Commercial vehicles
-
ఏటా పెట్టుబడి.. 2,000 కోట్లు
న్యూఢిల్లీ: కొత్త వాణిజ్య వాహనాలు, యంత్ర పరికరాల అభివృద్ధిపై ఏటా దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడిని కొనసాగిస్తామని టాటా మోటార్స్ ఈడీ గిరీశ్ వాఘ్ వెల్లడించారు. ఇందులో ఎలక్ట్రిఫికేషన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, కనెక్టెడ్ వెహికిల్ ప్లాట్‌ఫామ్ వంటి నూతన సాంకేతికతలపై 40 శాతంపైగా వెచి్చస్తామన్నారు. సంస్థకు చెందిన వాణిజ్య వాహన విభాగం ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఉద్గారాలను వెదజల్లని బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వంటి వివిధ సాంకేతికతలపై పని చేస్తోందని చెప్పారు. సున్నా ఉద్గారాల దిశగా పరివర్తన వెంటనే జరగదు కాబట్టి అన్ని ప్రత్యామ్నాయ ఇంధనాలపై పని చేస్తున్నామని అన్నారు. ‘నగరాలు, సమీప దూరాలకు బ్యాటరీ వాహనాలు పనిచేస్తాయి. సుదూర ప్రాంతాలకు, అధిక సామర్థ్యానికి హైడ్రోజన్ వంటి సాంకేతికత అవసరం. ఇటువంటి అవసరాలన్నింటినీ పరిష్కరించే సాంకేతికతలలో పెట్టుబడి పెట్టాం’ అని వివరించారు. హైడ్రోజన్ ట్రక్స్.. హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ట్రక్స్‌ను మార్చిలోగా పైలట్ ప్రాతిపదికన వినియోగిస్తామని గిరీశ్ వాఘ్ వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఐవోసీఎల్‌తో కలిసి కంపెనీ 18 నెలల పాటు మూడు రూట్లలో ఈ ట్రక్కులను నడుపనుంది. ఫలితాలను బట్టి వాహనాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టు వాఘ్ పేర్కొన్నారు. కంపెనీ తయారు చేసిన 15 ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ బస్‌లు ఐవోసీఎల్ 10 నెలలుగా వినియోగిస్తోందని వివరించారు. ఒకట్రెండేళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ వాహనాలను వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెప్పారు. -
తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..
ముంబై: దేశంలో ఈ ఏడాది మార్చి నాటికి 15 ఏళ్ల జీవిత కాలం పూర్తయిన మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు (ఎంఅండ్హెచ్సీవీలు) 11 లక్షల మేర ఉంటాయని, నిబంధనల ప్రకారం ఇవన్నీ తుక్కు కిందకు వెళ్లాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. కానీ, గడువు ముగిసిన తర్వాత కూడా వాటిని నడిపిస్తుండడం వల్ల తుక్కు కిందకు మారేవి వాస్తవంగా ఇంతకంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.వీటిల్లో కొంత మేర తుక్కుగా మారినా కానీ, వాణిజ్య వాహన అమ్మకాల డిమాండ్‌కు కొంత మేర మద్దతుగా నిలవొచ్చని పేర్కొంది. ‘వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరేషన్ ప్రోగ్రామ్’ లేదా స్క్రాపేజీ పాలసీని 2021 మార్చిలో ప్రకటించగా.. 2023 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తుండడం గమనార్హం. మొదటి దశలో 15 ఏళ్ల జీవిత కాలం ముగిసిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వచి్చన రెండో దశలో భాగంగా.. వాహనం వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్ ఆధారంగా తుక్కుగా మార్చడం తప్పనిసరి చేశారు. అంటే నిబంధనలకు మించి కాలుష్యం విడుదల చేసే వాహనాలను కాలంతో సంబంధం లేకుండా తుక్కుగా మార్చనున్నారు.మరో 5.7 లక్షల వాహనాలు.. 2027 మార్చి నాటికి మరో 5.7 లక్షల వాహనాలు 15 ఏళ్ల జీవిత కాలం పూర్తి చేసుకుంటాయని ఇక్రా తెలిపింది. మొదటి దశలో భాగంగా 9 లక్షల ప్రభుత్వ వాణిజ్య వాహనాలు తుక్కుగా మార్చడం వంటివి కొత్త వాహన కొనుగోళ్ల డిమాండ్‌ను పెంచనున్నట్టు అంచనా వేసింది. ఇక ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల వినియోగం తక్కువగా ఉన్నందున ఈ విభాగాల నుంచి తుక్కుగా మారేవి తక్కువగానే ఉండొచ్చని ఇక్రా తెలిపింది. స్క్రాపేజీ పాలసీ అమల్లోకి వచ్చినప్పటికీ వాహన యజమానుల నుంచి స్పందన పరిమితంగానే ఉన్నట్టు ఇక్రా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 ఆగస్ట్ 31 నాటికి వాహన తుక్కు కేంద్రాలు కేవలం 44,803 ప్రైవేటు వాహనాలు, 41,432 ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన స్క్రాప్ దరఖాస్తులనే అందుకున్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది.దీర్ఘకాలంలో ప్రయోజనాలు.. ‘‘వాహన తుక్కు విధానంతో దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలున్నాయి. పాత వాహనాలను తుక్కు గా మార్చడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. ఫ్లీట్ ఆధునికీకరణ (కొత్త వాహన కొనుగోళ్లు) కార్యక్రమానికి ఇది దారితీస్తుంది. మొత్తం మీద ఆటో పరిశ్రమలో అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుంది. ఆటోమోటివ్ ఓఈఎంలకు ముడి సరుకుల వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజాల్ షా వివరించారు. -
టాటా వాహనాలకు ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాణిజ్య వాహన కస్టమర్లకు రుణాలను అందించేందుకు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు టాటా మోటర్స్ తెలిపింది. భవిష్యత్తులో అన్ని వాణిజ్య వాహనాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ 55 టన్నుల వరకు సామర్థ్యం గల కార్గో వాహనాలను తయారు చేస్తోంది. అలాగే పికప్స్, ట్రక్స్తోపాటు 10 నుంచి 51 సీట్ల బస్‌లను సైతం విక్రయిస్తోంది. -
ఈ కంపెనీ వాహనాలు ఇప్పుడే కొనేయండి.. లేటయితే..
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ వాహనాలు సుమారు 2 శాతం పెరగనున్నాయి. జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా తమ వాహనాల రేట్లను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ బుధవారం తెలిపింది.టాటా మోటార్స్ ప్రస్తుతం కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. జెన్ నెక్ట్స్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా భారత్, బ్రిటన్, అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియాల్లో ఈ వాహనాలను డిజైన్ చేస్తున్నారు. ఈ వాహనాలన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటాయి. ఆదాయం పరంగా దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ చివరిసారిగా మార్చిలో తన వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచింది.2024 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ఆదాయం 52.44 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టాటా మోటార్స్ షేరు కూడా మంచి పనితీరును కనబరుస్తోంది. 26.6 శాతం పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కంపెనీ షేరు ప్రస్తుతం (బుధవారం మధ్యాహ్నం) రూ.983 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా ఇది నిరంతరాయంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా పలుమార్లు రూ.1000 మార్కును దాటింది. -
కమర్షియల్ వాహనాలకు ఎలక్షన్స్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు 2024–25లో 4–7 శాతం తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున మౌలిక సదుపాయాల కార్యకలాపాలలో విరామం కారణంగా జనవరి–మార్చి త్రైమాసికంలో వాణిజ్య వాహనాల విక్రయాలు స్తబ్దుగా ఉంటాయని అంచనా. దేశీయ సీవీ పరిశ్రమ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. సీవీల కోసం దీర్ఘకాలిక డిమాండ్ చెక్కుచెదరకుండా ఉంటుంది. మౌలిక రంగ మూలధన వ్యయంపై నిరంతర దృష్టి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ, తయారీ కార్యకలాపాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి కమర్షియల్ వెహికిల్స్ పరిశ్రమకు దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉంటుంది. సమీప కాలంలో సార్వత్రిక ఎన్నికల ప్రారంభంతో కొన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాల్లో అస్థిర నియంత్రణల మధ్య పరిమాణం అధిక స్థాయిలో ఉండవచ్చు’ అని ఇక్రా తెలిపింది. -
జోరు తగ్గిన వెహికల్ సేల్స్ - కారణం ఇదే అంటున్న ఫాడా..!
ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు ఏప్రిల్‌లో నాలుగు శాతం తగ్గినట్లు భారత వాహన డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో మొత్తం 17,24,935 వాహనాలు విక్రయంగా.., గతేడాదిలో ఇదే నెలలో 17,97,432 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన, ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్‌లో నీరసించాయి. ఇందులో ద్విచక్ర వాహన విక్రయాలు 7%, ప్యాసింజర్ వాహనాలు ఒకశాతం పడిపోయినట్లు ఫాడా తెలిపింది. ‘‘ఉద్గార ప్రమాణ నిబంధనలతో ఈ ఏప్రిల్ ఒకటి నుంచి పెరుగనన్న వాహనాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు మార్చిలోనే ముందస్తు కొనుగోళ్లు చేపట్టారు. అలాగే అధిక బేస్ ఎఫెక్ట్ ఒక కారణంగా నిలిచింది. వెరసి గడిచిన ఎనిమిది నెలల్లో తొలిసారి ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి క్షీణత నమోదైంది’’ ఫాడా తెలిపింది. అయితే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల వాహన డీలర్‌షిప్‌ల వద్ద వినియోగదారుల ఎంక్వైరీ పెరిగాయి. మే నెల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫాడా ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే త్రీ–వీలర్స్, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరిగింది. త్రీ–వీలర్ అమ్మకాలు 57 శాతంతో గణనీయమైన వృద్ధిని సాధించాయి. ట్రాక్టర్ విక్రయాలు ఒక శాతం, వాణిజ్య వాహనాలు 2 శాతంతో స్వల్పంగా పెరిగాయి. ‘‘ గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన ప్యాసింజర్ విభాగం గత నెలలో నెమ్మదించింది. ద్విచక్ర వాహనాల విభాగం కరోనా ముందు కంటే 19 శాతం వెనకబడే ఉంది. ఈ విభాగంపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీని 18 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ విభాగం మొత్తం ఆటో అమ్మకాల్లో 75 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున జీఎస్టీ తగ్గింపు ద్విచక్ర వాహన అమ్మకాల పునరుద్ధరణకు దోహదపడుతుంది’’ అని సింఘానియా అన్నారు. -
టాటామోటార్స్: వాణిజ్య వాహనాల ధరలు 5 శాతం పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను మోడల్, వేరియంట్‌నుబట్టి 5 శాతం వరకు పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయి. వచ్చే నెల నుంచి అమలులోకి వస్తున్న బీఎస్–6 రెండవ దశ కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేసిన నేపథ్యంలో ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ఇది కూడా చదవండి కిమ్స్‌లో వాటాను విక్రయించిన పోలార్ క్యాపిటల్ న్యూఢిల్లీ: వైద్య సేవల్లో ఉన్న కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (కిమ్స్) 1.38 శాతం వాటాలను పోలార్ క్యాపిటల్ ఫండ్స్ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. వీటి విలువ రూ.143.7 కోట్లు. డిసెంబర్ త్రైమాసికంలో కిమ్స్‌లో పోలార్‌కు 1.87 శాతం వాటాలు ఉన్నాయి. -
వృద్ధి బాటలో వాణిజ్య వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహన విక్రయాలు 2023–24లో 9–11 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. 6 శాతం ఆర్థిక వృద్ధి అంచనాలు, అలాగే మధ్య, భారీ వాణిజ్య వాహన విభాగంలో పెద్ద ఎత్తున విక్రయాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ‘మౌలిక రంగానికి బడ్జెట్లో పెరిగిన కేటాయింపులు డిమాండ్‌కు మద్ధతు ఇస్తాయి. దేశీయ వాణిజ్య వాహన విపణిలో వృద్ధి నమోదు కానుండడం వరుసగా ఇది మూడవ ఆర్థిక సంవత్సరంగా నిలుస్తుంది. తేలికపాటి వాణిజ్య వాహన విభాగం 8–10 శాతం వృద్ధి ఆస్కారం ఉంది. ఇదే జరిగితే కోవిడ్ ముందస్తు 2019ని మించి అమ్మకాలు నమోదు కానున్నాయి. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు 13–15 శాతం అధికం అయ్యే చాన్స్ ఉంది. ఈ విభాగం విక్రయాలు 2024–25లో కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకోనున్నాయి. 2021–22లో పరిశ్రమ 31 శాతం దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వాణిజ్య వాహన రంగం 27 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. కంపెనీల నిర్వహణ లాభాలు 2023–24లో నాలుగేళ్ల గరిష్టం 7–7.5 శాతానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం పెరగవచ్చు’ అని క్రిసిల్ వివరించింది. -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ: అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి 2 శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. పెరిగిన తయారీ ధరల భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకే ధరలను పెంచాల్సి వస్తున్నట్టు వివరణ ఇచ్చింది. పెరిగిన వ్యయాల్లో ఎక్కువ మొత్తాన్ని తామే సర్దుబాటు చేసుకున్నట్టు, కొంత మేర కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తున్నట్టు పేర్కొంది. జనవరి నుంచి రేట్లను పెంచనున్నట్టు టాటా మోటార్స్ లోగడే ప్రకటించగా, తాజాగా ఎంత మేర పెంచేదీ ప్రకటించింది. చదవండి: మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..! ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
వాహనాలకు స్పీడ్ బ్రేకర్లుగా సీఎన్జీ ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది. మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్జీ, డీజిల్ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్ ఇంధనంపైనా ఫోకస్ చేస్తున్నాయి. సీఎన్జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు.. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది. -
వాహన కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కఠినతరమైన ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కార్లు, వాణిజ్య వాహనాల రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి స్థాయి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దాలంటే కంపెనీలు మరింత అధునాతనమైన విడిభాగాలు, పరికరాలను వాహనాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కంపెనీలు ఈ భారాన్ని అంతిమంగా కొనుగోలుదారులకే బదలాయిస్తాయి. కొత్త ప్రమాణాల ప్రకారం ఎప్పటికప్పుడు ఉద్గారాల స్థాయులను పర్యవేక్షించేందుకు వాహనాల్లో సెల్ఫ్–డయాగ్నోస్టిక్ డివైజ్‌ను అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ కాలుష్యకారక వాయువులు నిర్దేశిత ప్రమాణాలను దాటిపోతే వాహనాన్ని సర్వీస్‌కు ఇవ్వాలంటూ వార్నింగ్ లైట్ల ద్వారా ఈ పరికరం తెలియజేస్తుంది. అలాగే, ఇంజిన్లోకి ఎంత ఇంధనం, ఎప్పుడు విడుదల అవ్వాలనేది నియంత్రించేందుకు ప్రోగ్రాం చేసిన ఫ్యుయల్ ఇంజెక్టర్లను ఏర్పాటు చేయాలి. ఇంజిన్ ఉష్ణోగ్రత, గాలి పీడనం మొదలైన వాటిని పర్యవేక్షించేలా సెమీకండక్టర్లను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. డిమాండ్‌పై ప్రభావం.. కొత్త ప్రమాణాలకు తగ్గట్లుగా వాహనాలను రూపొందించాలంటే ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వర్ గుప్తా తెలిపారు. సెల్ఫ్ డయాగ్నాస్టిక్ డివైజ్‌లు, హార్డ్‌వేర్.. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ మొదలైన వాటిపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. గత 15–18 నెలలుగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా వాహన కంపెనీలు రేట్లను పెంచుతూనే ఉన్నాయని .. మరింతగా పెంచితే డిమాండ్‌పై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని గుప్తా తెలిపారు. కాలుష్య కట్టడిలో భాగంగా 2020 ఏప్రిల్ 1 నుంచి వాహనాల కంపెనీలు బీఎస్4 ప్రమాణాల నుంచి నేరుగా బీఎస్6 ప్రమాణాలకు మారాల్సి వచ్చింది. వీటికి అనుగుణంగా టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. నవరాత్రికి వాహనాల జోరు నవరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిటైల్‌లో 5,39,227 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశ చరిత్రలో నవరాత్రికి జరిగిన విక్రయాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 57 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 మధ్య ఈ విక్రయాలు జరిగాయి. 2019 నవరాత్రి సందర్భంగా భారత్‌లో 4,66,128 యూనిట్లు రోడ్డెక్కాయి. మూడేళ్ల తరువాత వినియోగదార్లతో షోరూములు కిటకిటలాడాయి. ద్విచక్ర వాహనాలు 52.35 శాతం దూసుకెళ్లి 3,69,020 యూనిట్లు నమోదయ్యాయి. కోవిడ్ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 3.7 శాతం వృద్ది సాధించడం విశేషం. ప్యాసింజర్ వాహనాలు 70.43 శాతం ఎగసి 1,10,521 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు 48.25 శాతం పెరిగి 22,437 యూనిట్లు నమోదైంది. త్రిచక్ర వాహనాలు రెండు రెట్లకుపైగా వృద్ధి చెంది 19,809 యూనిట్లు, ట్రాక్టర్ల విక్రయాలు 57.66 శాతం అధికమై 17,440 యూనిట్లకు చేరుకున్నాయి. -
వాహనాలకు పండగొచ్చింది
న్యూఢిల్లీ: తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా మెరుగుపడటంతో పండుగల సీజన్లో వాహన పరిశ్రమ కళకళ్లాడుతోంది. కస్టమర్లకు డెలివరీలూ పుంజుకుంటున్నాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయి. 13,19,647 యూనిట్ల నుంచి 14,64,001 యూనిట్లకు పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో విక్రయాలు మరింత పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దశాబ్దకాలంలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమమైనదిగా ఉండగలదని డీలర్లు అంచనా వేస్తున్నారు‘ అని పేర్కొంది. ట్రాక్టర్లు, కొన్ని రకాల త్రిచక్ర వాహనాలు మినహా మిగతా అన్ని ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు.. ద్విచక్ర వాహనాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదు చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2,37,502 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధి చెంది 2,60,556 యూనిట్లకు చేరాయి. ‘సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడి కార్ల లభ్యత పెరగడం, వినూత్న ఫీచర్లతో కొత్త వాహనాలను ఆవిష్కరించడం తదితర అంశాల కారణంగా కస్టమర్లు తమకు నచ్చిన వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో అమ్మకాలకు ఊతం లభించేలా డిమాండ్‌కి అనుగుణంగా వాహనాలను అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగి 9,31,654 యూనిట్ల నుంచి 10,15,702 యూనిట్లకు చేరాయి. ఎంట్రీ స్థాయి బైక్‌ల అమ్మకాలు గణనీయంగా దెబ్బతినడంతో మొత్తం టూవీలర్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. ► వాణిజ్య వాహనాల విక్రయాలు 59,927 యూనిట్ల నుంచి 19 శాతం వృద్ధితో 71,233 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 53,392 నుంచి 52,595 యూనిట్లకు తగ్గాయి. ► ప్యాసింజర్ వాహనాల విభాగంలో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 99,276 యూనిట్ల నుంచి 1,03,912 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ 39,118, టాటా మోటార్స్ 36,435 కార్లు విక్రయించాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అత్యధికంగా 2,84,160 యూనిట్లు విక్రయించింది. హీరో మోటోకార్ప్ 2,50,246 వాహనాల అమ్మకాలు నమోదు చేసింది. త్రిచక్ర వాహనాలకు సంబంధించి 19,474 యూనిట్లతో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిల్చింది. -
వాణిజ్య వాహనాలకు మంచి రోజులు
ముంబై: రెండేళ్ల పాటు తిరోగమనం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు మరింత పుంజుకోగలవని ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ అంచనా వేస్తోంది. వివిధ విభాగాల్లో డిమాండ్ మెరుగుపడటం ఇందుకు దోహదపడగలదని ఆశిస్తోంది. కొత్త ట్రక్కుల శ్రేణిని ఆవిష్కరించిన సందర్భంగా టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సోమవారం ఈ విషయాలు తెలిపారు. ట్రక్కుల వినియోగం, రవాణా రేట్ల పెరుగుదల, రవాణా సంస్థల విశ్వాస సూచీ మొదలైన అంశాలన్నీ సానుకూలంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. అలాగే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుండటం వల్ల కూడా టిప్పర్ ట్రక్‌లకు డిమాండ్ పెరుగుతోందని వాఘ్ వివరించారు. 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో స్కూల్ బస్సుల సెగ్మెంట్ గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం తర్వాత నుంచి కొంత పుంజుకుందని, ఉద్యోగుల రవాణాకు ఉపయోగించే వాహనాల విభాగం కూడా మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. ‘మొత్తం మీద చూస్తే అన్ని విభాగాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వాణిజ్య వాహనాల అమ్మకాలు బాగుంటాయని ఆశావహంగా ఉన్నాము‘ అని వాఘ్ పేర్కొన్నారు. టాటా మోటర్స్ కొత్తగా ప్రవేశపెట్టిన వాహనాల్లో తొలిసారిగా సీఎన్జీతో నడిచే మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాలు (ఎంఅండ్‌హెచ్‌సీవీ), తేలికపాటి టిప్పర్లు, ట్రక్కులు మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు తమ ప్రైమా, సిగ్నా, అల్ట్రా ట్రక్కులలో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) తదితర కొత్త ఫీచర్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. -
మళ్లీ షాకిచ్చిన టాటా మోటార్స్.. ఈసారి కమర్షియల్ సెగ్మెంట్లో..
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్ష్ మరోసారి షాకిచ్చింది. కమర్షియల్ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడల్స్ అందులోని వేరియంట్లను బట్టి ఈ పెంపు 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యంగా మారిందని టాటా ప్రకటించింది. గత ఫిబ్రవరిలో ప్యాసింజర్ వెహికల్ ధరలు టాటా పెంచింది. ఆ సమయంలో లారీలు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వంటి కమర్షియల్ వాహనాలకు ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఇది రెండు నెలలకు మించి కొనసాగలేదు. పెరిగిన ఇన్పుట్ కాస్ట్ కారణంగా కమర్షియల్ సెగ్మెంట్లోనూ ధరలు పెంచుతూ టాటా నిర్ణయం తీసుకుంది. గతేడాది అమ్మకాలతో పోల్చితే కమర్షియల్ సెగ్మెంట్లో వాహనాల అమ్మకాల్లో టాటా పురోగతి సాధించింది. 2021లో మే వరకు 26,661 వాహనాల అమ్మకాలు జరగగా 2022 మే వరకు ఏకంగా మూడు రెట్లు పెరిగి 76,210 కమర్షియల్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. కానీ తాజ పెంపు ఈ సానుకూల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. చదవండి: వారెవ్వా ! అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్కార్పియో ఎన్ -
పాత వాణిజ్య వాహన వ్యాపారంలోకి అశోక్ లేలాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ పాత వాణిజ్య వాహనాల విక్రయంలోకి ప్రవేశించింది. ఈ మేరకు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్‌తో చేతులు కలిపింది. అశోక్ లేలాండ్ తయారీ పాత వాహనం ఇచ్చి కొత్తది కొనుగోలు, పాత వాహన విక్రయానికి మహీంద్రాకు చెందిన 700లకుపైగా పార్కింగ్ కేంద్రాలు వేదికగా మారనున్నాయి. పాత వాహనాల మార్కెట్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అశోక్ లేలాండ్ తెలిపింది. -
టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం..!
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కమర్షియల్(వాణిజ్య) వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్ 1, 2022 నుంచి ధరల పెంపు అమలులోకి వస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. 2 నుంచి 2.5 శాతం మేర పెంపు..! భారత కమర్షియల్ వాహనాల్లో టాటా మోటార్స్ భారీ ఆదరణను పొందింది. ఇక వాణిజ్య వాహనాలపై ధరల పెంపు సుమారు 2 నుంచి 2.5 శాతం మేర ఉండనున్నుట్లు తెలుస్తోంది. ఆయా వాహనాల మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని టాటామోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఉక్కు, అల్యూమినియం, ఇతర విలువైన లోహల ధరలు, ఇతర ముడిపదార్థాల ధరలు భారీగా పెరగడం ధరల పెంపు నిర్ణయానికి దారితీసిందని టాటామోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను ప్రభావాన్ని తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమని టాటా మోటార్స్ ప్రకటించింది. మరో వైపు ఈవీ వాహనాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ ఈవీ ధరను సుమారు రూ. 25 వేలకు పైగా పెంచుతూ నిర్ణయం తీసుకంది. గత వారం ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ఎప్రిల్ 1 నుంచి అన్ని మోడల్స్‌పై సుమారు 3 శాతం ధరల పెంపు ఉంటుందని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! 50 లక్షల కార్లు మాయం..! అక్కడ భారీ సంఖ్యలో.. -
కొత్త వాహనం కొనేవారికి టాటా మోటార్స్ షాక్!
మీరు కొత్తగా వాణిజ్య వాహనాలు కొనుగోలుచేయాలని చూస్తున్నారా? అయితే, మీకు చేదువార్త. దేశంలోని అతిపెద్ద ఆటోమేకర్ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను అక్టోబర్ 1, 2021 నుంచి 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ధరల పెంపు అనేది మోడల్, వాహనం వేరియంట్ ఆధారంగా ఉండనున్నట్లు కంపెనీ ఒక ఫైలింగ్ లో తెలిపింది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు పెరగడం వల్లే వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఆటోమేకర్ పేర్కొంది. "ఉక్కు, విలువైన లోహాలు వంటి ముడిసరకుల వ్యయం నిరంతరం పెరగడం వల్ల ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుంది. ధరలు భారీగా పెరగకుండా ఉండటానికి వివిధ స్థాయిలలో కొంత వరకు ఖర్చులను తగ్గించడానికి కంపెనీ మరింత కృషి చేస్తుంది" అని టాటా మోటార్స్ తెలిపింది. కేవలం 2 నెలల కంటే తక్కువ కాలవ్యవదిలోనే వాహనాల ధరలు పెరగడం ఇది రెండోసారి. ఆగస్టులో 'న్యూ ఫరెవర్' శ్రేణిని మినహాయించి, తన ప్రయాణీకుల వాహనాల ధరలను సగటున 0.8 శాతం పెంచింది. అప్పుడు కూడా ధరల పెరుగుదలకు ఇన్ పుట్ ధరలు పెరగడమే ప్రధాన కారణంగా పేర్కొంది.(చదవండి: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెడాన్) టాటా మోటార్స్ అధ్యక్షుడు ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ శైలేష్ చంద్ర వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. "గత ఏడాదికాలంలో ఉక్కు & విలువైన లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి" అని చెప్పారు. గత ఏడాది ఆర్థిక ప్రభావం వల్ల కమోడిటీ ధరలు 8-8.5 శాతం పెరిగినట్లు శైలేష్ చంద్ర తెలిపారు. కేవలం టాటా మోటార్స్ మాత్రమే వాహనాల ధరలను పెంచడం లేదు. ఇతర ఆటోమేకర్ సంస్థలు కూడా ధరలను పెంచుతున్నాయి. -
మార్కెట్లో టాటా కమర్షియల్ వెహికల్, ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. తేలికపాటి వాణిజ్య వాహనం టాటా 407 సీఎన్జీ వర్షన్‌ను విడుదల చేసింది. ధర పుణే ఎక్స్‌షోరూంలో రూ.12.07 లక్షలు. డీజిల్ వేరియంట్‌తో పోలిస్తే ఇది 35 శాతం వరకు అధిక లాభాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. డీజిల్ ధర పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ శ్రేణిని విస్తరిస్తున్నట్టు వివరించింది. 35 ఏళ్లలో టాటా 407 మోడల్ వాహనాలు ఇప్పటి వరకు 12 లక్షల పైచిలుకు యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ విభాగంలో అత్యధిక అమ్మకాలు సాధించిన మోడల్ ఇదేనని టాటా మో టార్స్ వెల్లడించింది. 3.8 లీటర్ సీఎన్జీ ఇంజన్, 85 పీఎస్ పవర్, 285 ఎన్ఎం టార్క్, 10 అడుగుల లోడ్ డెక్, 180 లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉంది. గరిష్టంగా మోయగలిగే సరుకుతో కలిపి మొత్తం వాహన బరువు 4,995 కిలోలు. -
పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇకపై కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభం. రూ.10 లక్షల వరకు వాహనానికి (ఆన్ రోడ్) అయ్యే వ్యయంలో 85 శాతం దాకా రుణం ఇస్తారు. కాల పరిమితి ఆరేళ్లు. థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. తొలిసారి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఐటీఆర్ అక్కరలేదు. చదవండి : అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో -
20 ఏళ్లకు పైబడిన వాహనాలకు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: 20 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను తప్పనిసరిగా వినియోగం నుంచి తప్పించడానికి ఉద్దేశించిన విధానానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ విధానం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ తుది దశకు చేరుకుందని రవాణా మంత్రి గడ్కరీ గతంలో చెప్పారు. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంఓలో జరిగిన భేటీలో ఈ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సీనియర్ అధికారి చెప్పారు. -
బండి ధర 9 లక్షలు ట్రాఫిక్ ఫైన్ 8 లక్షలు
-
బండి ధర 9 లక్షలు.. ట్రాఫిక్ ఫైన్ 8 లక్షలు
నగర రోడ్లపై యథేచ్ఛగా ఉల్లంఘనలు అవన్నీ కమర్షియల్ వాహనాలే.. ఫైన్ కట్టేసి మళ్లీ ఎప్పట్లాగే తిరుగుతున్న వాహనదారులు పెనాల్టీ పాయింట్స్ విధానంతో ఇక ఇలాంటి వారికి చెక్: అధికారులు సాక్షి, హైదరాబాద్ అదో డీసీఎం.. ఆ బండి ధర దాదాపు రూ.9 లక్షలు.. కానీ గత మూడేళ్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆ వాహనానికి పడిన జరిమానా ఎంతో తెలుసా? ఏకంగా రూ.7,64,220. అదో ఆటో.. ఖరీదు రూ.4 లక్షల దాకా ఉంటుంది.. కానీ ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోనందుకు కట్టిన ఫైన్ ఎంతో తెలుసా? రూ.5.73 లక్షలు! హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను అధికారులు రూపొందించారు. అందులో ఇలాంటి విచిత్రాలెన్నో వెలుగుచూశాయి. ఈ టాప్ టెన్ వాహనాలు గత మూడేళ్లలో రూ.59.8 లక్షల ఫైన్ కట్టినట్టు లెక్క తేలింది. ఇక హెల్మెట్ ధరించనందుకు ఓ ద్విచక్ర వాహనదారుడికి 97 చలాన్లు జారీ అయ్యాయి. ఇలా టాప్ 10 టూ వీలర్స్‌కు ఏకంగా 650 చలాన్లు జారీ అయినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇలా ఫైన్లు కట్టేస్తూ మళ్లీ దర్జాగా రోడ్డెక్కుతున్న వాహనదారులకు తాజాగా ప్రవేశపెట్టిన పెనాల్టీ పాయింట్ల విధానంతో చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కమర్షియల్ వాహనాలే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అత్యధిక మొత్తం జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాలన్నీ కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీకి చెందినవే కావడం గమనార్హం. పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకు మాత్రమే నగరంలో 24 గంటలూ తిరిగేందుకు అనుమతి ఉంటుంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను కేవలం రాత్రి వేళల్లోనే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం కూల్‌డ్రింక్‌లు, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనేక వాహనాలు సంచరిస్తున్నాయి. ఇవన్నీ ఆయా దుకాణాలు పనిచేసే వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో రోడ్లెక్కడం తప్పడం లేదు. దీంతో వాటికి పోలీసులు ఓ వెసులుబాటు కల్పించారు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే ‘నాన్ పీక్ అవర్స్’(మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు)లో వాటికి అనుమతినిచ్చారు. మిగిలిన సమయంలో సిటీ రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. అయితే కేవలం ఆ నాలుగు గంటల్లోనేగాకుండా మిగిలిన సమయంలోనూ రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఒక్కసారి ఫైన్ కట్టేసి.. రోజంతా.. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా వాహనాన్ని నడిపితే ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1,000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఓ ఉల్లంఘనకు ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరోసారి ఫైన్ విధించేందుకు అవకాశం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగర రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన వెంటనే ఏదో ఓ చోట ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా చెల్లించేసి ఇక ఆ రశీదుతో రోజంతా నడుపుతున్నారు. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతి తక్కువ కావడంతో వాహనదారులు ఇలా చేస్తున్నారు. ఇలా టాప్–10 వాహనాలు మూడేళ్ల కాలంలో రూ.59,80,580 జరిమానాగా చెల్లించాయి. ఈ వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ అప్పటికే అవి ఆ రోజుకు సంబంధించిన జరిమానా చెల్లించి ఉండటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ‘పాయింట్స్’తో స్వైర విహారానికి చెక్ ద్విచక్ర వాహనదారులు కూడా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫైన్ విధించినా మళ్లీ అదే కారణంతో దొరికిపోతున్నారు. ఇలా గత మూడేళ్ల లెక్క తీస్తే అందులో తొలి పది మంది వాహనదారులకు ఏకంగా 650 ‘హెల్మెట్’జరిమానాలు పడ్డట్టు తేలింది. ట్రాఫిక్ అధికారులు ఈ నెల 1 నుంచి ప్రవేశపెట్టిన పెనాల్టీ పాయింట్స్ విధానంతో ఇలాంటివారికి కళ్లెం పడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు చలాన్‌కు సంబంధించిన నగదు చెల్లిస్తే సరిపోయేది. కానీ కొత్త విధానంలో రెండేళ్లలో కాలంలో 12 పాయింట్లు పడితే సదరు వాహనదారుడి లైసెన్స్ రద్దు కానుంది. గత మూడేళ్లలో అత్యధిక జరిమానాలు చెల్లించిన ‘టాప్–10’కమర్షియల్ వాహనాలివీ.. వాహనం నంబర్ చెల్లించిన ఫైన్ ఏపీ09వీ6780 రూ.7,64,220 ఏపీ29వీ3285 రూ.6,63,625 ఏపీ28యూ2081 రూ.6,55,635 ఏపీ09వీ8015 రూ.5,99,345 ఏపీ28యూ1711 రూ.5,78,330 ఏపీ29డబ్ల్యూ0814 రూ.5,73,830 ఏపీ28యూ2078 రూ.5,59,455 ఏపీ28యూ2139 రూ.5,36,885 ఏపీ09వీ6872 రూ.5,25,575 ఏపీ09వీ6735 రూ.5,23,680 మొత్తం రూ.59,80,580 గత మూడేళ్లలో ‘హెల్మెట్’చలాన్లు కట్టిన టాప్–10 టూ వీలర్స్.. వాహనం నంబర్ చలాన్లు ఏపీ10ఎఫ్8737 97 ఏపీ11ఏఈ8321 90 ఏపీ09బీఈ3503 68 ఏపీ12ఈడీ6291 60 ఏపీ12కే1366 58 పీ12ఏ9424 58 ఏపీ12ఈబీ9658 57 ఏపీ09సీడీ4775 55 ఏపీ13హెచ్6054 54 ఏపీ28డీఎం0568 53 మొత్తం 650 గత మూడేళ్లలో ‘టాప్–10’ వాహనాలు కట్టిన జరిమానా 59,80,000 గత మూడేళ్లలో ‘టాప్–10’ టూవీలర్స్‌కు జారీచేసిన చలాన్లు 650 వీటిలో హెల్మెట్ ధరించనందుకు ఓ ద్విచక్ర వాహనదారుడికి జారీ అయిన చలాన్లు 97 -
మ్యాన్ ట్రక్స్ నుంచి భారీ వాణిజ్య వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రక్కుల, బస్సుల తయారీలో ఉన్న మ్యాన్ ట్రక్స్ ఇండియా ప్రై.లి. భారీ వాణిజ్య వాహనాలను విడుదల చేసింది. సీఎల్ఏ ఈవీఓ 25.300 బీఎస్4 టిప్పర్, సీఎల్ఏ ఈవీఓ 49.300 ట్రాక్టర్లను గుర్గావ్లో ప్రారంభమైన బౌమ కొనెక్స్పో 2016 ఎగ్జిబిషన్లో విడుదల చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్ పితంపూర్‌లో ఉన్న మ్యాన్స్ ట్రక్స్ ప్లాంట్‌లో వీటిని రూపొందించామని.. ఇక్కడి నుంచే ఆసియాతో పాటు ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు సైతం వాహనాలను ఎగుమతి చేస్తామని పేర్కొంది. -
స్మార్ట్‌గా సరుకు షిఫ్ట్...
♦ క్లిక్ దూరంలో చిన్న వాణిజ్య వాహనాలు ♦ సరుకు రవాణా ఇక మరింత సులువు ♦ సాక్షితో స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చిన్న వాణిజ్య వాహనం అద్దెకు కావాలంటే సమీపంలో ఉన్న అడ్డాకు వెళ్లాల్సిందే. డ్రైవర్ చెప్పిన రేటుకు ఓకే చెప్పాల్సిన పరిస్థితి. లేదా మరో వాహనాన్ని వెతుక్కోవాలి. సొంత వెహికల్ లేని చిన్న వ్యాపారులకు ఇది అతిపెద్ద సమస్య. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎస్ఎంఈలను, ట్రాన్స్పోర్టర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్మార్ట్‌షిఫ్ట్. సరుకు రవాణాకు చిన్న వాణిజ్య వాహనం కావాల్సి వస్తే స్మార్ట్‌ఫోన్‌లో ఒక క్లిక్ చేస్తే చాలు. నిమిషాల్లో వాహనం ప్రత్యక్షమవుతుంది. ఇక రవాణా చార్జీ అంటారా.. ఎంచక్కా డ్రైవర్‌తో బేరమాడుకోవచ్చు. వెహికల్‌ను ట్రాక్ చేయవచ్చు కూడా. అటు వాహన యజమానులకూ అదనపు వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నామని స్మార్ట్‌షిఫ్ట్ సీఈవో కౌసల్య నందకుమార్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. స్మార్ట్‌షిఫ్ట్ ఇలా పనిచేస్తుంది.. వ్యాపారులు ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో స్మార్ట్‌షిఫ్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. సరుకును ఎక్కడికి రవాణా చేయాలో నిర్దేశించాలి. సరుకు రకం, దూరం, వాహనం మోడల్‌నుబట్టి చార్జీ ఎంతనో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంతకంటే తక్కువ చార్జీకే వాహనం కావాలంటే.. వ్యాపారి తనకు నచ్చిన ధరను కోట్ చేయవచ్చు. ఈ వివరాలతో వ్యాపారి ఉండే ప్రదేశానికి సమీపంలో ఉన్న 10 మంది డ్రైవర్లకు సందేశం వెళ్తుంది. డ్రైవర్ల వద్ద బేసిక్ ఫోన్ ఉన్నా ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సమాచారం చేరవేస్తారు. చార్జీ నచ్చితే డ్రైవర్ ఓకే చెప్పొచ్చు. లేదా ఎక్కువ చార్జీ డిమాండ్ చేయవచ్చు. ఇరువురికీ ఆమోదయోగ్యం అయితే డీల్ కుదురుతుంది. ఇందుకు డ్రైవర్ల నుంచి కొంత కమీషన్‌ను కంపెనీ వసూలు చేస్తుంది. హైదరాబాద్‌తోపాటు ముంబైలో సేవలందిస్తున్న స్మార్ట్‌షిఫ్ట్‌కు 3,000 మందికిపైగా వ్యాపారులు కస్టమర్లుగా ఉన్నారు. 1,200 మందికిపైగా వాహనాలు నమోదయ్యాయి. డ్రైవర్లకు అదనపు ఆదాయం..: రవాణాకు ఎక్కువ ధర చెల్లిస్తున్న వ్యాపారులూ ఉన్నారు. డిమాండ్ ఎక్కడ ఉందో తెలియక వాహనాలు ఖాళీగా ఉండే సందర్భాలూ ఉన్నాయి. వ్యాపారులను, వాహన యజమానులను ఒకే వేదికపైకి తీసుకురావడమే మా పని అని కౌసల్య నందకుమార్ తెలిపారు. రవాణా చార్జీలు ఇరువురికీ ఆమోదయోగ్యంగా ఉండడం తమ సేవల ప్రత్యేకత అని ఆమె వివరించారు. ‘వాహన యజమానుల ఆదాయం గణనీయంగా పెరిగింది. సరుకు రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నాం. లెండింగ్‌కార్ట్ ద్వారా వ్యాపారులకు రుణం ఇప్పిస్తున్నాం’ అని తెలిపారు. మహీంద్రా గ్రూప్ స్మార్ట్‌షిఫ్ట్ సీడ్ ఇన్వెస్టర్‌గా ఉందని చెప్పారు. కంపెనీ విస్తరణకు గ్రూప్ పూర్తి సహకారం అందిస్తోందన్నారు. -
ఐషర్ నుంచి స్కైలైన్ ప్రో బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాఠశాల విద్యార్ధులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐషర్ స్కైలైన్ ప్రో సిరీస్‌లో రెండు కొత్త బస్సులను ఐషర్ వీఈ కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐషర్ మోటర్స్, వోల్వో గ్రూపు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వీఈ కమర్షియల్ వెహికల్స్ ఈ కొత్త బస్సులను శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేసింది. తక్కువ ఇంధన వ్యయంతో అధిక మైలేజీ వచ్చే విధంగా రూపొందించిన స్కైలైన్ ధరల శ్రేణి రూ. 17 - 18 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీఈ కమర్షియల్ వెహికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మాలర్ మాట్లాడుతూ ఈ ఏడాది లైట్ వెహికల్ బస్సుల్లో 21 శాతం, హెవీ వెహికల్ బస్సుల్లో 6 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఈ రెండు విభాగాల్లో దేశవ్యాప్తంగా 48,000 వాహనాలు అమ్ముడుకాగా, ఇందులో ఐషర్ 15.7 శాతం వాటాతో 7,400 యూనిట్లను విక్రయించింది. బస్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందుకోసం రూ. 250 కోట్లతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జేఎన్ఎన్యూఆర్ఎం కింద వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల నుంచి ఆర్డర్లను దక్కించుకుంటున్నామని, ఈ మధ్యనే బీహార్ నుంచి 560 బస్సులు, ఇండోర్ నుంచి 65 బస్సుల ఆర్డర్లు లభించినట్లు తెలిపారు. -
