Car maker
-
ఎనిమిది కంపెనీలకు రూ.7300 కోట్ల పెనాల్టీ!.. కారణం ఇదే..
హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్‌కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. -
వచ్చేఏడాది ప్రముఖ కంపెనీ నుంచి 20 కొత్త మోడళ్లు
జర్మనీ వాహన సంస్థ ఆడి వచ్చే ఏడాది చివరి వరకు పలు మార్కెట్లలో 20 కొత్త మోడళ్లు తీసుకురానుందని కంపెనీ సీఈఓ గెర్నాట్ డాల్నెర్ తెలిపారు. 2027కు ప్రధాన విభాగాలను పూర్తిగా విద్యుత్‌కు మార్చాలని కంపెనీ భావిస్తోంది. 2024-28 మధ్య మూలధన వ్యయాలుగా 41 బిలియన్ యూరోలు (దాదాపు రూ.3.8 లక్షల కోట్లు) వెచ్చించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇంటర్నెల్ కంబస్టన్ ఇంజిన్ల అభివృద్ధి, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర విభాగాలపై 11.5 బిలియన్ యూరోలు, బ్యాటరీ విద్యుత్ వాహనాలు, డిజటలీకరణలపై 29.5 బిలియన్ యూరోలను సంస్థ ఖర్చు చేయనుంది. ఇదీ చదవండి: జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి.. భారత్‌లో విద్యుత్తు కార్ల తయారీని చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆండ్రే వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో విదేశీ కంపెనీలు భారత్‌లో ఈవీలను ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమం అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రపంచ చరిత్రలో సరికొత్త మైలురాయి.. అదరగొట్టిన జపాన్ కంపెనీ!
కార్ల తయారీలో సరికొత్త రికార్డు నమోదైంది. జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం (టయోటా) ఈ రికార్డును నెలకొల్పింది. కంపెనీ మొదలై 88 సంవత్సరాలు కాగా.. మొత్తం 30 కోట్ల కార్లు తయారు కావడం విశేషం. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో ఇన్ని కార్లు తయారు చేసిన కంపెనీ ఇంకోటి లేకపోవడం చెప్పుకోవాల్సిన విషయం. 1933లో టయోడా ఆటోమాటిక్ లూమ్ వర్క్స్‌లో భాగంగా కార్ల తయారీ ప్రారంభించింది ఈ కంపెనీ. మోడల్ -జీ1 కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ట్రక్కు. ఆ తరువాత 1937లో టయోటా మోటర్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కంపెనీ తయారు చేసిన కార్లు మొత్తం 30 కోట్లు. అయితే ఇందులో జపాన్‌లో ఉత్పత్తి అయినవాటితోపాటు ఇతర మార్కెట్లలోనివి కూడా చేర్చారు. జపాన్‌లో మొత్తం 18.05 కోట్ల కార్లు ఉత్పత్తి కాగా.. ఇతర దేశాల్లో తయారైనవి 11.96 కోట్లు. టయోటా 1941 నుంచి విస్తరణ పథం పట్టింది. టయోడా మెషీన్ వర్క్స్ (1941), టయోటా ఆటోబాడీ (1945) వంటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. 1960, 70లలో జపాన్‌లో తయారు చేసిన కార్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1982లో టయోటా మోటర్ కంపెనీ కాస్తా... టయోటా మోటర్ కార్పొరేషన్ గా మారింది. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో టయోటా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన 'కొరొల్లా' (Corolla) ఉత్పత్తి మొత్తం 5.33 కోట్ల కంటే కంటే ఎక్కువ. 1966 నుంచి ఈ సెడాన్ అనేక అప్డేట్స్ పొంది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికీ బాగా అమ్ముడుపోతోంది. భారతీయ మార్కెట్లో కూడా టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ.. మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. -
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్‌లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్‌ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్‌పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
‘అత్తారింటికి దారేది’లో పరిస్థితే వస్తే.. ఈ కారే చూసుకుంటుంది
సూపర్‌హిట్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేశ్ కారులో ఎయిర్‌పోర్టుకి వెళ్తుంటే దారి మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. సాయం చేసేందుకు పక్కన ఎవరూ ఉండరు. సమయానికి హీరో రావడంతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకుంటాడు. నిజ జీవితంలో ఇదే పరిస్థితి ఎదురయితే వెంటనే అలెర్టయ్యి పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే టెక్నాలజీతో ఓ కారు తయారవుతోంది. కెమెరాల సాయంతో జపాన్‌కి చెందిన ఆటో మేకర్ కంపెనీ మజ్దాకి ఇండియాతో అనుబంధం ఉంది. స్వరాజ్ కంపెనీతో కలిసి గతంలో ఈ సంస్థ పలు వాహనాలను ఇండియన్ మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా ఎమర్జెన్సీ సమయంలో స్పందించే విధంగా సరికొత్త కారుని తయారు చేస్తోంది. కారులో అమర్చే ప్రత్యేకమైన కెమెరా సెన్సార్లు కారు చుట్టు పక్కలతో పాటు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని గమనిస్తుంటాయి. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకుంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు కారు నడిపే వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఎదురైనా, ప్రమాదాలు సంభవించినా వెంటనే అలెర్టయి పోతుంది. కారు వేగాన్ని తగ్గించి సురక్షితంగా రోడ్డు పక్కన ఆగేలా ఆటో పైలెట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. తద్వారా రోడ్డు యాక్సిడెంట్లను అరికట్టగలుగుతుంది. దీంతోపాటు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితులను అనుసరించి అంబులెన్స్, హస్పిటల్‌తో పాటు కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ మెజేస్ పంపిస్తుంది. 2025 కల్లా సిద్ధం కెమెరాల ద్వారా మనిషి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా స్పందిపంచే టెక్నాలజీపై మజ్ధా సంస్థ కొంత కాలంగా పని చేస్తోంది. అందులో భాగంగా సుకుబా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు ఇతర మెడికల్ ఎక్స్పర్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నిపుణులతో కలిసి టెక్నాలజీ డెవలప్ చేసింది. రియల్‌టైంలో మరికొన్ని సార్లు పరీక్షలు నిర్వహిస్తామని, ఏమైనా లోపాలు ఎదురైతే సవరించి 2025 కల్లా ఈ కొత్త టెక్నాలజీ కారును మార్కెట్లోకి తెస్తామంటూ మజ్దా ఘంటాపథంగా చెబుతోంది. ఎంట్రీ లెవల్‌కి కోటి రూపాయలు ఆపై ధర ఉన్న హైఎండ్ కార్లలో డ్రైవర్‌ను అలెర్ట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను కొన్ని కార్ల కంపెనీలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇందులో ఖర్చు అధికంగా ఉండే లేజర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. లేజర్ సాయం లేకుండా కేవలం కారులో అమర్చిన కెమెరాల ద్వారానే అలెర్ట్ సిస్టమ్ రూపొందించడమే టార్గెట్‌గా మజ్దా ముందుకు కదులుతోంది. ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే ఎంట్రీ, మిడ్ రేంజ్ కార్లలో కూడా భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని మజ్దా హామీ ఇస్తోంది. ఇది సాధ్యమేనా ఓనర్‌కి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎస్ఓఎస్ మెసేజ్‌లు పంపి రక్షించే టెక్నాలజీ యాపిల్ సంస్థ ఇటీవల పరిచయం చేసింది. జాగింగ్ వెళ్తూ గుండెపోటుకు గురైన వ్యక్తికి కేవలం యాపిల్ వాచ్ పంపిన మెసేజ్ కారణంగా సత్వరమే వైద్య సాయం అందింది. అతని ప్రాణాలు దక్కాయి. మజ్దా టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. -
ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. గత నెలలో 1,70,719 కార్లను తయారీ చేసింది. గతేడాది జులైలో 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యంలో 58 శాతం వృద్ధి నమోదయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే వాహన తయారీ గణాంకాలలో పెరుగుదల ఉన్నప్పటికీ ఈ పోలిక అర్ధవంతమైనది కాదని.. ఎందుకంటే గతేడాది జులైలో కరోనా అంతరాయం కారణంగా విక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరిగాయని తెలిపింది. 2018 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలోని ఉత్పత్తి సామర్థ్యం తక్కువేనని పేర్కొంది. ఈ ఏడాది జులైలో 1,67,825 ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయగా.. గతేడాది జులైలో ఇవి 1,05,345 యూనిట్లుగా ఉన్నాయి. మోడళ్ల వారీగా చూస్తే.. ఈ ఏడాది జులైలో ఆల్టో, ఎస్ప్రెస్సో 24,899 కార్లు తయారయ్యాయి. గతేడాది ఇదే నెలలో వీటి సంఖ్య 20,638గా ఉన్నాయి. వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్లు 55,390 యూనిట్ల నుంచి 90,604 యూనిట్లకు పెరిగాయి. అదేవిధంగా జిప్సీ, ఎర్టిగా, ఎస్–క్రాస్, విటారా బ్రెజా, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలు 19,130 నుంచి 40,094 యూనిట్లకు వృద్ధి చెందాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉత్పత్తి గత నెలలో 2,894 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది జులైలో ఇవి 2,342 యూనిట్లుగా ఉన్నాయి. చదవండి: మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా కొంటున్నారో మీకు తెలుసా? -
ఆడి ఆర్8 వీ10 ప్లస్@రూ. 2.62 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఆర్8 వీ10 ప్లస్ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 2.62 కోట్లు (హైదరాబాద్ ఎక్స్‌షోరూం). రేస్ కార్ అయిన ఆడి ఆర్8 ఎల్ఎంఎస్ మోడల్‌కు చెందిన 50 శాతం విడిభాగాలను వీ10 ప్లస్ తయారీలో వాడారు. 610 హెచ్పీతో 5.2 ఎఫ్ఎస్ఐ క్వాట్రో ఇంజన్‌ను పొందుపరిచారు. 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు. 31.24 సెంటీమీటర్ల స్క్రీన్‌తో వర్చువల్ కాక్‌పిట్ అదనపు ఆకర్షణ. వినూత్న టెక్నాలజీ కారణంగా.. రాత్రి వేళ కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు దాటగానే లేజర్ లైట్లు తెరుచుకుని అధిక కాంతిని ఇస్తాయని ఆడి హైదరాబాద్ ఎండీ రాజీవ్ ఎం. సంఘ్వీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇప్పటికే మూడు బుకింగ్స్ నమోదు అయ్యాయన్నారు. 9 ఏళ్లలో తమ షోరూం ద్వారా మొత్తం 2,700లకుపైగా కార్లు విక్రయించామని చెప్పారు. తమ అమ్మకాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వాటా 25 శాతమే అయినప్పటికీ, వృద్ధి రేటు ఏకంగా 35 శాతముందని అన్నారు.