Reno India Company
-
అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో 9 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. 11 ఏళ్లలో ఈ ఘనతను సాధించామని కంపెనీ తెలిపింది. మేడ్ ఇన్ ఇండియా వాహనాల విక్రయాలను రెనో ఇండియా 2012లో భారత్‌లో ప్రారంభించింది. (ఇదీ చదవండి: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు) ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ క్విడ్, కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్, మల్టీపర్పస్ వెహికిల్ ట్రైబర్ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ‘టాప్–5 మార్కెట్లలో గ్రూప్ రెనో సంస్థకు భారత్ ఒకటి. భారత్ కోసం స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకున్నాము. బలమైన ఉత్పత్తి, ప్రణాళికను రూపొందించాము. భవిష్యత్తు ఉత్పత్తుల శ్రేణిలో స్థానికీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చాం’ అని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి ఈ సందర్భంగా తెలిపారు. -
లక్ష మార్కును దాటిన రెనో ట్రైబర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ పర్పస్ వెహికల్ ట్రైబర్ ఒక లక్ష యూనిట్ల విక్రయాల మార్కును దాటిందని వాహన తయారీ సంస్థ రెనో ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.7.24 లక్షలు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైంది. మాన్యువల్‌తోపాటు ఈజీ–ఆర్ ఆటోమేటెడ్ మాన్యువ ల్ ట్రాన్స్‌మిషన్స్‌తో లభిస్తుంది. స్టీరింగ్ మౌం టెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్, సిక్స్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, గైడ్‌లైన్స్‌తో రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. 2019 ఆగస్ట్‌లో దేశంలో ట్రైబర్ రంగ ప్రవేశం చేసింది. రెనోకు చెందిన ఫ్రాన్స్, భారత బృం దాలు ఈ కారు రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. -
రెనో క్విడ్ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ‘రెనో ఇండియా’ తాజాగా తన ప్రముఖ చిన్న కారు ‘క్విడ్’లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.2.67 లక్షలు – రూ.3.87 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త 2018 ఎడిషన్‌లో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ సహా పది కొత్త ఫీచర్లను పొందుపరిచినట్లు కం పెనీ తెలిపింది. ఇది 0.8 లీటరు, 1.0 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, వన్‌టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, రేడియో స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్ కంట్రోల్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని తెలిపింది. -
రెనో కార్ల ధరలు 2.5 శాతం పెంపు
న్యూఢిల్లీ: రేనో ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రెండున్నర శాతం వరకూ పెంచుతోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంచెమైనా తట్టుకునేందుకు ధరలను పెంచక తప్పడం లేదని రెనో ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాఫెల్ ట్రెగర్ చెప్పారు. ధరల పెరుగుదల వచ్చే నెల 1 నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఉత్పత్తి వ్యయాల పెంపును తట్టుకోగలిగామని, కానీ ముడి సరుకుల ధరలు పెరుగుతున్నందున కార్ల ధరలను పెంచక తప్ప డం లేదని వివరించారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయంటూ ఇప్పటికే పలు కార్ల కంపెనీలు ధరలను పెంచాయి. నిస్సాన్ ఇండియా రూ.18,000 వరకూ, మారుతీ సుజుకి 2-4 శాతం వరకూ, హ్యుందాయ్ రూ.25,000 వరకూ, బీఎండబ్ల్యూ 5 శాతం వరకూ పెంచాయి. జనరల్ మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కూడా ధరలను పెంచాయి.