హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.
2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.
కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్‌కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.
ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment