Tata Motors to Raise Commercial Vehicles Prices From April 1, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ షాకింగ్‌ నిర్ణయం..!

Published Tue, Mar 22 2022 2:58 PM | Last Updated on Tue, Mar 22 2022 3:15 PM

Tata Motors to Raise Commercial Vehicles Prices From April 1 - Sakshi

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. కమర్షియల్‌(వాణిజ్య) వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌  మంగళవారం ప్రకటించింది. వచ్చే  నెల ఏప్రిల్‌ 1, 2022 నుంచి ధరల పెంపు అమలులోకి వస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. 

2 నుంచి 2.5 శాతం మేర పెంపు..!
భారత కమర్షియల్‌ వాహనాల్లో టాటా మోటార్స్‌  భారీ ఆదరణను పొందింది. ఇక వాణిజ్య వాహనాలపై ధరల పెంపు సుమారు 2 నుంచి 2.5 శాతం మేర ఉండనున్నుట్లు తెలుస్తోంది. ఆయా వాహనాల మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని టాటామోటార్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  ఉక్కు, అల్యూమినియం, ఇతర విలువైన లోహల ధరలు, ఇతర ముడిపదార్థాల ధరలు భారీగా పెరగడం ధరల పెంపు నిర్ణయానికి దారితీసిందని టాటామోటార్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.



ఇన్‌పుట్‌ ఖర్చుల పెరుగుదలను ప్రభావాన్ని తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమని టాటా మోటార్స్‌ ప్రకటించింది. మరో వైపు ఈవీ వాహనాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్‌ ఈవీ ధరను సుమారు రూ. 25 వేలకు పైగా పెంచుతూ నిర్ణయం తీసుకంది. గత వారం ఇన్‌పుట్‌ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్‌సెట్‌ చేయడానికి ఎప్రిల్‌ 1 నుంచి అన్ని మోడల్స్‌పై సుమారు 3 శాతం ధరల పెంపు ఉంటుందని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌-బెంజ్‌ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. 

చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌..! 50 లక్షల కార్లు మాయం..! అక్కడ భారీ సంఖ్యలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement