
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసి, ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు వరద నీటిలో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కిలో ఉల్లిగడ్డలు, కిలో బంగాళదుంపలు పంపిణీ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ సోమవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment