commodities
-
అంచనాలకు మించి భారత్ పురోగతి
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2023–24) స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా క్రితం 6.2 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. కమోడిటీల ద్రవ్యోల్బణం ‘మైనస్’లో ఉండడం, ఏప్రిల్–సెపె్టంబర్ ఆరు నెలల జీడీపీ గణాంకాల్లో చక్కటి పురోగతి, అక్టోబర్–డిసెంబర్ మధ్య కూడా సానుకూల వృద్ధి గణాంకాలు వెలువడే అవకాశాలు తమ అంచనాల తాజా పెంపునకు కారణమని ఇక్రా పేర్కొంది. ‘‘2023 అక్టోబర్–నవంబర్ ఇక్రా బిజినెస్ యాక్టివిటీ మానిటర్ 11.3 శాతం పెరిగింది. జూలై, ఆగస్టు, సెపె్టంబర్ (క్యూ2)లో నమోదయిన 9.5 శాతం కన్నా ఇది అధికం. పండుగల నేపథ్యంలో అధిక ఫ్రీక్వెన్సీ నాన్–అగ్రి ఇండికేటర్లలో నమోదయిన ఈ పెరుగుదల పూర్తి సానుకూలమైంది. ఈ నేపథ్యంలో క్యూ3తో కూడా మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నాం’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. సానుకూల పరిస్థితులు... చైనాకు సంబంధించి డిమాండ్ తగ్గే అవకాశాలు, ముడి చమురు వంటి కీలక కమోడిటీల తగినంత సరఫరాలు, సాధారణ సరఫరా చైన్ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉండడానికి దోహదపడే అంశంగా ఇక్రా పేర్కొంది. భారత్ ఎకానమీకి సంబంధించి అక్టోబర్, నవంబర్లలో అధిక క్రియాశీలత కనిపించినప్పటికీ, డిసెంబరులో ప్రారంభంలో మిశ్రమ పోకడలు కనిపించాయని ఇక్రా పేర్కొంది. విద్యుత్ డిమాండ్ పెరుగుదల నెమ్మదించిందని, డీజిల్ డిమాండ్ క్షీణతలోకి జారిందని పేర్కొన్న ఇక్రా, రోజువారీ వాహనాల రిజి్రస్టేషన్లు మ్రాతం పెరిగినట్లు తెలిపింది. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. -
కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. ఇవి నిజంగానే కోవిడ్ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు. -
టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం..!
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కమర్షియల్(వాణిజ్య) వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్ 1, 2022 నుంచి ధరల పెంపు అమలులోకి వస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. 2 నుంచి 2.5 శాతం మేర పెంపు..! భారత కమర్షియల్ వాహనాల్లో టాటా మోటార్స్ భారీ ఆదరణను పొందింది. ఇక వాణిజ్య వాహనాలపై ధరల పెంపు సుమారు 2 నుంచి 2.5 శాతం మేర ఉండనున్నుట్లు తెలుస్తోంది. ఆయా వాహనాల మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని టాటామోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఉక్కు, అల్యూమినియం, ఇతర విలువైన లోహల ధరలు, ఇతర ముడిపదార్థాల ధరలు భారీగా పెరగడం ధరల పెంపు నిర్ణయానికి దారితీసిందని టాటామోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను ప్రభావాన్ని తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమని టాటా మోటార్స్ ప్రకటించింది. మరో వైపు ఈవీ వాహనాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ ఈవీ ధరను సుమారు రూ. 25 వేలకు పైగా పెంచుతూ నిర్ణయం తీసుకంది. గత వారం ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ఎప్రిల్ 1 నుంచి అన్ని మోడల్స్‌పై సుమారు 3 శాతం ధరల పెంపు ఉంటుందని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! 50 లక్షల కార్లు మాయం..! అక్కడ భారీ సంఖ్యలో.. -
రిటైల్ రంగంలోకి మార్క్ ఫెడ్
సాక్షి, అమరావతి: ఏపీ సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్ ఫెడ్) రిటైల్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. రైతుల నుంచి సేకరించే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అందుబాటు ధరల్లో నాణ్యమైన నిత్యావసర సరుకుల్ని తెలుగు ప్రజల ముంగిటకు తీసుకెళ్తోంది. తొలి విడతగా బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి, కారం వంటి 12 రకాల నిత్యావసర సరుకులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందుకోసం మార్క్‌ఫెడ్ అండర్ టేకింగ్ ఫర్ పీపుల్ (మార్కప్) పేరిట నెలకొల్పిన కంపెనీ లోగోను బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మార్క్ ఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదనరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మార్కప్ ఉత్పత్తులను విడుదల చేశారు. రైతుల సంక్షేమం కోసమే మార్కప్: కన్నబాబు ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు రైతుల నుంచి సేకరిస్తున్న ఆహార ఉత్పత్తుల అమ్మకంలో నష్టాలను అధిగమించే లక్ష్యంతోనే మార్క్‌ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. రైతుల నుంచి సేకరించే ఉత్పత్తులతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర నిత్యావసర సరుకులను కూడా విక్రయించడం వల్ల అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. హెరిటేజ్, రిలయన్స్ వంటి సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తాయని, మార్కప్ మాత్రం రైతులు, వినియోగదారుల క్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు. వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్), డీసీఎంఎస్, ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ స్టోర్స్, రైతు బజార్లు, డ్వాక్రా బజార్లు, ఎఫ్‌పీవోల ద్వారా మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణ ద్వారా గడచిన మూడేళ్లలో కనీస మద్దతు ధర దక్కని వ్యవసాయ ఉత్పత్తులను పెద్దఎత్తున కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇలా సేకరిస్తున్న ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్లడం ద్వారా వారికి మరింత లబ్ధి చేకూర్చేందుకు మార్క్ ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదనరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా మార్కెట్లోకి వస్తున్న విజయ బ్రాండ్ వంట నూనెలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. అదే తరహాలో మార్కప్ కూడా మార్కెట్లో ప్రధాన భూమిక పోషించనుందని చెప్పారు. మార్క్ ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. పంజాబ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా రిటైల్ మార్కెటింగ్ రంగంలోకి మార్క్‌ఫెడ్ అడుగు పెడుతోందన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ప్రీమియం, పాపులర్, ఎకానమీ రేంజ్‌లలో మార్క్ ఫెడ్ బ్రాండింగ్‌తో మార్కెట్లోకి వెళ్తున్నామన్నారు. వ్యాపార లావాదేవీలన్నీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేశామన్నారు. మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 వేల రిటైల్ షాపుల్లో మార్కప్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, çసహకార శాఖ కమిషనర్లు హెచ్.అరుణ్‌కుమార్, ఎస్ఎస్ శ్రీధర్, ఎ.బాబు, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ పాల్గొన్నారు. -
సిటీపై సీతమ్మ చిన్నచూపు .. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నగర ప్రజలను నిరాశపర్చింది. కరోనా నేపథ్యంలో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనం ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగా లేక సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్‌పై గ్రేటర్ జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఈ బడ్జెట్‌తో ధరలు మరింత పెరుగుతాయని నగర వ్యాపారుల అంచనా. డ్రైఫ్రూట్స్‌పై తగ్గని జీఎస్టీ ఇప్పటీకే కరోనా ప్రభావంతో గ్రేటర్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఇమ్యూనిటీ కోసం ఎక్కువగా డ్రైఫ్రూట్స్ వాడుతున్నారు. గతంలో పోలిస్తే కరోనాతో డ్రైఫ్రూట్స్ వాడకం దాదాపు 60 శాతం పెరిగింది. ఈ బడ్జెట్లో ఇప్పటికే డ్రైఫ్రూట్స్‌పై కొనసాగుతున్న 12 శాతం జీఎస్టీ నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని భావించారు. కానీ తగ్గించకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. తగ్గేవి ఇవే.. వస్త్రాలు, తోలు వస్తువులు, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్ చవక అవుతాయి. వ్యవసాయ పరికరాల ధరలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ చార్జర్ల ధరలు దిగివస్తాయి. పెరిగేవి ఇవే.. మూలధన వస్తువులు, ముడి ఇంధనం, రోల్డ్ గోల్డ్ ఆభరణాల ధరలు మరింత పెరిగాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు పెరగనున్నాయి. (చదవండి: సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేకుంటే ఛలానా? అర్థం ఉందా?) -
ప్యాకేజ్డ్ కమోడిటీ: అంకెల మాయాజాలానికి చెక్
న్యూఢిల్లీ: బిస్కెట్ ప్యాకెట్‌పై బరువు ఎంత ఉందని చూస్తే.. 88 గ్రాములుగా కనిపిస్తుంది. అదే గోధుమ పిండి ప్యాకెట్ 3.5 కేజీలతో ఉంటుంది. ఈ తరహా అనుభవాలు వినియోగదారులకు సర్వ సాధారణం. ఉత్పత్తుల విక్రయంలో వివిధ కంపెనీల మధ్య ఏకరూపత కనిపించదు. దీనివల్ల ధరలను పోల్చుకోవడం వినియోగదారులకు సాధ్యపడదు. అందుకనే కంపెనీలు వ్యూహాత్మకంగా నిత్యావసరాల ప్యాకేజీ ఉత్పత్తులపై అంకెల ట్రిక్కులను అనుసరిస్తుంటాయి. కానీ, ఇకపై ఇవి కుదరవు. ప్రతీ ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) ఉండాల్సిందే. అలాగే, యూనిట్ ధర ఎంతన్నదీ ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీలు) నిబంధనలు, 2011కు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సవరణలు తీసుకొచ్చింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సంబంధిత శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ధరలు ఇలా ముద్రించాలి.. కిలోకు మించిన బరువుతో ఉండే ప్యాకెట్లపై ఎంఆర్పీతోపాటు. ఒక కిలో ధర ఎంతన్నదీ ముద్రించాలి. కిలో కంటే తక్కువ బరువుతో ఉండే ఉత్పత్తులపై ఎంఆర్పీతోపాటు.. ఒక గ్రాము ధర ఎంతన్నదీ ప్రచురించాలి. ఏ పరిమాణంలో అయినా సరే.. షెడ్యూల్2 రద్దు కానుంది. కంపెనీలు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఒక కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5కిలోల పరిమాణాల్లోనే 19 రకాల కమోడిటీలను విక్రయించాలని షెడ్యూల్2 నిర్ధేశిస్తోంది. వీటికి భిన్నమైన పరిమాణాల్లో విక్రయించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు అనుమతులు పొందడం లేదని గుర్తించడంతో.. కంపెనీలకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో షెడ్యూల్ 2ను రద్దు చేస్తూ సవరణ తీసుకొచ్చారు. రూపాయిల్లో పేర్కొంటే చాలు.. ప్రస్తుతం ఉత్పత్తులపై ఎంఆర్పీని పైసలతోపాటు పేర్కొనాల్సి ఉండగా.. ఇకమీదట రూపీల్లో పేర్కొంటే సరిపోతుందని నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. అలాగే, ప్యాకెట్‌పై నంబర్లలో లేదా యూనిట్లో పరిమాణాన్ని పేర్కొంటే సరిపోతుంది. లేదంటే ఎన్ని పీసులు, ఎన్ని సెట్లు ఉన్నాయో కూడా పేర్కొనవచ్చు. ఇక దిగుమతి చేసుకునే కమోడిటీలపై ప్రస్తుతం కంపెనీలు దిగుమతి తేదీ లేదా తయారీ తేదీ లేదా తిరిగి ప్యాకేజీ చేసిన తేదీని పేర్కొనే ఆప్షన్ కలిగి ఉన్నాయి. దీని స్థానంలో ఇక మీదట తయారీ తేదీ ఒక్కటే తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తయారీతేదీ ఒక్కటే ప్రామాణికం కనుక ఈ మార్పును తీసుకొచ్చారు. -
వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసి, ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు వరద నీటిలో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కిలో ఉల్లిగడ్డలు, కిలో బంగాళదుంపలు పంపిణీ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ సోమవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉందిగా పండగ.. వర్రీ దండగ
సాక్షి, హైదరాబాద్ : దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రాబోయే ఆరునెలల్లో వేగంగా పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కరోనా కష్టకాలంలో గత ఆరు నెలలుగా వినిమయ వస్తువుల గిరాకీకి డిమాండ్ తగ్గి డీలా పడిన వివిధ కంపెనీల వినియోగ ఉత్పత్తుల మార్కెట్ కూడా మెరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఆశాభావాన్ని వివిధ మార్కెటింగ్ సంస్థల అధ్యయనాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో విధించిన లాక్డౌన్, ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అనేక మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. గ్రామీణ మార్కెట్ బలోపేతంపై... ప్రస్తుత కోవిడ్ కాలంలో ఆరోగ్యభద్రత, పరిశుభ్రతతో ముడిపడిన ఉత్పత్తుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని పొందేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆఫీసులు, వేర్‌హౌజింగ్ వంటి వాటికి శాశ్వత భద్రతా, సంరక్షణ చర్యలు వంటి చర్యలతో థర్డ్–పార్టీ ఈ–కామర్స్ సంస్థలతోనూ సంబంధాలు విస్తృతం చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లు సైతం వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్యభద్రతకు సంబంధించిన ఉత్పత్తులు, వస్తువులను ఎక్కువగా వినియోగించడంపై దృష్టి పెడుతుండటంతో ఈ మార్పు మరింత వేగంగా సంభవించవచ్చునని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు రాబోయే నెలల్లో వరుసగా వస్తున్న పండుగల సీజన్ వల్ల కూడా అటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ వివిధ రకాల వినియోగ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. కస్టమర్ల అభిరుచుల్లో మార్పులు... కోవిడ్ కారణంగా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో పడుతున్న ప్రభావాలతో వినియోగదారుల అభిరుచులు, కొనుగోళ్ల తీరు, వ్యవహారంలో ఇప్పటికే కొన్ని కీలకమార్పులు చోటుచేసుకోగా, మరికొన్ని చోటుచేసుకోబోతున్నాయి.‘ఫ్యూచర్ కన్జూమర్ ఇండెక్స్’ పేరిట ఎర్నెస్ట్ యంగ్ ఇండియా సంస్థ భారతీయ వినియోగదారులపై నిర్వహించిన తాజా సర్వేలో దీనికి సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి. కస్టమర్ల అభిరుచుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ తమ ఉత్పత్తులను ఆ విధంగా మలచుకోవడంపై వివిధ కంపెనీలు దృష్టి నిలుపుతున్నట్టు తెలుస్తోంది. -
రూ 40,000 దాటిన పసిడి
ముంబై : అంతర్జాతీయ అనిశ్చితికి తోడు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో శుక్రవారం దేశీ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 850 పెరిగి 40,115కు ఎగబాకింది. గత రెండు వారాలుగా బంగారం ధరలు పదిగ్రాములకు రూ 2000 మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్లోనూ బంగారం అంతకంతకూ భారమవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా పసిడి పరుగుకు కలిసివస్తోంది. మరోవైపు వెండి ధరలు సైతం మండిపోతున్నాయి. కిలో వెండి శుక్రవారం ఎంసీఎక్స్‌లో రూ 814 భారమై రూ 47,386కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1543 డాలర్లకు ఎగబాకింది. -
గోల్డ్ రేస్ : రూ 39,028కి చేరిన పసిడి
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో యల్లోమెటల్ ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ప్రియమైంది. మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 328 పెరిగి రూ 39,028 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. మరోవైపు వెండి ధర సైతం రూ 748 ఎగబాకి కిలో రూ 45,873కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌బంగారం 1470 డాలర్లకు చేరిందని, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద చర్చలపై ఆధారపడి పసిడి తదుపరి ధరలు ప్రభావితమవుతాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ చెప్పారు. -
మిల్లర్ల మాయాజాలం
సాక్షి, విశాఖపట్నం : నిత్యావసరాల ధరలు నింగిలో విహరిస్తున్నాయి.. బియ్యం ధరలే కాస్త అందుబాటులో ఉన్నాయనుకుంటే అవీ భారమవుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. క్వింటాలుకు రూ.500, పాతిక కిలోల బ్యాగ్‌పై రూ.100కు పైగా పెరిగాయి. సాధారణంగా మార్చి నుంచి బియ్యం ధరలు అందుబాటులో ఉంటాయి. మునుపటికంటే తగ్గుతాయి. ఎందుకంటే.. జనవరితో పంట చేతికొస్తుంది. రైతులు అప్పట్నుంచి ధాన్యాన్ని రెండు నెలల పాటు నిల్వ ఉంచుతారు. వాటిని వ్యాపారులు కొనుగోలు చేసి మిల్లుల్లో మర పట్టించి మార్కెట్‌కు తరలిస్తారు. ఫలితంగా జులై, ఆగస్టు నెలల వరకు బియ్యం ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మిల్లర్లు సిండికేట్ అయి బియ్యం సరఫరాలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యం లభ్యత ఆశించినంతగా లేకపోవడంతో బియ్యం ధరలు పెంచక తప్పడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. వాస్తవానికి బియ్యాన్ని ప్రభుత్వానికి లెవీ ఇస్తున్నందున ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మిల్లర్లు ధరలు పెంచుతున్నారని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు వేసవికాలంలో ధాన్యం మరపట్టిస్తే నూక ఎక్కువగా వచ్చి బియ్యం దిగుబడి తగ్గుతుందన్నది మరో వాదన. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా మిల్లర్లు నష్టపోకుండా బియ్యం ధరలు పెంచుతుంటారని అంటున్నారు. కాగా రానున్న రెండు, మూడు నెలల వరకు వీటి ధరల పెరుగుదల కొనసాగవచ్చని, ప్రస్తుతంకంటే ఒకింత ఎగబాకే అవకాశం ఉందని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 4 లక్షల కిలోల వినియోగం విశాఖ నగరంలో రోజుకు సగటున 4 లక్షల కిలోల బియ్యం వినియోగమవుతుందని అంచనా. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రస్తుతం సరుకు మార్కెట్‌కు రావడం లేదు. మిల్లర్ల ముందస్తు వ్యూహంలో భాగంగా సరుకును తగ్గిస్తున్నట్టు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్లో బియ్యానికి డిమాండ్/కృత్రిమ కొరత సృష్టించి, ధర పెరగడానికి దోహదపడుతున్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయల ధరలు భారంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బియ్యం రేట్లు కూడా వాటితో పోటీపడుతుండడంపై వినియోగదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అధికారులు రంగంలోకి దిగి బియ్యం ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు. ధరలు తగ్గించకపోతే ఎలా? ఇప్పటికే మార్కెట్లో పప్పుదినుసులు, నూనెల ధరలు మధ్య తరగతి వారికి భారంగా మారాయి. ఇప్పుడు వాటికి బియ్యం రేట్లు కూడా తోడయ్యాయి. వీటి ధరల పెరుగుదలను నియంత్రించాలన్న ఆలోచన ప్రభుత్వానికి గాని, అధికారులకు గాని కలగడం లేదు. ఎవరుష్టానుసారం వారు రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యులే బాధితులవుతున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు కారకులయ్యే వారిపై చర్యలు తీసుకుని కట్టడి చేయాలి. – కుప్పిలి నిర్మల్‌కుమార్, చైతన్యనగర్, సీతమ్మధార -
23.89 లక్షల కార్డులకు రేషన్ బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 23.89 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సబ్సిడీ సరుకులు అందే పరిస్థితి కనిపించటం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బహిరంగంగా ప్రకటించడంతో పేదల్లో ఆందోళన మొదలైంది. ‘ప్రజా సాధికార సర్వే (పల్స్)లో నమోదు చేసుకోని కార్డుదారులకు మార్చి నెల నుంచి రేషన్ నిలిపివేయబడుతుంది’ అని పలు రేషన్ దుకాణాల వద్ద నోటీసులు అతికించారు. పల్స్ సర్వేలో ఇప్పటివరకు వివరాలు నమోదు చేసుకోని తెల్లరేషన్ కార్డుదారులు ఈ నెలాఖరులోగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళ్లి వివరాలు అందచేయాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకులు ఇవ్వబోమని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల తెల్ల రేషన్ కార్డులుండగా 23.89 లక్షల మంది కార్డుదారులు ప్రజా సాధికార సర్వేలో వివరాలను నమోదు చేసుకోలేదని గుర్తించారు. -
భారత్‌ను అబ్బా.. అనిపించేలా ధరల దెబ్బ!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో గత రెండు వారాలుగా వివిధ సరకుల ధరలు పెరగడం ఆయా దేశాలకు ఆనందకర విషయమేమోగానీ భారత్‌కు మాత్రం ఇది మింగుడు పడని విషయం. భారత్ చేసుకునే దిగుమతులపై వీటి ప్రభావం ఎక్కువ పడడమే అందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాలీ మరి కొన్ని నెలలైనా కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. భారత్ ముఖ్యంగా ఖనిజాలు, చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడి ఉందన్న విషయం తెల్సిందే. వీటి ధరలు పెరగడం వల్ల భారత ప్రభుత్వం ఆర్థిక వనరులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దేశంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు కూడా తగ్గుతాయి. పర్యవసానంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటికే దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ కసరత్తు ఓ సవాల్‌గా పరిణమించనుంది. ఈ ఏడాదిలోనే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు అధిక నిధులను విడుదల చేయడం పెను భారం అయ్యే అవకాశం ఉంది. చమురు ధరలు అంతర్జాతీయంగా పెరగడం వల్ల దేశంలోని విమానయాన సంస్థలు, రంగుల కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశం దిగుమతి బిల్లులో క్రూడాయిల్ 35 శాతం ఆక్రమించడం వల్ల వీటి ధరలు పెరగడం ఎంత భారం అవుతుందో అంచనా వేయవచ్చు. బారెల్ క్రూడాయిల్ ధర మొన్నటి వరకు 60 డాలర్ల లోపు ఉండగా జనవరి 4వ తేదీన అది 68 డాలర్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసిన 2017, మార్చి నెలలో క్రూడాయిల్ ధర 47.56 డాలర్లు మాత్రమే ఉండింది. ఈలెక్కన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి గడ్డు రోజులు రానున్నావో ఊహించవచ్చు! -
కమోడిటీస్ డెరివేటివ్స్‌లోకి ఫండ్స్?
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లలో పెట్టుబడులను మరింతగా పెంచే దిశగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌ని (పీఎం) కూడా ఇన్వెస్ట్మెంట్కి అనుమతించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భావిస్తోంది. ఈ మేరకు చర్చాపత్రాన్ని రూపొందించిన సెబీ సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. ఈ నెలాఖర్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, కమోడిటీ డెరివేటివ్స్‌లో ఫండ్స్ పెట్టుబడులపై నియంత్రణపరమైన అంశాలను చర్చాపత్రంలో ప్రస్తావించినప్పటికీ.. వ్యవసాయ, వ్యవసాయేతర కమోడిటీల్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ని అనుమతిస్తారా లేదా అన్న దానిపై స్పష్టతనివ్వలేదు. ఇన్వెస్ట్మెంట్కి మరో కొత్త సాధనంలాగా కమోడిటీ డెరివేటివ్స్ ఉపయోగపడుతుందని, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు తోడ్పడుతుందని సెబీ పేర్కొంది. ‘కమోడిటీలను పోర్ట్‌ఫోలియోలో చేర్చడం వల్ల కొంత రిస్కు పెరుగుతుంది. కానీ రిస్కులతో పోలిస్తే మొత్తం పోర్ట్‌ఫోలియో మీద వచ్చే రాబడులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది. -
దివ్యాంగులకు రేషన్ తిప్పలు
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన కె.నాగేశ్వరరావుకు లెప్రసీ వ్యాధి వల్ల చేతి వేళ్లు సరిగా లేవు. ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేస్తేనే రేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం తీసుకోవాలంటే ప్రతి నెలా ఇలాంటివారికి కష్టాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో లెప్రసీతోపాటు తాపీ పనిచేసే వాళ్లకు వేలి ముద్రలు సరిగా పడటం లేదు. వీరితోపాటు వయసు మీరడం వల్ల రేషన్ దుకాణం వరకు వెళ్లలేని వాళ్లు రాష్ట్రంలో 57,810 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.42 కోట్ల తెల్లరేషన్ కార్డుల్లో వేలిముద్రలు సరిగా పడని, రేషన్ దుకాణం వరకు వెళ్లలేని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆరు నెలల కిందట ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా వాటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. వేలిముద్రలు సరిగా పడనివారి నుంచి ఐరిష్ తీసుకొని సరుకులు ఇవ్వాలని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఐరిష్ మిషన్లు ఎక్కడా పనిచేయడం లేదు. అంబాజీపేటకు చెందిన నాగేశ్వరరావు సబ్సిడీ బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా ఐరిష్ పనిచేయలేదు. ఈ విషయాన్ని రేషన్ డీలర్ తూర్పుగోదావరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. దీంతో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు ద్వారా పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లడంతో తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. ఇలా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరిస్తే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని డీలర్లు కోరుతున్నారు. కాగా.. రేషన్ షాపుల వరకు వెళ్లలేని వారికి.. మీ ఇంటికి–మీ రేషన్ పథకం ద్వారా ఇళ్లకే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆరు నెలల కిందట నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు రేషన్ డీలర్లు దీన్ని పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్వోల ద్వారా సరుకులను అంగవైకల్యం ఉన్నవారి ఇళ్లకు పంపాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే వీఆర్వోలు సరిగా అందుబాటులో ఉండని కారణంగా సమస్య ఉత్పన్నమవుతోందని డీలర్లు అంటున్నారు. వేలిముద్రలు సరిగా పడని కారణంగా, అంగవైకల్యం వల్ల రేషన్‌కు దూరంగా ఉంటున్న లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం జిల్లాల వారీగా సేకరించింది. -
నరకయాతన
మహానగరం కకావికలం హుదూద్ దెబ్బకు ధ్వంసమైన విశాఖ ఎటు చూసినా మోడువారిన వృక్షాలు ఛిద్రమైన భారీ భవంతులు..షాపింగ్ మాల్స్ రోడ్డున పడ్డ నిరుపేదలు-ఆస్పత్రుల్లో హాహాకారాలు కనుమరుగైన పర్యాటకం-స్తంభించిన జనజీవనం పచ్చని విశాఖ మోడువారిపోయింది. తుపాను మిగిల్చిన శిథిలాల మధ్య శాపగ్రస్థలా నిల్చుంది. పచ్చని చెట్లతో పరవశింపజేసిన ఇళ్ల ముందు శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. విద్యుద్దీపాలతో వెలిగిపోయిన మహా విశాఖ ఒక్క రాత్రిలో నిశీథి నగరిగా మారింది. గుక్కెడు మంచినీటికి నోచక ఎడారిని తలపిస్తోంది. పసిపిల్లాడి గొంతులో పాల చుక్కలు పోద్దామన్నా కష్టమవుతోంది. వాహనాల దాహం తీర్చే ఇంధనం కోసం యుద్ధాలు చేయాల్సి వస్తోంది. తలలు తెగిన సైనికుల్లా రోడ్డంతా పరచుకున్న విద్యుత్ స్తంభాలు... ఏళ్ల తరబడి ప్రాణవాయువు అందించి నేలకూలిన వృక్షరాజాలు... ఈ గాయాలు మానిపోవాలి. ‘పచ్చని’ జీవితం కోసం కొత్త ప్రయాణం మొదలుపెట్టాలి. చీకట్లో చిరు‘దీపం’ వెలిగించేందుకు సన్నద్ధమవ్వాలి. ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ ఇప్పుడందరిదీ ఇదే బాట. ఆత్మవిశ్వాసంతో రేపటి కోసం పాడుతున్నారు బతుకు పాట. సాక్షి, విశాఖపట్నం: పాలు లేవు, గుక్కెడు మంచి నీళ్లు లేవు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు నింగినంటాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఎప్పుడన్నది జవాబులేని ప్రశ్న. మహా విధ్వంసాన్ని సృష్టించి నిష్ర్కమించిన హుదూద్ తుఫాన్ చేసిన ఘోరం తో విశాఖ వాసుల దురవస్థ ఇది. తుఫాన్ వి రుచుకుపడటంతో అద్భుత దృశ్యం అంతర్థానమైంది..కమనీయ చిత్రం కనుమరుగైం ది..సుమనోహర శిల్పం శిథిల రాగం ఆలపిస్తోంది.అందాల నగరం క్షతగాత్రగా మారింది. హుదూద్ చేసిన పెనుగాయంతో కకావికలమైన విశాఖ మళ్లీ కోలుకోవాలంటే దశాబ్దకాలంపైగానే పడుతుంది. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే..తలలు తెగిపడి చెల్లాచెదురుగా పడిన భారీ వృక్షాలు..నేలకూలిన విద్యుత్‌స్తంభాలు..అడుగు తీసి అడుగు వేయడానికి అవకాశం లేని దుర్భర పరిస్థితి. రాకాసి గాలుల హోరుకు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన నగర వాసులు శనివారం రాత్రి హుదూద్ పెను తుఫాన్ రేపిన ధాటికి సోమవారం నేలకూలిన పూరి గుడిసెలు, ధ్వంసమైన ఇళ్లను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రకృతి విలయతాండవానికి వందల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులుగా మిగిలారు. ఎంతమంది విగతజీవులయ్యారో అధికారులు సైతం తేల్చలేకపోతున్నారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో చిమ్మచీకట్లు అలముకున్నాయి. ఇక వేల కోట్లల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. గ్రీన్‌సిటీ కాస్తా నేడు వేలల్లో నేలకూలిన మహా వృక్షాలతో కళావిహీనంగా తయారైంది. పర్యాటకులను కట్టిపడేసే బీచ్ రోడ్డు కోతకు గురైతే వుడా, లుంబినీ వంటి పచ్చని పార్కులు శ్మశాన దిబ్బను తలపించేలా తయారయ్యాయి. విద్యుత్ స్తంభాలైతే మెలితిరిగిపోయి సర్పవిన్యాసాలే చేశాయి. ఇక అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చెందాల్సిన విశాఖ ఎయిర్‌పోర్టు అంద వికారంగా తయారైంది. గత వారం రోజులుగా హుదూద్ విధ్వంసంపై హెచ్చరించిన ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకోవడంలో మాత్రంఘోరంగా విఫలమైంది. బాధితులు గుక్కెడు నీళ్లు కూడా దొరక్క అల్లాడిపోయారు. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇక కోల్‌కతా-చెన్నయ్లను కలుపుతూ విశాఖ మీదుగా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి రూపురేఖల్లేకుండా పోయింది. కశింకోట-అగనంపూడిల మధ్య పలుచోట్ల కోతకు గురైంది. ఇక నక్కపల్లి మొదలు శ్రీకాకుళం వరకు జాతీయరహదారిపై మహావృక్షాలు నేలకొరగడంతో వేలాదిగా వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. సాయంత్రానికి ఈ రహదారిలో రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించగలిగారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో దీపావళి వెలుగులు విరజిమ్మాల్సిన మహానగరంలో చిమ్మచీకట్లు ఆవహించాయి. జనరేటర్లను ఇదే అదనుగా వేలల్లో దోపిడీ చేస్తున్నారని కోటేశ్వరరావు అనే వ్యక్తి వాపోయారు. నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. పాలు..నీళ్లూ కూడా కరువ య్యాయి. పాలప్యాకెట్ రూ.50 నుంచి రూ.100ల వరకు విక్రయిస్తే భోజనం రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయించారు. వాటర్ బాటిల్స్ కూడా ఒక్కొక్కటి రూ.40లకు, ఐదురూపాయల బిస్కెట్‌ప్యాకెట్ రూ.20లకు విక్రయించారు. నగరంలో ఒక అరడజను వరకు బంకుల్లో మాత్రమే పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉండడంతో ఆ బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి కన్పించింది. జాతీయ, అంతర్జాతీయ పేరెన్నిక గల షాపింగ్ మాల్స్న్నీ తుక్కుతుక్కయ్యాయి. పర్యాటకరంగానికి పెట్టింది పేరైన విశాఖనగరం కళావిహీనంగా తయారైంది. జూపార్క్‌తో పాటు ఉడా, లుంబిని, శివాజీ, కైలాసగిరి, తెన్నేటి పార్కులు, వైశాఖి జల ఉద్యానవనం వంటి పర్యాటక ప్రాంతాలన్నీ చూడ్డానికే భయానకంగా తయారయ్యాయి. జూపార్కులో కూడా అదే పరిస్థితి. కైలాసగిరిలో రాళ్లు తప్ప చూడ్డానికి ఏమీ మిగల్లేదు. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ట్రీ కటింగ్స్ చేస్తూ హైవేలో కుప్పకూలిన వృక్షాలను తొలగిస్తున్నప్పటికీ నేలకూలిన విద్యుత్ స్తంభాలు తొలగించే పరిస్థితి లేకపోవడంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై నరానికి వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
జిగ్నేష్ షాకు బెయిల్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణం కేసులో జిగ్నేష్ షాకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. బొంబాయి హైకోర్టు జస్టిస్ అభయ్ తాప్సే శుక్రవారం బెయిల్ జారీ ఆదేశాలు ఇచ్చారు. జిగ్నేష్ స్థాపించిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్‌లో ఎన్ఎస్ఈఎల్ ఒక విభాగం. దాదాపు రూ.5,600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో మే 7న షా అరెస్టయ్యారు. అంటే దాదాపు 107 రోజులు జైలులో గడిపారు. షరతులివి... రెండు వారాల్లో క్యాష్ రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీ, అంతే మొత్తానికి సమానంగా సాల్వెంట్ ష్యూరిటీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే నిందితుడు తప్పించుకుని పారిపోయే ఉద్దేశం లేనివాడు కావడం వల్ల రెండు ష్యూరిటీలకు బదులుగా రూ.5,00,000 క్యాష్ ష్యూరిటీపైనే బెయిల్ ఇవ్వాలని షా న్యాయవాదులు అమిత్ నాయక్, అనికేత్ నికామ్‌లు చేసిన వినతికి న్యాయస్థానం అంగీకరించింది. విచారణా కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ ప్రతి సోమ, గురువారాల్లో విచారణా సంస్థ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని కూడా కోర్టు షాకు ఆదేశాలు ఇచ్చింది. ఆయన పాస్‌పోర్ట్ ఇప్పటికే అధికారుల స్వాధీనంలో ఉంది. కుంభకోణంలో డబ్బు నష్టపోయిన వారు షాకు బెయిల్ ఇవ్వడం తగదని అంతకుముందు కోర్టుకు విన్నవించారు. విచారణా (దిగువ) కోర్టు జూన్ 24న షాకు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో షా విడుదలైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్లే బెయిల్‌కు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులను షా బొంబాయి హైకోర్టులో సవాలు చేశారు. కుంభకోణంలో ఆయన తప్పేమీ లేదని షా న్యాయవాదులు వాదించారు. ఆయన ఉద్యోగులు కొందరికి ఈ అంశంలో భాగం ఉండే అవకాశం ఉందని వివరించారు. అసలు ఏమి జరుగుతోందో కూడా ఆయన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. -
ప్రమాణాల స్వామికే పంగనామాలా!
*కాణిపాకం దేవస్థానం గోడౌన్లో నాసిరకం సరుకులు *పాలకమండలి తనిఖీల్లో బయటపడిన వైనం *మిరియాల్లో ఎక్కువగా బొప్పాయి గింజలు *కుంకుమ పువ్వుకు బదులుగా కొబ్బరి పువ్వు కాణిపాకం : ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడినే కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు. స్వామివారి ఏకాంత సేవకు వినియోగించే సరుకులను కూడా నాసిరకమైనవి సరఫరా చేస్తున్నారు. శుక్రవారం పాలకమండలి సభ్యుల ఆకస్మిక తనిఖీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే లడ్డూ పోటును పాలకమండలి సభ్యులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో నాసిరకం, నకిలీ సరుకులు ఉండడాన్ని గుర్తించారు. మిరియాల్లో ఎక్కువగా బొప్పాయి గింజలు ఉన్నాయి. కుంకుమపువ్వుకు బదులు కొబ్బరి తురిమి రంగు వేసి పదార్థాన్ని కాంట్రాక్టర్ సరఫరా చేసి ఉన్నారు. జీడిపప్పు మూడవ రకం, అభిషేక ప్రసాదాలకు వినియోగించే బియ్యం రెండో రకం ఉన్నారుు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్పర్సన్ లతా రాజ్‌కుమార్, సభ్యులు సుబ్రమణ్యం రెడ్డి,ఆలయ ఏఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తనిఖీల అనంతరం పాలక మండలి చైర్పర్సన్ లతా రాజ్‌కుమార్ మాట్లాడుతూ నాసిరకం, నకిలీ వస్తువులను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. నాసిరకం,నకిలీ సరుకులను పంపిణీ చేస్తున్నా ఆలయ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. స్వామివారి ఆర్జిత సేవకు వినియోగించే కుంకుమ పువ్వు సైతం నకిలీది కావడం బాధాకరమన్నారు. నకిలీ,నాసిరకం వస్తువుల వల్ల ప్రసాదాల నాణ్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారుల సహకారమేనా? గత కొన్నేళ్లుగా తిరుపతికి చెందిన ఓ కాంట్రాక్టర్ స్వామివారి ఆలయానికి అవసరమైన సరుకులను అందిస్తుంటారు. వీటిని టెండరు ద్వారా మూడు నెలలకు ఒకసారి తెప్పించుకుంటుంటారు. బిల్లులు లక్షల్లో ఉంటున్నాయి. దీన్నిబట్టి ఎడాదికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలను మింగిస్తున్నారని తెలుస్తోంది. దేవస్థానం అధికారుల సహకారం వల్ల నాసిరకం సరుకులు సరఫరా అవుతున్నాయా అనే అనుమానాలున్నాయి. -
దీపావళి నాటికి రూ. 24వేలకు బంగారం ధర
-
దీపావళి నాటికి రూ. 24వేలకు బంగారం ధర
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ చుక్కలు చూపిన బంగారం ధరలు క్రమంగా నేలచూపులు చూస్తున్నాయి. వారం రోజుల్లోనే బంగారం ధర పది గ్రాములకు 2వేల రూపాయలు తగ్గింది. దీపావళి పండుగ నాటికి పది గ్రాముల బంగారం ధర 24వేలకు దిగిరావచ్చని ఇండియన్ బులియన్ అండ్ జూయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,600లుగా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 41,250 వద్ద కొనసాగుతోంది. అలాగే రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గడం, ఇదే సమయంలో బంగారం ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని వారు అంటున్నారు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మరో 5 శాతం తగ్గుతుందని, అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.25,000కి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
బంగారు కొండ.. దిగొస్తోంది!
