సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత)
పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ )
ఇండియా తమకు టాప్ 5 మార్కెట్‌లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్‌ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్‌రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్‌పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది.
మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment