దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. నేటి నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.21 పెంచాయి. నేటి నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50గా ఉంది.
నవంబర్ 16న దీని ధర తగ్గించడంతో రూ.1775.50గా ఉండేది. నేటి నుంచి ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1749, కోల్‌కతాలో రూ.1885.50, చెన్నైలో రూ.1968.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్‌ల ఆహార విక్రయాలపై ప్రభావం చూపనుంది.
అయితే 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ సిలిండర్ ఢిల్లీలో రూ.903కి అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 ధరలకు లభిస్తోంది.
ఇది కూడా చదవండి: అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే!
Comments
Please login to add a commentAdd a comment