6 నెలల్లో మరో 10 శాతం తగ్గుతుందని అంచనా పది గ్రాములు రూ. 26,000-24,000 శ్రేణికి రావొచ్చు కలిసొస్తున్న డాలరు పతనం, ఆంక్షల సడలింపు అంతర్జాతీయంగా బంగారానికి తగ్గుతున్న డిమాండ్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొద్దికాలంగా స్థిరంగా కదులుతున్న బంగారం ధరలు రానున్న కాలంలో మరింత తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గించడానికి గతంలో బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడం, రూపాయి పతనం కారణాలతో అంతర్జాతీయంగా తగ్గుతున్నా, దేశీయంగా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఎఫ్ఐఐ నిధుల ప్రవాహం పెరిగి రూపాయి విలువ బలపడ సాగింది. దీనికి తోడు బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయంటున్నారు. ఇప్పటికే బంగారం ధరలు 5 శాతం క్షీణించాయని, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో తక్కువలో తక్కువ మరో 5-7 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని జెన్‌మనీ డెరైక్టర్, బులియన్ నిపుణులు ఆర్.నమశ్శివాయ పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పది గ్రాముల బంగారం ధర రూ. 26,000-25,000కి తగ్గొచ్చన్నారు. రానున్న కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ 56-54 స్థాయికి చేరొచ్చని అంచనాలు వేస్తున్నారని, దీనికి ప్రభుత్వం సుంకాలు తగ్గించడం తోడైతే ప్రస్తుత స్థాయి నుంచి బంగారం ధరలు గరిష్టంగా 15 నుంచి 18 శాతం తగ్గినా ఆశ్చర్చపోనవసరం లేదని నమశ్శివాయ పేర్కొన్నారు. పెళ్లిల సీజన్, శ్రావణ మాసం వంటివి ఉండటంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ బాగుంటుందని, దీంతో తక్షణం ధరలు బాగా తగ్గే అవకాశాలు తక్కువని, నవంబర్ నాటికి బాగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కిలోకి ఐదు లక్షలు అధికం బంగారంపై ప్రభుత్వ ఆంక్షల వల్ల అంతర్జాతీయ ధరల కంటే దేశీయంగా కిలో బంగారం ధర రూ. 5 లక్షలు అధికంగా ఉందని రిద్ధిసిద్ధి బులియన్స్ డెరైక్టర్ గుంపెళ్ల శేఖర్ పేర్కొన్నారు. బంగారం దిగుమతులపై ఆర్బీఐ విధించిన 20:80 శాతం నిబంధనలతో రూ. 2 లక్షలు, దిగుమతి సుంకంతో రూ. 2 లక్షలు, వ్యాట్ లక్ష చొప్పున మొత్తం అయిదు లక్షలు అధికంగా ఉందన్నారు. ఇప్పుడు ఆర్బీఐ 20:80 పరిధి కింద మరో పది కంపెనీలకు బంగారం దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం కిలోకి రూ.80,000 తగ్గిందన్నారు. మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మరో 5 శాతం తగ్గుతుందని, అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.25,000కి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బంగారం అమ్మకాలకు డిమాండ్ లేదని, ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత వస్తే కాని ఎంత వరకు తగ్గవచ్చన్నది చెప్పలేమని ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుతం పది శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4-5 శాతానికి తగ్గిస్తే దీపావళి నాటికి బంగారం ధరలు రూ. 23,000 నుంచి రూ.24,000కు తగ్గుతాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గడం, ఇదే సమయంలో బంగారం ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని బులియన్ నిపుణులు అంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే ఇండియాలో 26%, చైనాలో 16% క్షీణించడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. ఒకవేళ ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,280 డాలర్ల వద్దే స్థిరంగా ఉన్నా, దేశీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ తగ్గుతుందని నమశ్శివాయ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1,050 డాలర్ల వరకు క్షీణించే అవకాశం ఉందని, ఒకవేళ పెరిగితే 1,320-1,400 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాలున్నాయన్నారు. ఇలా ఏ విధంగా చూసినా రానున్న కాలంలో ఇండియాలో బంగారం ధరలు తగ్గడమే కాని పెరిగే అవకాశాలు తక్కువన్నది చాలామంది నిపుణుల అభిప్రాయం. -
జీసీసీలో బియ్యం పక్కదారి?
7.6 టన్నుల బియ్యం రానేలేదు అలమటిస్తున్న గిరిజనులు గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్ : గూడెంకొత్తవీధి గిరిజన సహకార సంస్థలో మరో అక్రమం బయటపడింది. ఏడాది క్రితం రూ.71 లక్షల జీసీసీ సొమ్ము పక్కదారి పట్టిన విషయం జనం మరచిపోకముందే మరో అవినీతి వెలుగు చూసింది. ఈసారి ఏకంగా 7.60 టన్నుల బియ్యం పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీసీసీ సంస్థ ఆయా గ్రామాల్లోని డిపోలకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంది. జీకేవీధిలో బ్రాంచి,గొడౌన్ ఏర్పాటు చేసి 26 ముఖ్య డిపోలు, 12 సబ్ డిపోల ద్వారా కార్డుదారులకు సరుకులు ఇస్తున్నారు. ఈ 36 డిపోలకు గత ఏప్రిల్ నెలకు సంబంధించి 3,30,600 కిలోల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ఐతే ఏప్రిల్, మే నెలల్లో రావలసిన బియ్యం లో 7.60 టన్నుల సరుకును అధికారులు సరఫరా చేయనే లేదు. దీంతో జీసీసీ అధికారులు వీటిని పక్కదారి పట్టించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ రెండు నెలలకు సంబంధించి పౌరసరఫరాల శాఖ నుంచి స్టాకు తక్కువగా వస్తోందని జీసీ సీ సిబ్బంది చెబుతున్నారు. అయితే తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు జీసీసీ అధికారులు ఈ భారాన్ని సేల్స్‌మెన్‌పై వేస్తున్నారు. అన్ని డిపోలకు రెండేసి బస్తాలు తగ్గించి పంపుతున్నారు. దీంతో ఆ మేరకు గిరిజనులకు కోటాలో కోతపడుతోంది. జీసీసీ అధికారుల జాడ ఎక్కడ? గూడెంకొత్తవీధి గిరిజన సహకార సంస్థలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా పూర్తిస్థాయి బ్రాంచి మేనేజర్ లేకపోవడంతో అధికారులు విధులకు తరచు డుమ్మా కొడుతున్నారు. రెండు నెలల క్రితం కొయ్యూరు జీసీసీ బ్రాంచి మేనేజర్‌గా ధర్మజ్ఞానంను జీకేవీధికి ఇన్చార్జి మేనేజరుగా నియమించారు. అయితే రెండు మండలాల బాధ్యతలు చూసుకోవడంలో ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇక గోదాము విషయానికి వస్తే సూపరింటెండెంట్ చింతపల్లిలోనే మకాం వేసి, ఓ సహాయకుని ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. బుధవారం విలేకరుల బృందం జీసీసీ బ్రాంచి కార్యాలయానికి వెళ్లగా బ్రాంచి కార్యాలయంలో తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు గూడెంకొత్తవీధి బ్రాంచి పరిధిలో జరిగే అక్రమాలపై ఆ సంస్థ పాడేరు డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా ఈ సంఘటనపై తనకు సమాచారం లేదన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పెదబయలులో భారీ వర్షం
తడిసి ముద్దయిన పసుపు, పిప్పళ్లు మరింత పతనమైన మార్కెట్ ధర గిరిజన రైతుల ఆవేదన పెదబయలు, న్యూస్‌లైన్: పెదబయలు మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సంతకు వచ్చిన గిరిజనలు, రైతులు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి వాతావరణం బాగుండి ఒక్క సారిగా వాతావరణంలో మర్పు సంభవించి భారీ వర్షం కురిసింది. దీంతో సంతలో అమ్మకానికి తెచ్చిన పసుపు, పిప్పళ్లు తడిసిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు వర్షం కురవడంతో రైతులు తెచ్చిన సరుకులు, వ్యాపారులు కొనుగోలు చేసిన బస్తాలు నానిపోయాయి. ఉన్న ఫళంగా వాన పడడంతో ఏం చేయాలో తోచక సరుకును అక్కడికక్కడే వదిలేశారు. పసుపు, పిప్పళ్లు వర్షానికి తడిసిపోవడంతో కొనడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో చాలా మంది గిరిజన రైతులు వ్యాపారులను బతిమాలి ఎంతోకొంతకు తీసుకోవాలని కోరారు. అయితే వ్యాపారులు కొనుగోలు చేసిన బస్తాలు కూడ పూర్తిగా తడిసిపోయాయి. పిప్పళ్లు, పిప్పళ్ల నలక పాడయ్యే ప్రమాదం ఉందని వ్యాపారులు, రైతులు న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఇలాంటి ఆపత్కాలంలో సరుకును నిల్వ ఉంచేందుకు గోదాములు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందారు. గతంలో సంతకు షెడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన అరకులోయ ఎమ్మెల్యే సివేరి సోమ ఇప్పుడు జాడలేకుండా పోయారని రైతులు ఆవేదన చెందారు. గోదాములు నిర్మించి ఉంటే ధర తగ్గిన సమయంలో వాటిలో నిల్వచేసే వీలుంటుందని అంటున్నారు. గిరిజనులు ఓట్లతో గెలిచిన నాయకులు ఆ తరువాత ప్రజల కష్టాలు మరిచిపోతున్నారని అన్నారు. -
యాజవూన్యానిదే తప్పు
ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ నివేదిక ఎఫ్టీఐఎల్ బోర్డుకూ భాగస్వామ్యం న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) వ్యవహారంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ తుది నివేదికను సిద్ధం చేసింది. ఎన్ఎస్ఈఎల్ యాజమాన్యం కొన్ని అంశాలలో కంపెనీల చట్టాన్ని అతిక్రమించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను ఇప్పటికే న్యాయ శాఖ, ఆర్థిక శాఖలతోపాటు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో జరిగిన కొన్ని రకాల అవకతవకలకు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డు(ఎఫ్టీఐఎల్) సైతం బాధ్యురాలైనట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈఎల్లో ఎఫ్‌టీఐఎల్‌కు 99.99% వాటా ఉంది. పలు అవకతవకలు 2013 నవంబర్‌లో కంపెనీల రిజిస్ట్రార్(ఆర్వోసీ) ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొన్నట్లుగానే ఈ రెండు సంస్థల బోర్డు స్థాయిల్లో అవకతవకలు జరిగినట్లు తాజా నివేదిక సైతం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్‌ను అనుమతించడంపై డెరైక్టర్లు ఎన్నడూ చర్చించలేదని, వీటిని స్వల్పకాలిక కాంట్రాక్ట్‌లతో అనుసంధానించడం వల్ల చెల్లింపుల సంక్షోభం తలెత్తిందని నివేదిక పేర్కొంది. నిజాలను దాచడం, గిడ్డంగుల నిర్వహణలో లోపాలు, రిస్క్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోవడం, చెల్లింపుల్లో విఫలమైన సభ్యులను ట్రేడింగ్‌కు అనుమతించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు వివరించింది. కార్పొరేట్ పాలన విషయంలో కంపెనీ బోర్డు పూర్తిస్థాయిలో విఫలమైనట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక ఎన్ఎస్ఈఎల్ ఆడిట్ నివేదికలోనూ పలు లోపాలున్నట్లు వెల్లడించింది. తప్పించుకోలేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్ కంపెనీలలో జిగ్నేష్ షాతోపాటు, జోసెఫ్ మాసే, శ్రీకాంత్ జవల్గే కర్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆర్వోసీ నివేదిక తెలిపింది. అయితే ఆయా కంపెనీలలో జరిగిన అవకతవకలు తెలియవన్నట్లు తప్పించుకోవడానికి వీలుండదని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఇచ్చిన నివేదికలో ఆర్వోసీ స్పష్టం చేసింది కూడా. ఏం జరిగింది? ఎల క్ట్రానిక్ పద్ధతిలో వివిధ కమోడిటీలలో కాంట్రాక్ట్‌లను నిర్వహించేందుకు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్‌లకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను పూర్తిచేయలేక ఎక్స్ఛేంజీ సంక్షోభంలో చిక్కుకుంది. దీనికితోడు గిడ్డంగుల్లో సైతం తగిన స్థాయిలో సరుకు నిల్వలు లేకపోవడం సంక్షోభాన్ని పెంచింది. దీంతో గతేడాది ఆగస్టులో ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దశలవారీ చెల్లింపులకు కోరిన గడువులలో సైతం ఎక్స్ఛేంజీ నగదు సమకూర్చుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. ఇందుకు పలువురు సభ్యులు చెల్లింపుల్లో విఫలంకావడం కారణమైంది. -
బంగారం.. భగభగ!
ముంబై: బంగారం ధరలు సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లలో భారీగా పెరిగాయి. ఇక్కడ ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్లో ధర రూ.29 వేలు పైబడింది. 24, 22 క్యారెట్ల ధరలు రూ.715, రూ. 710 చొప్పున ఎగసి వరుసగా రూ. 29,400, రూ. 29,250కి చేరాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఇక వెండి ధర సైతం భారీగా పెరిగింది. కేజీ ధర రూ. 1,825 పెరిగి రూ. 45,115కు చేరింది. దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో స్పాట్ మార్కెట్లలో సైతం బంగారం ధరలు భారీగా ఎగశాయి. హైదరాబాద్‌లో 22, 24 క్యారెట్ల రేట్లు వరుసగా రూ.29,500, రూ.28,500గా నమోదయ్యాయి. కారణాలు ఏమిటి? డాలర్ మారకంలో రూపాయి బలహీనత, అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్స్ మార్కెట్లో సానుకూల సంకేతాలు బంగారం ధర పెరగడానికి కారణం. దీనికితోడు రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) కట్టడికి బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు మరింత పెరగనున్నాయని. ఇందుకు సంబంధించిన కస్టమ్స్ నోటిఫికేషన్లను ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నదన్న వార్తలు బంగారం ధర స్పీడ్‌ను పెంచాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో భారీ జంప్... కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే ఔన్స్ (31.1 గ్రా) 23 డాలర్లు ఎగసి, 1,336 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 4 శాతం లాభంతో 21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇందుకు అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందేసరికి రూ.989 పెరిగి, రూ. 28,895 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర సైతం 6 శాతానికి పైగా ఎగసి (రూ.2,923) రూ. 45,621 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మంగళవారం స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు (రూపాయి విలువ కదలికలకు లోబడి) భారీగాా పెరిగే అవకాశం ఉంది. కాగా అమెరికాలో సహాయక ప్యాకేజ్‌లు మరికొంత కాలం కొనసాగవచ్చన్న వార్తలు, అలాగే చైనాలో బంగారం వినిమయం భారీగా పెరిగిందన్న నివేదికలు అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.