కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ అజాద్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు జల్లు కురింపించారు. తన పట్ల మోదీ చాలా ఉదారంగా ప్రవర్తించారని తనపై ఎలాంటి రివేంజ్ తీర్చుకోలేదని అన్నారు. అలా అని ఒక ప్రతిపక్ష నేతగా ఆర్టికల్ 370తో సహ హిజాబ్ వంటి పలు విషయాల్లో ఆయన్ను వ్యతిరేకించడమే కాకుండా నిలదీయకుండా విడిచిపెట్ట లేదన్నారు అజాద్.
తాను మోదీతో కొన్ని బిల్లులు విషయంలో విభేదించనినప్పటికీ ఆయన తనపై ఏవిధంగానూ రివేంజ్ తీర్చుకునే యత్నం చేయలేదు పైగా ఒక రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించారు. అందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పారు అజాద్. అదే సమయంలో మోదీపై విమర్శలు చేస్తున్న వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వారి మనసులు కలుషితమైపోయాయని, అందుకే ఆయనపై అలాంటి విమర్శలకు దిగుతున్నారని అన్నారు
ఆయనపై ఆరోపణలు చేసేకంటే ముందుగా వారంతా పాలిటిక్స్ అంటే ఏంటో ఓనమాలు నుంచి నేర్చుకోవాలంటూ అజాద్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 2021లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అజాద్ పదవీకాలం ముగియడంతో వీడ్కోలు సందర్భంగా ప్రదాని మోదీ అజాద్‌పై ప్రశంసలు కురింపించారు. ఆయనతో తనకు గలు రాజకీయ అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన రాజకీయపరంగానే కాకుండా దేశం గురించి కూడా ఆలోచిస్తాడని అందువల్ల అలాంటి వ్యక్తికి వీడ్కోలు పలకాలంటే బాధగానే ఉంటుందంటూ.. మోదీ భావోద్వేగం మాట్లాడారు.
(చదవండి: 'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ)
Comments
Please login to add a commentAdd a comment