టాటా, రెనో వాహన ధరలు తగ్గాయ్..
రూ. 2.17 లక్షల వరకు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీలు ‘టాటా మోటార్స్’, ‘రెనో ఇండియా’ తాజాగా వాహన ధరలను రూ.2.17 లక్షల వరకు తగ్గించాయి. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. టాటా మోటార్స్ తన ప్యాసెంజర్ వాహన ధరలను రూ.3,300–రూ.2.17 లక్షల శ్రేణిలో తగ్గించింది. ఎస్‌యూవీ హెక్జా ధరలో రూ.1.04 లక్షలు–రూ.2.17 లక్షల శ్రేణిలో కోత విధించింది.
హ్యాచ్‌బ్యాక్ టియాగో ధరను రూ.52,000 వరకు, కాంపాక్ట్ సెడాన్ టిగోర్ ధరను రూ.60,000 వరకు తగ్గించింది. ఇక రెనో వాహన ధరల తగ్గుదల రూ.5,200–రూ.1.04 లక్షల శ్రేణిలో ఉంది. కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ క్విడ్ క్లింబర్ ఏఎంటీ ధరను రూ.5,200–రూ.29,500 శ్రేణిలో, ఎస్‌యూవీ డస్టర్ ఆర్‌ఎక్స్‌జెడ్ ఏడబ్ల్యూడీ ధరను రూ.30,400–రూ.1.04 లక్షల శ్రేణిలో, లాడ్జీ స్టెప్‌వే ఆర్‌ఎక్స్‌జెడ్ ధరను రూ.25,700–రూ.88,600 శ్రేణిలో తగ్గించింది.