కార్ల తయారీలో సరికొత్త రికార్డు నమోదైంది. జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం (టయోటా) ఈ రికార్డును నెలకొల్పింది. కంపెనీ మొదలై 88 సంవత్సరాలు కాగా.. మొత్తం 30 కోట్ల కార్లు తయారు కావడం విశేషం. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో ఇన్ని కార్లు తయారు చేసిన కంపెనీ ఇంకోటి లేకపోవడం చెప్పుకోవాల్సిన విషయం.
1933లో టయోడా ఆటోమాటిక్ లూమ్ వర్క్స్‌లో భాగంగా కార్ల తయారీ ప్రారంభించింది ఈ కంపెనీ. మోడల్ -జీ1 కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ట్రక్కు. ఆ తరువాత 1937లో టయోటా మోటర్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కంపెనీ తయారు చేసిన కార్లు మొత్తం 30 కోట్లు. అయితే ఇందులో జపాన్‌లో ఉత్పత్తి అయినవాటితోపాటు ఇతర మార్కెట్లలోనివి కూడా చేర్చారు. జపాన్‌లో మొత్తం 18.05 కోట్ల కార్లు ఉత్పత్తి కాగా.. ఇతర దేశాల్లో తయారైనవి 11.96 కోట్లు. టయోటా 1941 నుంచి విస్తరణ పథం పట్టింది. టయోడా మెషీన్ వర్క్స్ (1941), టయోటా ఆటోబాడీ (1945) వంటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. 1960, 70లలో జపాన్‌లో తయారు చేసిన కార్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 1982లో టయోటా మోటర్ కంపెనీ కాస్తా... టయోటా మోటర్ కార్పొరేషన్ గా మారింది.
ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో
టయోటా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన 'కొరొల్లా' (Corolla) ఉత్పత్తి మొత్తం 5.33 కోట్ల కంటే కంటే ఎక్కువ. 1966 నుంచి ఈ సెడాన్ అనేక అప్డేట్స్ పొంది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికీ బాగా అమ్ముడుపోతోంది. భారతీయ మార్కెట్లో కూడా టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ.. మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment