
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. తేలికపాటి వాణిజ్య వాహనం టాటా 407 సీఎన్‌జీ వర్షన్‌ను విడుదల చేసింది. ధర పుణే ఎక్స్‌షోరూంలో రూ.12.07 లక్షలు. డీజిల్ వేరియంట్‌తో పోలిస్తే ఇది 35 శాతం వరకు అధిక లాభాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
డీజిల్ ధర పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ శ్రేణిని విస్తరిస్తున్నట్టు వివరించింది. 35 ఏళ్లలో టాటా 407 మోడల్ వాహనాలు ఇప్పటి వరకు 12 లక్షల పైచిలుకు యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ విభాగంలో అత్యధిక అమ్మకాలు సాధించిన మోడల్ ఇదేనని టాటా మో టార్స్ వెల్లడించింది.
3.8 లీటర్ సీఎన్‌జీ ఇంజన్, 85 పీఎస్ పవర్, 285 ఎన్‌ఎం టార్క్, 10 అడుగుల లోడ్ డెక్, 180 లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉంది. గరిష్టంగా మోయగలిగే సరుకుతో కలిపి మొత్తం వాహన బరువు 4,995 కిలోలు.
Comments
Please login to add a commentAdd a comment