోడల్‌కు గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ టెస్టులో 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అయితే వెనకాల సీట్లో ఉండే పిల్లల రక్షణ విషయంలో మాత్రం 2 స్టార్ రేటింగ్ అలాగే ఉంది. ఇదే మోడల్ డస్టర్ కార్లను లాటిన్ అమెరికా ప్రాంతం కోసం కొలంబియాలో తయారుచేయగా వాటికి 4 స్టార్ రేటింగ్ వచ్చింది. దీనిపై గ్లోబల్ ఎన్కాప్ వివరణ ఇస్తూ, భారతదేశంలో తయారయ్యేవాటి కంటే లాటిన్ అమెరికా వాటిలో ఎయిర్‌బ్యాగ్ సైజు పెద్దదని, అందుకే స్టార్ రేటింగ్ మారిందని తెలిపింది. -
సెకండ్ హ్యాండ్..పుల్ డిమాండ్!
దేశంలోనే నంబర్ వన్ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఒకప్పటి చీఫ్ జగదీశ్ ఖట్టర్ ఇప్పుడేకారు నడుపుతుంటారో? ఏ టాప్ఎండ్ ఎస్యూవీనో లేదంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీకారో అనుకుంటున్నారా... అబ్బే ఆయన షి‘కారు’ చేసేది కేవలం సెకండ్హ్యాండ్లలో! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అంతేకాదు, ఇప్పుడు ఆయన వ్యాపారం కూడా ఇదే. వాడినకార్లను కొనడం.. అమ్మడం... సర్వీసింగ్. ఇందుకోసం ఆయన అయిదేళ్ల క్రితం ప్రారంభించిన కార్నేషన్ ఆటో అనే సంస్థ ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్లో తనదైనముద్రతో దూసుకెళ్తోంది. దీనంతటికీ దేశంలో ఈ మార్కెట్ పుంజుకుంటుండటమే కారణం. ఒకపక్క, ఆటోమొబైల్ మార్కెట్లో మందగమనం నెలకొన్నప్పటికీ ఈ యూజ్డ్ కార్ల వ్యాపారం మాత్రం టాప్‌గేర్‌లో దూసుకెళ్తుండటం విశేషం. ‘ధనిక కస్టమర్లు కొత్తకార్లు కొంటారు.. తెలివైనవాళ్లు సెకండ్‌హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తారు’ ఇదీ ఖట్టర్ ఫిలాసఫీ! పెద్ద కంపెనీల ప్రవేశంతో.. ఒపప్పుడు చిన్నాచితకా సంస్థలు, డీలర్లకే పరిమితమైన ఈ సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి దిగ్గజాలు ప్రవేశించడంతో వ్యవస్థీకృత రూపుదాల్చుతోంది. మారుతీ సుజుకీ ‘ట్రూ వేల్యూ’ పేరుతో, మహీంద్రా అండ్ మహీంద్రా.. ‘ఫస్ట్ చాయిస్’, జగదీశ్ ఖట్టర్ నెలకొల్పిన కార్నేషన్ ఆటో వంటివి ఈ రంగంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రస్తుతం మల్టీబ్రాండ్ యూజ్డ్ కార్ల మార్కెట్లో ఈ సంస్థాగత కంపెనీల వాటా దాదాపు 15%. బడా కంపెనీలు ప్రవేశించినా.. ఇప్పటికీ చిన్న చిన్న డీలర్ల(ఆన్ఆర్గనైజ్డ్)దే ఈ మార్కెట్లో మెజారిటీ వాటా. అయితే, పెద్ద కంపెనీల ప్రవేశంతో తమ మార్జిన్లు, అమ్మకాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయనేది చిన్న డీలర్ల వాదన. బడా సంస్థలు వారంటీ ఇతర త్రా ఆఫర్ చేస్తుండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. విస్తరణ జోరు... ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డుకాలం కొనసాగుతున్నప్పటికీ సెకండ్‌హ్యాండ్ కార్ల కంపెనీలు విస్తరణతో దూసుకెళ్తున్నాయి. దీనికి పటిష్ట డిమాం డే కారణం. గతేడాది ఏప్రిల్ నుం చి ఇప్పటిదాకా మహీంద్రా ఫస్ట్ చాయిస్ 100 కొత్త డీలర్షిప్ సోర్లను దేశ్యాప్తంగా తెరిచింది. ఈ వ్యవధిలో తాము 60 వేల సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించామని.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 40% అధిమని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సీఈఓ నాగేంద్ర పల్లె పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకూ విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక మారుతీ ట్రూ వేల్యూ కూడా విస్తరణతో ఉరకలేస్తోంది. గతేడాది డిసెంబర్ నాటికి కంపెనీ అవుట్లెట్ల సంఖ్య మొత్తం 309 నగరాల్లో 507కు చేరింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌కు 245 నగరాల్లో 429 అవుట్లెట్లు ఉన్నాయి. ఇక ఖట్టర్‌కు చెందిన కార్‌నేషన్‌కు ప్రస్తుతం 40 డీలర్షిప్ అవుట్లెట్లు ఉండగా.. మరో మూడేళ్లలో 150-200కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘సెకండ్‌హ్యాండ్’ పదానికి బదులు ఇప్పుడు ‘యూజ్డ్’ కార్లు లేదా ‘ప్రీఓన్డ్’ కార్లు అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మార్కెట్ ఎంత? అధికారికంగా గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ.. దేశంలో వార్షికంగా 30 లక్షల యూజ్డ్ కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. 2013లో దేశీయంగా 18.07 లక్షల కొత్త కార్లు అమ్ముడైనట్లు సియామ్ అంచనా(2012లో దాదాపు 20 లక్షల కార్లతో పోలిస్తే 9.5 శాతం తగ్గాయి). క్రిసిల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2016-17 నాటికి వార్షికంగా యూజ్డ్కార్ల అమ్మకాల సంఖ్య దాదాపు మూడింతలకు.. అంటే 80 లక్షల స్థాయికి చేరొచ్చని అంచనా. మొత్తం మార్కెట్ విలువ రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కాగా, అమెరికాలోలో గతేడాది దాదాపు 4 కోట్ల యూజ్డ్ కార్లు అమ్ముడవగా.. చైనాలో ఈ సంఖ్య 48 లక్షలు కావడం గమనార్హం. డిమాండ్‌కు కారణమేంటి? పేరున్న కార్ల బ్రాండ్లు ఈ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో కస్టమర్లలో నమ్మకం పెరిగేందుకు దోహ దం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, సెకండ్‌హ్యాండ్ వాహనాలను నడిపేందుకు ఇష్టపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండటం కూడా యూజ్డ్ కార్లకు డిమాండ్‌ను సృష్టిస్తోంది. ఈ విధమైన ధోరణికి మనోళ్లు బాగానే అలవాటుపడుతుండటం మరో కీలకమైన అంశం. యూజ్డ్ కారుతో కొన్నాళ్లు నడిపించి.. ఆ తర్వాత కొత్తకారు సొంతంచేసుకోవాలనుకునే ట్రెండ్ ఇటీవల ఊపందుకుంటోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. విదేశీ లగ్జరీకార్ల నుంచి దేశీ కంపెనీల ప్రఖ్యాత కార్ల మోడళ్లు ఇలా అన్నీ అందుబాటు ధరల్లో ఊరిస్తుండటం కూడా కొందరు కస్టమర్లను యూజ్డ్ కార్లవైపు నడిపిస్తోందని చెబుతున్నారు. పదేపదే కార్లను మార్చే కస్టమర్లు దేశంలో పెరుగుతుండడం, రుణాల లభ్యత వంటివి సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్‌కు వరంగా మారుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోపక్క, రోజుకో కొత్త మోడల్ కారు మార్కెట్లోకి విడుదలవుతుండడం కూడా ఈ మార్కెట్ పురోగతికి దోహదం చేస్తోంది. -
ఒక్కటి తలరాత మార్చింది..!