
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్ష్ మరోసారి షాకిచ్చింది. కమర్షియల్ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడల్స్ అందులోని వేరియంట్లను బట్టి ఈ పెంపు 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యంగా మారిందని టాటా ప్రకటించింది.
గత ఫిబ్రవరిలో ప్యాసింజర్ వెహికల్ ధరలు టాటా పెంచింది. ఆ సమయంలో లారీలు, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ వంటి కమర్షియల్ వాహనాలకు ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఇది రెండు నెలలకు మించి కొనసాగలేదు. పెరిగిన ఇన్‌పుట్ కాస్ట్ కారణంగా కమర్షియల్ సెగ్మెంట్‌లోనూ ధరలు పెంచుతూ టాటా నిర్ణయం తీసుకుంది.
గతేడాది అమ్మకాలతో పోల్చితే కమర్షియల్ సెగ్మెంట్‌లో వాహనాల అమ్మకాల్లో టాటా పురోగతి సాధించింది. 2021లో మే వరకు 26,661 వాహనాల అమ్మకాలు జరగగా 2022 మే వరకు ఏకంగా మూడు రెట్లు పెరిగి 76,210 కమర్షియల్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. కానీ తాజ పెంపు ఈ సానుకూల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
చదవండి: వారెవ్వా ! అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్కార్పియో ఎన్