
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ పర్పస్ వెహికల్ ట్రైబర్ ఒక లక్ష యూనిట్ల విక్రయాల మార్కును దాటిందని వాహన తయారీ సంస్థ రెనో ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ విడుదల చేసింది.
ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.7.24 లక్షలు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైంది. మాన్యువల్‌తోపాటు ఈజీ–ఆర్ ఆటోమేటెడ్ మాన్యువ ల్ ట్రాన్స్‌మిషన్స్‌తో లభిస్తుంది. స్టీరింగ్ మౌం టెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్, సిక్స్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, గైడ్‌లైన్స్‌తో రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి.
2019 ఆగస్ట్‌లో దేశంలో ట్రైబర్ రంగ ప్రవేశం చేసింది. రెనోకు చెందిన ఫ్రాన్స్, భారత బృం దాలు ఈ కారు రూపకల్పనలో పాలుపంచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment