హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్‌ విటారా కార్లు! | Maruti Suzuki Grand Vitara Marks 1 Lakh Unit Sales In One Year | Sakshi
Sakshi News home page

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్‌ విటారా కార్లు!

Published Sat, Sep 30 2023 10:02 AM | Last Updated on Sat, Sep 30 2023 10:53 AM

1 Lakh Unit Is Grand Vitara Car Sales In One Year - Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజికి విడుదల చేసిన కార్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఆ సంస్థ మార్కెట్‌కి పరిచయం చేసిన మారుతీ గ్రాండ్‌ విటారా  ఏడాదిలోనే లక్ష కార్లు అమ్ముడు పోయాయి. అంచనా ప్రకారం.. నెలకు సుమారు 8,333 కార్లను విక్రయాలు జరిగాయి. తద్వారా దేశీయంగా మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో వేగంగా వేగంగా సేల్స్‌ జరిగిన కార్ల జాబితాలో గ్రాండ్‌ విటారా చోటు దక్కించుకోవడం గమనార్హం.

ప్రత్యర్ధులకు పోటీగా 
ఇతర ఆటోమొబైల్‌ సంస్థలకు పోటీగా మారుతి మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ కార్లను డిజైన్‌ చేసింది. ఈ వేరియంట్‌లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్, హోందయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, హోండా ఎలివేట్‌, స్కోడా కుషాక్‌, వోక్స్‌వేగన్‌ టైగన్‌, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, ఎంజీ ఆస్టర్‌లు ఉన్నాయి. అయితే, బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించిన ఎస్‌యూవీలలో హైరైడర్, గ్రాండ్ విటారాలు మాత్రమే ఉన్నాయి. ఇ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన గ్రాండ్‌ విటారా ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రీడ్‌ వేరియంట్‌ లీటరుకు 27.97 కి.మీల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
  
ఈ సందర్భంగా, మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ,‘గత ఏడాది విడుదలైన గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఔత్సాహికులకు కొత్త డ్రైవింగ్‌ అనుభూతిని అందిస్తూ కొత్త శకానికి నాంది పలికింది. ఎస్‌యూవీ వేరియంట్‌లో 22 శాతం వాటాతో మారుతి సుజికి వేగంగా వృద్ది సాధించిందని అన్నారు. 

గ్రాండ్‌ విటారా ధర 
గ్రాండ్ విటారా ధర ప్రస్తుతం రూ. 10.70 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంది (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement