4 ఏళ్లలో లక్ష కిలోమీటర్ల వారెంటీ | Renault Kwid Gets 4 Years/1 Lakh Km Standard Warranty | Sakshi
Sakshi News home page

4 ఏళ్లలో లక్ష కిలోమీటర్ల వారెంటీ

Published Thu, Apr 12 2018 12:02 PM | Last Updated on Thu, Apr 12 2018 2:40 PM

Renault Kwid Gets 4 Years/1 Lakh Km Standard Warranty - Sakshi

న్యూఢిల్లీ : రెనాల్ట్‌ ఇండియా తన బెస్ట్‌ సెల్లింగ్‌ కారు క్విడ్‌కు కొత్త వారెంటీ, రోడ్‌సైడ్‌ అసిస్టెన్సీ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్‌ కింద క్విడ్‌ వారెంటీ నాలుగేళ్లలో లక్ష కిలీమీటర్లుగా కంపెనీ నిర్ణయించింది. దీనిలో రెండేళ్లు 50 వేల కిలోమీటర్లు స్టాండర్డ్‌ వారెంటీ కాగ, మిగతా రెండేళ్లు 50 వేల కిలోమీటర్ల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ ఉంది. అన్ని క్విడ్‌ మోడల్స్‌కు ఈ వారెంటీ వర్తిస్తుందని రెనాల్ట్‌ పేర్కొంది.  దేశీయ ఆటో దిగ్గజమైన మారుతీ సుజుకీ తన పాపులర్‌ మోడల్‌ ఆల్టోకు రెండేళ్లలో కేవలం 40వేల కిలోమీటర్ల స్టాండర్డ్‌ వారెంటీనే అందిస్తోంది. హ్యుందాయ్‌ అయితే తన ఇయాన్‌కు మూడేళ్లలో లక్ష వారెంటీని ఆఫర్‌ చేస్తోంది. 

ఈ వారెంటీ పెంపుతో, క్విడ్‌ స్టాండర్డ్‌ వారెంటీ, ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర కార్ల కంటే అధికంగా ఉంది. రెనాల్ట్‌ ముందు నుంచి డ్యూరేషన్‌ లేదా మైలేజీ విషయంలో తన ప్రత్యర్థుల కంటే మెరుగైన స్టాండర్డ్‌ వారెంటీనే అందిస్తోంది. అయితే రెడీ-గో మాత్రం రెండేళ్లలో అపరిమిత వారెంటీని ఆఫర్‌ చేస్తోంది.  కొనుగోలుదారుల పరంగా చూసుకుంటే క్విడ్‌ వారెంటీ ఎక్కువ రక్షణగా ఉందని తెలుస్తోంది. 2017 క్విడ్‌ మోడల్స్‌పై కంపెనీ ఈ నెలలో పలు డిస్కౌంట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎంట్రీ-లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ మాన్యువల్‌, ఏఎంటీ వెర్షన్‌లకు రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement