సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కొత్త కారును లాంచ్ చేసింది. తన ఎంట్రీ లెవల్ కారు రెనాల్ట్ క్విడ్ లో కొత్త కారును సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.2.67-4.63 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది, మెరుగైన భద్రతా ఫీచర్స్‌తో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని రెనాల్ట్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
0.8 లీటర్, 1లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప‍్షన్లలో కొత్త క్విడ్ లభించనుంది. అత్యాధునిక భద్రత నిబంధనలతోపాటు, పాదచారుల భద్రతకు అనుగుణంగా తమ కొత్తకారు ఉంటుందనీ, ముఖ్యంగా ఏబీఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లాంటి ఫీచర్లను ఇందులో జోడించినట్టు కంపెనీ తెలిపింది. అలాగే స్పీడ్, ఎయిర్‌బ్యాగ్ రిమైండర్ ఫీచర్, 17.64 సెం.మీ టచ్ స్క్రీన్ మీడియా, నావిగేషన్ సిస్టం, కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తోపాటు ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్ ప్లేలకు అనుగుణంగా ఫుష్ టు టాక్ ఫీచర్ అందించినట్టు తెలిపింది. కాగా 2.75లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో భారత్ మార్కెట్‌లో రెనాల్ట్‌కు క్విడ్ విజయవంతమైన కారుగా నిలిచింది.
Presenting the #Stylish #FeatureLoaded #RenaultKWID with a host of best-in-class safety features that ensure every ride is safe, comfortable and convenient.
— Renault India (@RenaultIndia) February 2, 2019
Know more: https://t.co/9gTCUKaJQA pic.twitter.com/TqrvkqdVLN
Comments
Please login to add a commentAdd a comment