PMO officials
-
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నివాసంలో గురువారం ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సిబ్బంది కుమార్తెలు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మోదీకి రాఖీ కట్టిన వారిలో స్వీపర్స్, ప్యూన్స్, తోటమాలి, డ్రైవర్ సహా ప్రధాని కార్యాలయంలో పని చేసే వారి పిల్లలు ఉన్నారు. మోదీకి రాఖీ కడుతున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు పీఎంఓ అధికారులు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘ఈ ప్రత్యేక పండుగ రక్షా బంధన్ రోజున ప్రతిఒక్కరికి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు మోదీ. అధికారిక నివాసంలో తనకు రాఖీ కట్టిన చిన్నారులను ఆశీర్వదించారు. వారితో కాసేపు ముచ్చటించారు. A very special Raksha Bandhan with these youngsters... pic.twitter.com/mcEbq9lmpx — Narendra Modi (@narendramodi) August 11, 2022 ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
ప్రధాని అపాయింట్మెంట్ కేసీఆర్ అడగలేదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలే దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే గత సెప్టెంబర్ 1వ తేదీన అపా యింట్మెంట్ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడం, సీఎం కేసీఆర్ వారిని కలవడం జరిగిం దని గుర్తు చేశాయి. నీటి పంపకాలు, వరి ధాన్యం కొను గోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవ డానికి ఢిల్లీ వెళ్తామని, అవసరమైతే తాను ప్రధానిని కలు స్తానని గత శనివారం సీఎం విలేకరుల సమా వేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆ మరు సటి రోజే ఢిల్లీ బయ ల్దేరి వెళ్లిన సీఎం బుధవా రం సాయంత్రం హైదరా బాద్ తిరిగి చేరు కున్నారు. అయితే నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. మోదీని, అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చా యి. ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ తమకు ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాయి. -
‘పార్లమెంట్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలకు చరిత్రలో చోటుండాలి’
న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బంది సేవలకు చరిత్రలో చోటు కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. వారంతా ఒక చారిత్రక, పవిత్రకార్యంలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. వారి సేవలు కలకాలం గుర్తుండిపోయేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజిటల్ ఆర్కైవ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ భవన నిర్మాణ పనుల పురోగతిని సోమవారం ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది డిజిటల్ ఆర్కైవ్‌లో ఒక్కొక్కరి పేరు, ఊరు, ఫొటో, నిర్మాణ పనుల్లో వారి సహకారం వంటి వ్యక్తిగత వివరాలను పొందుపరచాలన్నారు. చదవండి: బాధితులను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి: మెదడుపై ఎఫెక్ట్! నిర్మాణంలో వారి పాత్ర, భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వాలన్నారు. వారందరికీ కోవిడ్ టీకా తప్పనిసరిగా వేయాలనీ, నెలకోసారి హెల్త్ చెకప్ చేపట్టాలని అధికారులను మోదీ కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ప్రధాని పార్లమెంట్ భవన నిర్మాణపనులను సుమారు గంటపాటు స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ -
పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విరాళాల వరదతో నిండుతున్న పీఎం కేర్స్ ఫండ్.. రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కార్యకలాపాలు నిర్వహించదని పీఎం కేర్స్ ఫండ్ ఉన్నతాధికారి స్పష్టంచేశారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో ఉప కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ గౌరవ హోదాలో పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు అత్యున్నత నిర్ణయక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో సమ్యక్ గంగ్వాల్ ఒక పిటిషన్ వేశారు. ట్రస్టును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి, పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగేలా ఆదేశాలు జారీచేయాలంటూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఉమ్మడి విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టింది. దీనిపై స్పందనగా ప్రదీప్ శ్రీవాస్తవ కోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించారు. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్యానెల్ నేతృత్వంలో ఎంపిక చేసిన చార్టెడ్ అకౌంటెంట్‌తో ట్రస్టు ఆడిటింగ్ పూర్తయిందని అఫిడవిట్లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ‘థర్డ్‌పార్టీ’ వివరాలు ఇవ్వలేమన్నారు. తర్వాత పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు. ట్రస్టు కేంద్ర ప్రభుత్వానిది కానపుడు ట్రస్టు వెబ్సైట్ చిరునామాలో జౌఠి అనే ప్రభుత్వ డొమైన్‌ను, ప్రధాని మోదీ అధికారిక ఫొటోను, జాతీయ చిహ్నాన్ని వాడకుండా నిరోధించాలని కోర్టును కోరారు. -
కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి తీవ్రరూపం దాలుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మంగళవారం సమీక్ష చేయనున్నారు. క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని మోదీ సమీక్ష చేస్తారని పీఎంఓ అధికారులు ప్రకటించారు. పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వర్చువల్‌గా ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలను ప్రధానికి అధికారులు వివరించనున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న 9 రాష్ట్రాల్లోని 46 జిల్లాల అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు పీఎంఓ వెల్లడించింది. -
20 ఏళ్లకు పైబడిన వాహనాలకు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: 20 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను తప్పనిసరిగా వినియోగం నుంచి తప్పించడానికి ఉద్దేశించిన విధానానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ విధానం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ తుది దశకు చేరుకుందని రవాణా మంత్రి గడ్కరీ గతంలో చెప్పారు. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంఓలో జరిగిన భేటీలో ఈ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సీనియర్ అధికారి చెప్పారు. -
పీఏలుగా బంధువులు వద్దు: మోడీ
తన కార్యాలయానికి వచ్చే ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాలు కావాలని ప్రధాని కార్యాలయ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేలా పీఎంఓ నడుచుకోవాలని, రాష్ట్రాల సమస్యలను ప్రాధాన్య క్రమంలో తీర్చాలని ఆయన చెప్పారు. గతకాలంలో ఉన్న మంచి అంశాలను ఇకపై కూడా కొనసాగిస్తామని మోడీ తెలిపారు. ఇక మంత్రులు ఖర్చులను తగ్గించుకోవాలని, బంధువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పీఏలుగా పెట్టుకోవద్దని స్పష్టంగా సూచించారు. -
‘బొగ్గు’కథ ఇక కంచికే!
న్యూఢిల్లీ: బిర్లా గ్రూపు సంస్థల అధినేత కుమారమంగళం బిర్లాపై నమోదైన ‘బొగ్గు’కేసు త్వరలోనే కంచికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిర్లాపై కేసును సీబీఐ మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి ఒడిశాలోని తలబిరా-2 గని కేటాయింపు సక్రమమేనని, అన్నీ పరిశీలించిన తర్వాతే ప్రధాని ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. స్వయంగా ప్రధాని అన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారంటూ పీఎంవో కరాఖండిగా ప్రకటించడంతో ఈ కేసు విషయంలో ఇరకాటంలో పడ్డామని సీబీఐ అధికారులే అంగీకరిస్తున్నారు. కాగా, హిందాల్కోకు బొగ్గు గని కేటాయిస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ ఆహ్లూవాలియా, దర్యాప్తు విషయంలో ‘మర్యాదకర రీతి’లో వ్యవహరించాలంటూ సీబీఐకి హితవు పలికారు. కుమారమంగళం బిర్లాపై, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు దాఖలు చేయడంతో ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి అటు ప్రభుత్వాధికారుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలను బలిపశువులను చేయరాదంటూ పారిశ్రామిక సంఘా లు గగ్గోలు పెట్టాయి. మరోవైపు, బిర్లాపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినందున ఇప్పటికిప్పుడే కేసును అర్ధంతరంగా మూసివేయలేమని, కేసుతో సంబంధం ఉన్న అందరితోనూ మాట్లాడతామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే, కేసును మూసివేసే అవకాశాలను పరిశీలించేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏ కేసులోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు కేవలం ప్రాథమిక చర్య మాత్రమేనని, దర్యాప్తు మొదలైన కేసులను మూసివేసిన ఉదంతాలూ లేకపోలేదని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న దశలో కేసును మూసివేసేందుకు సాంకేతికంగా అవకాశాలు లేకపోలేదు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత కేసును మూసివేయాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. కుమారమంగళం బిర్లా రెండు రోజుల కిందట ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. హిందాల్కోకు బొగ్గు బ్లాకు కేటాయింపును సమర్థించుకుంటూ పీఎంవో ప్రకటన, ఆ తర్వాత చిదంబరంతో బిర్లా భేటీ దరిమిలా కేసు మూసివేత దిశగా పరిణామాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం. అయితే, ‘మా దర్యాప్తు ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలకు, హిందాల్కోకు నడుమ కుదిరిన ఒప్పందం, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంపెనీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది. బిర్లా, హిందాల్కో, పరేఖ్‌లకు వ్యతిరేకంగా ఏమీ లేనట్లు ఒకవేళ తేలితే కేసు మూసేసేందుకు అవకాశాలు ఉంటాయి’ అని సీబీఐ అధికారి ఒకరు వివరించారు. కాగా, బిర్లా, పరేఖ్‌లపై సీబీఐ కేసు విషయమై తన వైఖరిని వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేలా ప్రధానిని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.