20 ఏళ్లకు పైబడిన వాహనాలకు నో ఎంట్రీ! | no entry for over 20 years old vehicles | Sakshi
Sakshi News home page

20 ఏళ్లకు పైబడిన వాహనాలకు నో ఎంట్రీ!

Published Sat, Mar 17 2018 2:52 AM | Last Updated on Sat, Mar 17 2018 2:52 AM

no entry for  over 20 years old vehicles - Sakshi

న్యూఢిల్లీ: 20 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను తప్పనిసరిగా వినియోగం నుంచి తప్పించడానికి ఉద్దేశించిన విధానానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ విధానం 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ‘వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ’ తుది దశకు చేరుకుందని రవాణా మంత్రి గడ్కరీ గతంలో చెప్పారు. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి  నేతృత్వంలో పీఎంఓలో జరిగిన భేటీలో ఈ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సీనియర్‌ అధికారి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement