kwid car
-
రెనో క్విడ్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా క్విడ్ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.4.49 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో 0.8 లీటర్, 1.0 లీటర్ పెట్రోల్ పవర్‌ట్రైన్స్‌తో క్విడ్ మై22 క్లైంబర్ శ్రేణి తయారైంది. ఈ మోడల్ భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉందని వివరించింది. -
రెనో క్విడ్ నియోటెక్ ఎడిషన్ ఆవిష్కరణ
సాక్షి, ముంబై: రెనో ఇండియా క్విడ్ నియోటెక్ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ క్విడ్‌కు మంచి డిమాండ్ ఉంటుందని రెనో ఆశిస్తోంది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో విడుదల కానుంది. 800 సీసీ, 1.0 లీటర్ మాన్యువల్, 1.0 లీటర్ ఏటీఎంల రూపంలో లభ్యమయ్యే ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.4,29,800 రూ.4,51,800, రూ.4,83,800 గా ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. దీని ఇంజిన్ 0.80 లీటర్ యూనిట్, 1.0 లీటర్ యూనిట్ ఆప్షన్లలో ఉన్నాయి. ఇందులో 0.80 లీటర్ యూనిట్ 53 బీహెచ్పీ శక్తిని, 72 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరొకటి 1.0 లీటర్ యూనిట్ 67 బీహెచ్పీ శక్తిని, 91 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్ 5–స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. అక్టోబర్ 1న బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు తొందర్లోనే ప్రారంభమవుతాయి. పండుగ సీజన్ సందర్భంగా కంపెనీ బ్రాండ్ శ్రేణి ధరల్ని స్వల్పంగా పెంచింది. Slide into the driver’s seat of the New #RenaultKWID NEOTECH EDITION, and take control with the steering wheel that comes with stylish Zanskar Blue and Chrome accents. Know more: https://t.co/6wwDGiaKTr pic.twitter.com/TNWIP6PvS9 — Renault India (@RenaultIndia) October 2, 2020 -
రెనో క్విడ్ ధరల పెంపు
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తన ‘క్విడ్’ మోడల్ కార్ల ధరలను పెంచనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మోడల్ కార్ల ధరలు 3% పెరగనున్నట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న క్విడ్ ధరల శ్రేణి ప్రస్తుతం రూ.2.66 లక్షల నుంచి రూ.4.63 లక్షల మధ్య ఉన్నది. మరోవైపు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన ధరలను ఏప్రిల్ 1 నుంచి రూ.25,000 మేర పెంచుతూ గతవారంలోనే నిర్ణయం తీసుకుంది. -
స్టయిలిష్‌గా కొత్త రెనాల్ట్ క్విడ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కొత్త కారును లాంచ్ చేసింది. తన ఎంట్రీ లెవల్ కారు రెనాల్ట్ క్విడ్ లో కొత్త కారును సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.2.67-4.63 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది, మెరుగైన భద్రతా ఫీచర్స్‌తో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని రెనాల్ట్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 0.8 లీటర్, 1లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో కొత్త క్విడ్ లభించనుంది. అత్యాధునిక భద్రత నిబంధనలతోపాటు, పాదచారుల భద్రతకు అనుగుణంగా తమ కొత్తకారు ఉంటుందనీ, ముఖ్యంగా ఏబీఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లాంటి ఫీచర్లను ఇందులో జోడించినట్టు కంపెనీ తెలిపింది. అలాగే స్పీడ్, ఎయిర్‌బ్యాగ్ రిమైండర్ ఫీచర్, 17.64 సెం.మీ టచ్ స్క్రీన్ మీడియా, నావిగేషన్ సిస్టం, కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తోపాటు ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్ ప్లేలకు అనుగుణంగా ఫుష్ టు టాక్ ఫీచర్ అందించినట్టు తెలిపింది. కాగా 2.75లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో భారత్ మార్కెట్లో రెనాల్ట్కు క్విడ్ విజయవంతమైన కారుగా నిలిచింది. Presenting the #Stylish #FeatureLoaded #RenaultKWID with a host of best-in-class safety features that ensure every ride is safe, comfortable and convenient. Know more: https://t.co/9gTCUKaJQA pic.twitter.com/TqrvkqdVLN — Renault India (@RenaultIndia) February 2, 2019 -
4 ఏళ్లలో లక్ష కిలోమీటర్ల వారెంటీ
