Renault Kwid AMT
-
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్‌లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్‌ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్‌పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
రెనో క్విడ్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా క్విడ్ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.4.49 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో 0.8 లీటర్, 1.0 లీటర్ పెట్రోల్ పవర్‌ట్రైన్స్‌తో క్విడ్ మై22 క్లైంబర్ శ్రేణి తయారైంది. ఈ మోడల్ భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉందని వివరించింది. -
రెనాల్ట్ కార్లపై బంపరాఫర్.. రూ.40 వేల వరకు డిస్కౌంట్!
మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. రెనాల్ట్ ఇండియా ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కిగర్, ట్రైబర్, క్విడ్ , డస్టర్ వంటి 4 మోడళ్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో రెనాల్ట్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ మీద ప్రస్తుతం రూ. 35,000 వరకు కంపెనీ డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, రైతులకు ప్రత్యేక ఆఫర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ నెలలో క్విడ్‌ను కొనుగోలు చేస్తే రూ. 10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్ తో పాటు, స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్ గత నెలలో భారత మార్కెట్లో ఫ్రెంచ్ ఆటోమేకర్ రెండవ అత్యధికంగా అమ్ముడైన మోడల్. అయితే ఈ నెలలో ఈ కారు మీద రూ.10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్ అందిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. అయితే, విఎన్ 2021 మోడల్ కొనుగోలు చేసినప్పుడు ప్రయోజనాలు రూ.30,000కు తగ్గుతాయి. ఇది కాకుండా స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 ప్రయోజనం కూడా పొందవచ్చు. రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ పై రూ.1.10 లక్షల విలువైన ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలు అందిస్తుంది. రూ. 1.30 లక్షల ముందస్తు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. -
మరో మైలురాయి దాటిన క్విడ్.. ఆరేళ్లలోనే వశమైన రికార్డు
ఎంట్రీ లెవల్ కారుగా మార్కెట్లోకి వచ్చిన క్విడ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. బడ్జెట్ కారుగా మార్కెట్లోకి వచ్చినా.. తర్వాత కాలంలో ప్రజలు ఇష్టమైన కారుగా ముద్ర పడిపోయింది. తాజాగా క్విడ్ మరో మైలు రాయిని దాటింది. 2015 నుంచి ఫ్రెంచ్ కారు తయారీ కంపెనీ రెనాల్ట్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ కారుగా రెనాల్ట్ది ప్రత్యేక స్థానం. మొదటిసారిగా 2015లో ఈ కారుని ఇండియాలో లాంఛ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వాటిని దాటుకుంటూ అనతి కాలంలోనే ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2019లో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని రెనాల్ట్ మార్కెట్లోకి తెచ్చింది. నాలుగు లక్షలు రెనాల్ట్ కారు ఇండియా మార్కెట్లోకి వచ్చి సుమారు ఆరేళ్లు అవుతోంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల క్విడ్ కార్లను అమ్మినట్టు రెనాల్ట్ ప్రకటించింది. నాలుగో లక్ష కారును కొనుగోలు చేసిన యజమానికి రెనాల్ట్ ఇండియా సేల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మల్హోత్ర స్వయంగా హ్యాండోవర్ చేశారు. 2022 సెప్టెంబరులో క్విడ్‌లో మరో వెర్షన్ రాబోతున్నట్టు కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అత్యాధునిక ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండటం వల్ల క్విడ్ ఇండియా మార్కెట్లో సుస్థిర స్థానం దక్కించుకోగలిగింది. ఎంట్రీ లెవల్ క్విడ్ కారులో 800 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్ 54 హెచ్‌పీ సామర్థ్యంతో 72 ఎన్ఎం టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. హైఎండ్‌లో 91 ఎన్ఎం టార్క్ రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఈ కారు ధర రూ.4.11 లక్షల నుంచి రూ. 5.59 లక్షల వరకు ఉంది. అధునాత ఫీచర్లు టచ్‌స్ర్కీన్ ఇన్ఫోంటైన్మెంట్, యాపిల్ కార్ ప్లే, డ్యూయల్ ఎయిర్ ఫ్రంట్ బ్యాగ్స్, ఏఈబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. రెడిన్ డాట్సన్ గో, హ్యుందాయ్ సాంత్రో, మారుతి సూజుకి ఎస్ప్రెసో కార్లకు ధీటుగా క్విడ్ ఇక్కడి మార్కెట్లో పట్టు సాధించింది. చదవండి:2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ? -
కొత్తగా కార్లు కొంటున్నవారే అధికం!
చెన్పై, సాక్షి: రుతుపవనాలు, రబీ పంటలు, చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పండుగల సందర్భంగా ఇటీవల కార్ల విక్రయాలు 10-15 శాతం స్థాయిలో్ పుంజుకున్నట్లు తెలియజేశాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల నుంచి డిమాండ్ అధికంగా కనిపిస్తున్నట్లు వెల్లడించాయి. అక్టోబర్ 16న మొదలైన పండుగల సీజన్ నవంబర్ చివరి వారం వరకూ కొనసాగినట్లు తెలియజేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ పండుగల సీజన్లో 10-11 శాతం అధికంగా 2.33 లక్షల కార్లను విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇది గత 4-5 ఏళ్లలో అధికమని చెప్పారు. వీటిలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే నమోదైనట్లు వెల్లడించారు. గ్రామ ప్రాంతాల నుంచి తొలిసారి కార్లు కొంటున్నవారి వాటా 5 శాతం పెరిగి 54 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. పట్టణాలలో అయితే ఈ సంఖ్య 48 శాతానికి చేరినట్లు చెప్పారు. ప్రధానంగా ఈకో వ్యాన్లు, ఆల్టో, వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. రేనాల్ట్ సైతం నవరాత్రి రోజులలో 5,000 కార్లు, ధన్‌తేరాస్, దీపావళిలలో 3,000 కార్లు చొప్పున విక్రయించినట్లు రేనాల్ట్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కోవిడ్-19కు ముందు స్థాయితో పోలిస్తే 50 శాతం డిమాండ్ కనిపించినట్లు తెలియజేశారు. గ్రామీణవాసులు, రైతులకు ప్రత్యేక పథకాలు ప్రకటించడంతో ఇది సాధ్యపడినట్లు వెల్లడించారు. తొలిసారి కారు కొనుగోలుదారులు, ఇతరులతో కలిపి క్విడ్, ట్రైబర్లకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిన వర్షపాతంతో రబీ పంటల దిగుబడి 6 శాతం అధికంగా 152 మిలియన్ టన్నులకు చేరినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధరను పెంచడంతో ఖరీఫలోనూ పంటలసాగు 95 మిలియన్లు పెరిగి 1100 మిలియన్ హెక్టార్లకు చేరినట్లు వివరించారు. -
పండుగ సీజన్‌కు మార్కెట్లో కొత్త కార్లు!
పండుగల శోభ అంటే కేవలం స్వీట్లు, చాక్లెట్లు, కుటుంబసభ్యుల హడావుడి మాత్రమే కాదు. కొత్త కారు ఇంటికి తీసుకొచ్చి షికారుకు వెళ్లడం కూడా ప్రత్యేకతే. పండుగల సీజన్లో కొత్త కార్ల కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ ఆసక్తినే అనువుగా తీసుకుని పండుగల సీజన్లో ఊరించే ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు కారు తయారీదారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జోరుమీదున్న వాహన పరిశ్రమ, భారీ డిస్కౌంట్ ఆఫర్లతో వచ్చే ఐదు నెలల్లో కొత్త కొత్త కార్లను ఆవిష్కరించనున్నాయట.. అయితే ఈ పండుగ సీజన్లో వినియోగదారుల ముందుకు వచ్చి చక్కర్లు కొట్టనున్న టాప్-5 కార్లు ఏమిటో ఓ సారి చూద్దామా.. రెనాల్ట్ క్విడ్ ఏఎంటీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిన్న కారును అత్యంత శక్తిమంతమైన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో ఈ పండుగ సీజన్లోనే రెనాల్ట్ లాంచ్ చేయనుందట. కేవలం మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ మాత్రమే కాక, ఈజీ-ఆర్ ఏఎంటీ (ఆటోమేటడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) కూడా క్విడ్ కొత్త మోడల్ ప్రత్యేకత. ఈ ఆవిష్కరణతో దేశీయ మార్కెట్లో ఇప్పటికే క్విడ్ మోడల్కున్న పాపులారిటీని మరింత విస్తరించాలని రెనాల్ట్ ఆశిస్తోంది. 1.0 లీటర్ ఇంజన్ సామర్థ్యమున్న ఈ కారు 67 పీఎస్ పీక్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుందని రెనాల్ట్ చెబుతోంది. మెకానికల్ మార్పులు మినహాయిస్తే మిగతా ఫీచర్లన్నీ ఈ మోడల్లో క్విడ్‌కు సమానంగా ఉంటాయట. భద్రతాపరమైన విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్న రెనాల్ట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ను ఈ కారులో పొందుపర్చిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కారు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తున్నారా..? ఈ దీపావళి కానుకగా రెనాల్ట్ దీన్ని ప్రవేశపెట్టనుంది. ఎక్స్ షోరూం ఢిల్లీలో దీన్ని ధర రూ.4 లక్షలుగా ఉంటున్నట్టు అంచనా. టాటా కైట్ 5 సెడాన్.. టియాగో మోడల్ విజయంతో ఊపుమీదున్న టాటా.. కైట్ 5 సెడాన్ కారును వినియోగదారుల ముందుకు తీసుకురావడానికి ఉవ్విళ్లూరుతోందట. టియాగో ఆధారంతో రూపొందించిన ఈ కైట్ 5 సెడాన్‌ను, అక్టోబర్‌లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ కారులో ప్రధానమైన ప్రత్యేకత అత్యధిక బూట్ స్పేస్. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ఈ కారు గరిష్టంగా 420 లీటర్ల వరకు బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. లాంగ్ డ్రైవ్, ఫ్యామిలీ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఎంచకునేలా పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లు ఉన్నాయి. ఈ కారు ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో 4.5లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిప్ట్... 2011 నుంచి ఇయాన్ ఎలాంటి మార్పులు లేకుండా భారత రోడ్లపై చక్కర్లు కొడుతోంది. దీంతో పాత చింతకాయ పచ్చడిలాగా ఈ మోడల్ వినియోగదారులకు బోరుకొట్టి, కొనుగోలు తగ్గించేశారట. ఈ ప్రభావం అమ్మకాలపై పడి, ఒక్కసారిగా క్షీణతను నమోదుచేశాయి. అమ్మకాల క్షీణతను సీరియస్‌గా తీసుకున్న హ్యుందాయ్, ఈ ఎంట్రీ లెవల్ మోడల్‌కు అప్గ్రేట్ చేసి ఫేస్‌లిప్ట్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్త చిన్, రీవర్క్డ్ రియర్తో అప్డేటడ్ గ్రిల్‌ను ఫేస్లిప్ట్లో హ్యుందాయ్ పొందుపరిచింది. అడ్వాన్స్డ్ మల్టీమీడియా యూనిట్‌తో ఇది రాబోతుంది. ఇయాన్ కారు ఇప్పటికే 800సీసీ యూనిట్ ఆప్షన్‌తో 1.0 లీటర్ ఇంజన్ ఆప్షన్‌ను కలిగిఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఆప్షనల్ ఆటోబాక్స్ను హ్యాచ్‌బ్యాక్‌లో పొందుపరుస్తోందట. అక్టోబర్‌లో వినియోగదారుల ముందుకు రాబోతున్న ఈ ఫేస్‌లిప్ట్, రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఉంటుందని అంచనా. మారుతీ సుజుకీ బాలెనో ఆర్ఎస్... భారత మార్కెట్లో బాలెనో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌తో మెరుపులు మెరిపించిన మారుతీ మరో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతోంది. బాలెనో ఆర్ఎస్ పేరుతో దీన్ని ప్రవేశపెట్టనుందట. ఫ్రంట్ లిప్ స్పాయిలర్, సైడ్ స్కర్ట్స్, నల్లని గ్రిల్, కొత్త అలాయ్స్, మరీ ముఖ్యంగా 1.0 లీటర్ టర్బో "బూస్టర్ జెట్" ఇంజన్ ల్లో కొన్ని మార్పులతో ఈ హ్యాచ్ బ్యాక్‌ను మారుతీ డిజైన్ చేసింది. ఆశ్చర్యమేమిటంటే.. దీపావళి వరకు ఈ కారును వినియోగదారులు ముంగిట్లోకి ప్రవేశపెట్టాలని మారుతీ ప్రిపేర్ అవుతోందట. దీని ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.9లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాల టాక్. ఫోక్స్‌వాగన్ అమియో డీజిల్... హోండా అమేజ్, టాటా జిస్ట్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, హ్యుందాయ్ అసెంట్లకు గట్టిపోటీగా వచ్చిన ఫోక్స్ వాగన్ అమియో పెట్రోల్ వెర్షన్‌కు.. తోబుట్టువుగా డీజిల్ వెర్షన్నూ తీసుకొచ్చేందుకు ఫోక్స్ వాగన్ అన్నీ సెట్ చేసుకుందట. చాలా ఉత్తమమైన లక్షణాలతో, హై క్వాలిటీ క్యాబిన్‌ను ఈ కారు కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో డీజిల్ ఇంజిన్ పరిపూర్ణమైన ఎంపికగా నిలుస్తుందని ఫోక్స్ వాగన్ చెబుతోంది. పోలో హ్యాచ్ బ్యాక్ మాదిరిగానే దీన్ని రూపొందించారు. ఇంజన్ కూడా ఒకే యూనిట్ చెందిదట. 230ఎన్ఎమ్ టార్క్ తో 90పీఎస్ పవర్‌ను 1.5 లీటర్ టీడీఐ ప్రొడ్యూస్ చేసేలా ఫోక్స్ వాగన్ ఈ కారును మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ కారును సెప్టెంబర్‌లో ఫోక్స్ వాగన్ లాంచ్ చేయనుంది. ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.6.3 లక్షల నుంచి రూ.8.3 లక్షల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. ఎప్పటినుంచో ఈ కార్లు ఆవిష్కరణలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న కస్టమర్లను మురిపించేందుకు ఈ పండుగల సీజన్ వచ్చేస్తోందట. బ్రాండ్ న్యూ కార్లతో ఈ పండుగల సీజన్‌ను వినియోగదారులు ఎంజాయ్ చేసేలా ఆటోమేకర్స్ తెగ సన్నద్ధమవుతున్నాయి.