
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తన ‘క్విడ్’ మోడల్ కార్ల ధరలను పెంచనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మోడల్ కార్ల ధరలు 3% పెరగనున్నట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.
మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న క్విడ్ ధరల శ్రేణి ప్రస్తుతం రూ.2.66 లక్షల నుంచి రూ.4.63 లక్షల మధ్య ఉన్నది. మరోవైపు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన ధరలను ఏప్రిల్ 1 నుంచి రూ.25,000 మేర పెంచుతూ గతవారంలోనే నిర్ణయం తీసుకుంది.