వాణిజ్య వాహనాల విక్రయాలు పుంజుకుంటాయ్!
ముంబై: వాణిజ్య వాహనాల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం తగ్గాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆర్థిక మందగమనం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల అమ్మకాలు ఈ స్థాయిలో క్షీణించాయని పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగం నుంచి అమ్మకాలు పుంజుకోగలవని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు తక్కువగా ఉండడం (లో బేస్), ట్యాక్సీ ఆపరేటర్లు కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయనుండడం, క్రమక్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల కారణంగా అమ్మకాలు పెరుగుతాయని పేర్కొంది. వాణిజ్య వాహనాల విక్రయాలపై ఇక్రా వెల్లడించిన వివరాల ప్రకారం.., 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం తగ్గిన వాణిజ్య వాహనాల అమ్మకాలు 2013-14 ఆర్థిక సంవత్సరంలో 20% తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో 6.33 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. ఇటీవల కాలంలో వాహన పరిశ్రమ అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగా నిలకడైన వృద్ధిని సాధించిన తేలిక రకం వాణిజ్య వాహనాల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం తగ్గాయి. ఇక మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు 25 శాతం క్షీణించాయి. వాహన పరిశ్రమలో ఆశావహ పరిస్థితులున్నప్పటికీ, కంపెనీలు తేలిక రకం, భారీ తరహా, వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి. {పస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నప్పటికీ, వాహన కంపెనీల లాభదాయకత మెరుగుపడే అవకాశాల్లేవు. తీవ్రమైన పోటీ, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, తదితర అంశాలు వాహన కంపెనీల లాభదాయకతపై ప్రభావం చూపనున్నాయి. -
కార్ల అమ్మకాలు కాస్త పుంజుకున్నాయ్
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు ఈ ఏడాది మార్చిలో కాస్త పుంజుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఫలితాలు కనిపిస్తున్నాయని నిపుణులంటున్నారు. హ్యుందాయ్, హోండా, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కంపెనీల అమ్మకాలు పెరగ్గా, మారుతీ సుజుకి, మహీంద్రా, టయోటా, అశోక్ లేలాండ్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు సానుకూల ఫలితాలనిస్తోందని వాహన పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం వాహన పరిశ్రమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలదని ఈ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా ఎంక్వైరీలైతే పెరిగాయి. కానీ, అమ్మకాల్లో మెరుగుదల లేదని కంపెనీలంటున్నాయి. అయితే ఎన్నికల అనంతరం పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి. కంపెనీల పరంగా వివరాలు... మారుతీ సుజుకి: మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 11% తగ్గగా,. కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లు 9% వృద్ధి సాధించాయి. ఎగుమతులు 8% తగ్గాయి. నిస్సాన్: కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన డాట్సన్ గో కారుకు మంచి స్పందన లభిస్తోందని పేర్కొంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 36,975 వాహనాలు అమ్ముడవగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధితో 38,217 వాహనాలు విక్రయించామని తెలిపింది. ఫోర్డ్ ఇండియా: దేశీయ అమ్మకాలు 21 శాతం పెరిగాయి. హోండా మోటార్ సైకిల్: మోటార్ బైక్‌ల అమ్మకాలు 57 శాతం, స్కూటర్ల అమ్మకాలు 53 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. మెర్సిడెస్ బెంజ్: ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 2,554 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలం వాహన విక్రయాల(2,009)తో పోల్చితే 27 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. మార్చి నెల వాహన విక్రయాలు ఇలా.. కంపెనీ 2014 2013 వృ/క్షీ.(%లో) మారుతీ సుజుకి 1,13,350 1,19,937 -6 హ్యుందాయ్ూ 35,003 33,858 3 హోండా కార్సూ 18,426 -- 83 నిస్సాన్ 7,019 2,125 230 ఫోర్డ్ ఇండియా 11,805 7,499 57 టయోటా 9,160 21,143 -57 మహీంద్రా 51,636 51,904 -- అశోక్ లేలాండ్ 10,286 14,019 -27 హోండా మోటార్ సైకిల్ 3,92,148 2,52,787 55