
న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బంది సేవలకు చరిత్రలో చోటు కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. వారంతా ఒక చారిత్రక, పవిత్రకార్యంలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. వారి సేవలు కలకాలం గుర్తుండిపోయేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజిటల్ ఆర్కైవ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ భవన నిర్మాణ పనుల పురోగతిని సోమవారం ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది డిజిటల్ ఆర్కైవ్‌లో ఒక్కొక్కరి పేరు, ఊరు, ఫొటో, నిర్మాణ పనుల్లో వారి సహకారం వంటి వ్యక్తిగత వివరాలను పొందుపరచాలన్నారు.
చదవండి: బాధితులను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి: మెదడుపై ఎఫెక్ట్!
నిర్మాణంలో వారి పాత్ర, భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వాలన్నారు. వారందరికీ కోవిడ్ టీకా తప్పనిసరిగా వేయాలనీ, నెలకోసారి హెల్త్ చెకప్ చేపట్టాలని అధికారులను మోదీ కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ప్రధాని పార్లమెంట్ భవన నిర్మాణపనులను సుమారు గంటపాటు స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే.
చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’
Comments
Please login to add a commentAdd a comment