దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ వాహనాలు సుమారు 2 శాతం పెరగనున్నాయి. జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా తమ వాహనాల రేట్లను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ బుధవారం తెలిపింది.
టాటా మోటార్స్ ప్రస్తుతం కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. జెన్ నెక్ట్స్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా భారత్, బ్రిటన్, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియాల్లో ఈ వాహనాలను డిజైన్ చేస్తున్నారు. ఈ వాహనాలన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటాయి. ఆదాయం పరంగా దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ చివరిసారిగా మార్చిలో తన వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచింది.
2024 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ఆదాయం 52.44 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టాటా మోటార్స్ షేరు కూడా మంచి పనితీరును కనబరుస్తోంది. 26.6 శాతం పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కంపెనీ షేరు ప్రస్తుతం (బుధవారం మధ్యాహ్నం) రూ.983 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా ఇది నిరంతరాయంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా పలుమార్లు రూ.1000 మార్కును దాటింది.
Comments
Please login to add a commentAdd a comment