oppsition
-
'సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలది తప్పుడు చర్య.'
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ఖండించారు. తక్కువ సమయంలోనే ఇంత మంచి పార్లమెంట్‌ను దేశానికి నిర్మించినందుకు బీజేపీ ప్రభుత్వాన్ని కొనియాడాల్సిన తరుణమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరవ్వాల్సి ఉండే.. కాని ఇతర ఫంక్షన్ కారణంగా రాలేకపోయానని ఆజాద్ తెలిపారు. ప్రతిపక్ష ఈ చర్యకు తాను పూర్తి వ్యతిరేకినని అన్నారు. ఆ కల నెరవేరింది 'నూతన పార్లమెంట్ భవన నిర్మాణం.. 30-35 ఏళ్ల క్రితం నేను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పటి కల. దివంగత పీఎం నరసింహారావు, శివరాజ్ పాటిల్, నేను ఈ ప్రాజెక్టు గురించి చర్చించాము. కానీ అప్పట్లో ఇది చేయలేకపోయాము. ఈనాటికి పూర్తయింది. విమర్శించుకోవాల్సిన సమయం కాదు ఇది'అని ఆజాద్ అన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరిగిందనేది అనవసరమైన విషయమని ఆజాద్ అన్నారు. రాష్ట్రపతి ముర్ముకు మద్దతుగా నిలిచేవారైతే.. ఎన్నికల్లో ఎందుకు ముర్ముపై మరో అభ్యర్థిని నిల్చోబెట్టారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించ్రారు. ఇది చదవండి: పార్లమెంటు భవన ప్రారంభోత్సవ బహిష్కరణ నిర్ణయం... -
ప్రతిపక్షాలకు బుద్ధి రావాలి: ఆర్కే రోజా
-
దమ్ముంటే రండి.. ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే సవాల్
-
అవినీతి.. అస్థిరత.. వ్యతిరేకభావం
ముంబై/ మర్గోవా: కోల్‌కతా వేదికగా సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలది అవినీతి, వ్యతిరేకభావం, అస్థిరతలతో కూడిన మహాకూటమి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. పేద వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము తీసుకున్న వచ్చిన చట్టంతో ప్రతిపక్షాలకు నిద్ర కరువైందన్నారు. గతంలో బలహీనంగా ఉన్న భారత్ బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని చెప్పారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్, హట్కనంగ్లే, మాధా, సతారా, దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహాకూటమి నేతలది ధనబలం కాగా తమది ప్రజాబలం అన్నారు. తమ కూటమి 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆశలు, కలలతో ముడిపడి ఉందన్నారు. ‘కోల్‌కతా సభా వేదికపై ఉన్న వారంతా బడా నేతల కుమారుడు/కుమార్తె లేదా తమ కుమారుడు/కుమార్తెను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడే వారే. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యంపై బహిరంగంగా ఉపన్యాసాలిస్తున్నారు’ అని దెప్పి పొడిచారు. ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడటమే వారి లక్ష్యమన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్షాలు ఈవీఎంలను సాకుగా చూపాలనుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, కుంభకోణాలు, అవినీతి, అపనమ్మకం, అస్థిరతల కలయికే మహాకూటమి’ అని ఎద్దేవా చేశారు. బలహీనం నుంచి అభివృద్ధివైపు పయనం గత ప్రభుత్వాల పాలనతో బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనను పోలుస్తూ ప్రధాని.. ‘బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. విద్యుత్ కొరత, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కుంభకోణాల గురించిన వార్తలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినబడేది. ఇప్పుడు కుంభకోణాల(స్కాంల) ప్రస్తావనే లేదు. కేవలం కొత్త పథకాల(స్కీంల) గురించే చర్చ జరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్మకం, విశ్వాసంతో చూస్తోంది. అప్పట్లో దేశంలోని 98 శాతం మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లతో విపక్షాలకు నిద్ర కరువు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రతిపక్ష నేతలకు నిద్ర కరువైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయానికి తగు కారణం లేనట్లయితే, వాళ్లకు అశాంతి కరువయ్యేది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు, పుకార్లను వ్యాప్తి చేసేందుకు రంగంలోకి దిగేవాళ్లు. వాళ్లు అలా చేయడం లేదంటే దానర్ధం.. దేశ ప్రజల కోసం ప్రభుత్వం మంచి పని చేసిందనే కదా’ అని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా సీట్ల కొరత తలెత్తకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పది శాతం పెంచుతున్నట్లు వివరించారు. ‘ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్టం చేసిందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ఎప్పుడు ప్రకటించినా వాళ్లు ఇలాంటి ఆరోపణలే చేసే వారని వ్యాఖ్యానించారు. -
ఉత్తమ్ అమరావతి స్క్రిప్టు చదివారు
సాక్షి, హైదరాబాద్: కేవలం నాలుగు సీట్లు గెలవడం కోసం ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు. టీడీపీకి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు తో కలిసి కర్నె గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. నదీ జలాల పంపకంపై ఉత్తమ్ కు కనీస అవగాహన లేదని తేలిపోయింది. సైన్యం లో కెప్టెన్‌గా పనిచేశానని చెప్పుకునే ఉత్తమ్‌కు కనీస పరిజ్ఞానం లేదు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఉన్నతస్థాయి కమిటీ ఉంది. ఆ కమిటీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు. ఉత్తమ్ రాష్ట్ర ప్రయోజనాలను తాక ట్టు పెట్టి చంద్రబాబుకు వత్తాసు పలికాడు. అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని బాబుకు తాకట్టు పెట్టే కుతంత్రాల కూటమే మహాకూటమి. తెలంగాణ ప్రజలు మహాకూటమికి సరైన సమాధానం చెబుతారు. ప్రజలకు మహాకూటమి ప్రాతిపదిక లు చెప్పాలి. హరీశ్‌రావు 12 ప్రశ్నలు ఏమున్నాయో చదవకుం డానే అమరావతి ఆదేశాలతో ఉత్తమ్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఎంత వ్యతిరేకించినా దామరచర్ల ప్లాంట్ కట్టి తీరుతాం’అని అన్నారు. పోలింగ్ కేంద్రాలు పెట్టాలి: టీఆర్ఎస్ ఇటీవల గ్రామపంచాయతీలుగా మారిన తండాలు, గిరిజన గూడేల్లో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ కోరింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములునాయక్ ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. -
'ప్రతిపక్షాల పోరాటం వల్లే సర్కారు దిగొచ్చింది'
హైదరాబాద్: ప్రతిపక్షాల పోరాటం వల్లే రైతు ఆత్మహత్యలపై సర్కారు దిగొచ్చిందని తెంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రామ్మోహన్ రెడ్డిలు అన్నారు. రైతు ఆత్మహత్యల పరిహారాన్ని జూన్ నుంచి ఇవ్వాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గిందని తెలిపారు. రుణమాఫీ మొత్తం ఒకే దఫాలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలను గ్రామసభల ద్వారా నిర్ధారించాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ 1400 మంది రైతుల సంఖ్యను కుదించరాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.