ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ఒక్కసారిగా షాక్ ఉత్పత్తి నిలిపివేసి కస్టమర్లకు షాకిచ్చింది. జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అక్కడ మొత్తం 14 తయారీ కేంద్రాలలో ఈ రోజు (మంగళవారం) ఉత్పత్తి నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి సంస్థకు సంబంధించిన విడిభాగాల ఆర్డర్స్ పర్యవేక్షించే కంప్యూటర్ సిస్టంలో ఏర్పడిన లోపం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.
గ్లోబల్ మార్కెట్లో ఎక్కువ మంది వాహన వినియోగదారులు ఇష్టపడి కొనుగోలు చేసే బ్రాండ్లలో టయోటా ఒకటి. అయితే కంపెనీ ఉత్పత్తి నిలిపివేసిందనే వార్త కష్టమరల్లో ఒకింద భయాన్ని కలిగించింది. కాగా మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అంతే కాకుండా ఏ మోడల్స్ ఉత్పత్తులు నిలిచిపోయాయి అనేదానికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఇదే జరిగితే ఉద్యోగుల పంట పండినట్లే.. వర్క్ ఫ్లెక్సిబిలిటీ గురూ!
కరోనా వైరస్ విజృంభించిన సమయంలో సెమీ కండక్టర్ల కొరత కారణంగా గతంలో కూడా కంపెనీ ఉత్పత్తి కొన్ని రోజులు నిలిపివేసింది. కాగా ప్రస్తుతం ఈ సమస్య తొలగిపోయింది, కొత్త సమస్య పుట్టుకొచ్చింది. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment