జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూఇయర్ సందర్భంగా రెనాల్ట్ ఇండియా కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులకు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులకు క్యాష్ డిస్కౌంట్‌లు,ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది.
రెనాల్ట్ ట్రైబర్ ప్రీ ఎంఐ 2021, ఎంఐ 2021
రెనాల్ట్ ట్రైబర్ ఎంఐ 2021 మోడల్ కొనుగోలుపై రూ.25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ (కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల జాబితా) పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులకు ప్రీ ఎంఐ 2021, ఎంఐ 2021 మోడల్‌లపై రూ.5,000 తగ్గింపు పొందవచ్చు.
రెనాల్ట్ డస్టర్
నవంబర్ 2021 లో డస్టర్ ఆఫర్‌లలో రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 30,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. రైతులు, సర్పంచ్ గ్రామ పంచాయతీ సభ్యులకు రూ.15,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, డస్టర్ 1.5 ఆర్ ఎక్స్ జెడ్ ట్రిమ్ ఇటీవల రూ. 46,060 ధర తగ్గింపును పొందింది. ఈ విధంగా, ఈ వేరియంట్‌పై ఆఫర్ రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తుంది.
రెనాల్ట్ క్విడ్
హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 10,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ (1.0-లీటర్ మోడల్‌కు రూ. 15,000 మరియు 0.8-లీటర్ వెర్షన్‌లకు రూ. 10,000), రూ. 10,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాహనం కొనుగోలుపై రూ. 5,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్టాక్ సప్లయ్ డిమాండ్‌కు తగ్గట్లు 2020 మోడల్‌లకు రూ. 10,000 తగ్గింపు వర్తిస్తుంది.
రెనాల్ట్ కిగర్
రెనాల్ట్ కిగర్, కాంపాక్ట్ ఎస్‌యూవీ రూ 10,000, రూ 10,000 వరకు ఒక కార్పొరేట్ డిస్కౌంట్ ,రూ 5,000 గ్రామీణ ఆఫర్ వరకు ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. పైన పేర్కొన్న ఆఫర్‌లు 31 డిసెంబర్ 2021 మాత్రమే అందుబాటులో ఉంటాయని రెనాల్ట్ ప్రతినిధులు వెల్లడించారు.
చదవండి: సర్వే: యువతకు ఏ కార్లు అంటే ఇష్టం, వాళ్లకి కారు కొనే సామర్ధ్యం ఉందా?!
Comments
Please login to add a commentAdd a comment