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ కారు క్విడ్‌కు కొత్త వారెంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్సీ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద క్విడ్ వారెంటీ నాలుగేళ్లలో లక్ష కిలీమీటర్లుగా కంపెనీ నిర్ణయించింది. దీనిలో రెండేళ్లు 50 వేల కిలోమీటర్లు స్టాండర్డ్ వారెంటీ కాగ, మిగతా రెండేళ్లు 50 వేల కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారెంటీ ఉంది. అన్ని క్విడ్ మోడల్స్‌కు ఈ వారెంటీ వర్తిస్తుందని రెనాల్ట్ పేర్కొంది. దేశీయ ఆటో దిగ్గజమైన మారుతీ సుజుకీ తన పాపులర్ మోడల్ ఆల్టోకు రెండేళ్లలో కేవలం 40వేల కిలోమీటర్ల స్టాండర్డ్ వారెంటీనే అందిస్తోంది. హ్యుందాయ్ అయితే తన ఇయాన్కు మూడేళ్లలో లక్ష వారెంటీని ఆఫర్ చేస్తోంది. ఈ వారెంటీ పెంపుతో, క్విడ్ స్టాండర్డ్ వారెంటీ, ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర కార్ల కంటే అధికంగా ఉంది. రెనాల్ట్ ముందు నుంచి డ్యూరేషన్ లేదా మైలేజీ విషయంలో తన ప్రత్యర్థుల కంటే మెరుగైన స్టాండర్డ్ వారెంటీనే అందిస్తోంది. అయితే రెడీ-గో మాత్రం రెండేళ్లలో అపరిమిత వారెంటీని ఆఫర్ చేస్తోంది. కొనుగోలుదారుల పరంగా చూసుకుంటే క్విడ్ వారెంటీ ఎక్కువ రక్షణగా ఉందని తెలుస్తోంది. 2017 క్విడ్ మోడల్స్‌పై కంపెనీ ఈ నెలలో పలు డిస్కౌంట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్, ఏఎంటీ వెర్షన్లకు రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
రూ. 3-4 లక్షలకే రెనో చిన్నకారు.. క్విడ్
⇒ క్విడ్ కారుతో ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లోకి ⇒ ధరరూ.3-4 లక్షల రేంజ్లో ⇒ సెప్టెంబర్-అక్టోబర్ కల్లా అందుబాటులోకి చెన్నై: ఫ్రాన్స్‌కు చెందిన రెనో కంపెనీ ఎంట్రీ లెవెల్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. చూడటానికి ఎస్‌యూవీలా ఉండే చిన్న కారు ‘క్విడ్’ను బుధవారం ఆవిష్కరించింది. మారుతీ సుజుకీ ఆల్టో(రూ.2.83 లోల నుంచి రూ.3.4 లక్షలు), హ్యుందాయ్ ఇయాన్ (రూ.3.09 లక్షల నుంచి రూ.4.22 లక్షలు)లకు ఈ క్విడ్ కారు గట్టిపోటీనివ్వగలదని రెనో గ్రూప్ చైర్మన్, సీఈఓ కార్లోస్ గోన్ తెలిపారు. ఈ కారు ధర రూ. 3లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్లో ఉండొచ్చని పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగల(సెప్టెంబర్-నవంబర్ కల్లా) సీజన్‌కల్లా ఈ కారును మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. రూ.3,000 కోట్ల పెట్టుబడులతో ఈ కారును డెవలప్ చేశామని వివరించారు.. మినీ డస్టర్‌లా ఉండే ఈ క్విడ్ కారును 800 సీసీ ఇంజిన్‌తో రూపొందించామని ఈ సెగ్మెంట్లోనే అత్యుత్తమ మైలేజీనిస్తుందని పేర్కొన్నారు. భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ రెనో నుంచి అత్యంత చౌకగా లభ్యమవుతున్న కారు ఇదే. క్విడ్ కీలకం... భారత కార్ల మార్కెట్లో ప్రస్తుతం తమ వాటా 1.5 శాతమని కార్లోస్ చెప్పారు. 5 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని, క్విడ్ కారుతో దానిని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లోనే కాకుండా ఇతర వృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా తమ అమ్మకాల వృద్ధికి క్విడ్ కీలకం కానున్నదని వివరించారు. క్విడ్ తయారీలో 98 శాతం వరకూ స్థానిక విడిభాగాలనే వినియోగించామని పేర్కొన్నారు. ఈ కొత్త కారును భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతులు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. ఫ్రాన్స్, జపాన్, భారత్‌ల నైపుణ్యాలు మేళవించి ఈ కారును తయారు చేశామని తెలిపారు. నాలుగేళ్లలో చైనా, అమెరికా, జపాన్ల తర్వాత నాలుగో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ ఎస్యూవీ డస్టర్, ఎంపీవీ లాడ్జీ, పల్స్, ఫ్లూయెన్స్ కొలియోస్, స్కేలా... మొత్తం ఆరు మోడళ్లను విక్రయిస్తోందని పేర్కొన్నారు. ప్రత్యేకతలు... రెనో డిజైన్ చేసిన కొత్త కామన్ మాడ్యుల్ ఫ్యామిలి(సీఎంఎఫ్-ఏ) ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును రూపొం దించారు. చూడటానికి మినీ డస్టర్‌లాగా కనిపించే ఈ కారులో బ్లూ టూత్ కనెక్టివిటీ ఉన్న 6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ నావిగేషన్, డిజిటల్ స్పీడో మీటర్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్), 800 సీసీ, 3- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి. డస్టర్, లాడ్జీ కారుల్లో మాదిరే ఇంటీరియర్ డిజైన్ ఈ కారులో ఉంది. ఈ సెగ్మెంట్ కార్లలో విశాలమైన లెగ్‌రూమ్ ఉన్న కారు ఇదేనని కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఫీచరున్న వేరియంట్‌నూ కంపెనీ అందించనున్నది. ఈ కారులో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు.