ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ఖండించారు. తక్కువ సమయంలోనే ఇంత మంచి పార్లమెంట్‌ను దేశానికి నిర్మించినందుకు బీజేపీ ప్రభుత్వాన్ని కొనియాడాల్సిన తరుణమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరవ్వాల్సి ఉండే.. కాని ఇతర ఫంక్షన్ కారణంగా రాలేకపోయానని ఆజాద్ తెలిపారు. ప్రతిపక్ష ఈ చర్యకు తాను పూర్తి వ్యతిరేకినని అన‍్నారు.
ఆ కల నెరవేరింది
'నూతన పార్లమెంట్ భవన నిర్మాణం.. 30-35 ఏళ్ల క్రితం నేను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పటి కల. దివంగత పీఎం నరసింహారావు, శివరాజ్ పాటిల్, నేను ఈ ప్రాజెక్టు గురించి చర్చించాము. కానీ అప్పట‍్లో ఇది చేయలేకపోయాము. ఈనాటికి పూర్తయింది. విమర్శించుకోవాల్సిన సమయం కాదు ఇది'అని ఆజాద్ అన్నారు.
పార్లమెంట్ ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరిగిందనేది అనవసరమైన విషయమని ఆజాద్ అన్నారు. రాష్ట్రపతి ముర్ముకు మద్దతుగా నిలిచేవారైతే.. ఎన్నికల్లో ఎందుకు ముర్ముపై మరో అభ్యర్థిని నిల్చోబెట్టారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించ్రారు.
ఇది చదవండి: పార్లమెంటు భవన ప్రారంభోత్సవ బహిష్కరణ నిర్ణయం...
Comments
Please login to add a commentAdd a comment