![PURE EV ecoDryft electric motorcycle revealed - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/24/PURE-EV.jpg.webp?itok=n7lJPy3O)
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ప్యూర్ ఈవీ తమ కొత్త మోటార్ సైకిల్ వేరియంట్ ఎకోడ్రిఫ్ట్ 350ని ఆవిష్కరించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే 171 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ప్రతి రోజూ ఎక్కువ దూరాలు ప్రయాణించే వినియోగదారులకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని సంస్థ తెలిపింది. దీనితో నెలవారీగా రూ. 7,000 పైచిలుకు ఆదా కాగలదని వివరించింది.
దీని ధర రూ. 1,29,999గా ఉంటుందని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వదేరా తెలిపారు. సులభతరమైన ఈఎంఐ సదుపాయం రూ. 4,000 నుంచి ఉంటుందని పేర్కొన్నారు. 110 సీసీ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి మోటార్‌సైకిల్స్‌తో దీటుగా పోటీపడగలిగేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇందులో రివర్స్ మోడ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 75 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.
Comments
Please login to add a commentAdd a comment