
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నివాసంలో గురువారం ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సిబ్బంది కుమార్తెలు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మోదీకి రాఖీ కట్టిన వారిలో స్వీపర్స్, ప్యూన్స్, తోటమాలి, డ్రైవర్ సహా ప్రధాని కార్యాలయంలో పని చేసే వారి పిల్లలు ఉన్నారు. మోదీకి రాఖీ కడుతున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు పీఎంఓ అధికారులు.
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద‍్ర మోదీ. ‘ఈ ప్రత్యేక పండుగ రక్షా బంధన్ రోజున ప్రతిఒక్కరికి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు మోదీ. అధికారిక నివాసంలో తనకు రాఖీ కట్టిన చిన్నారులను ఆశీర్వదించారు. వారితో కాసేపు ముచ్చటించారు.
A very special Raksha Bandhan with these youngsters... pic.twitter.com/mcEbq9lmpx
— Narendra Modi (@narendramodi) August 11, 2022
ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment