
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి భారమైంది.
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో యల్లోమెటల్ ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ప్రియమైంది. మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 328 పెరిగి రూ 39,028 పలికిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. మరోవైపు వెండి ధర సైతం రూ 748 ఎగబాకి కిలో రూ 45,873కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌బంగారం 1470 డాలర్లకు చేరిందని, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద చర్చలపై ఆధారపడి పసిడి తదుపరి ధరలు ప్రభావితమవుతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ చెప్పారు.