old vehicles
-
మొక్కుబడిగా స్క్రాప్ పాలసీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ సారూ!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ కొత్తగా రూపొందించిన వాహనాల స్క్రాప్ పాలసీ గందరగోళంగా ఉంది. వాహనాల తుక్కు ప్రక్రియలో స్పష్టత కొరవడింది. ఆర్టీఏ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 18 లక్షల వరకు కాలపరిమితి ముగిసిన వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వాటి యజమానులు రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకొని వినియోగిస్తున్నారు. మరికొన్ని వాహనాలు వినియోగానికి పనికి రాకుండా మూలనపడ్డాయి. ఆర్టీఏ ప్రమేయం లేకుండానే తుక్కు కింద మారాయి. మరోవైపు లక్షలాది వాహనాలు గల్లంతయ్యాయి. చోరీకి గురైన వాహనాల జాడ లేదు. ఇలా వివిధ రకాలుగా వినియోగంలో లేని వాహనాలపైన తాజా స్క్రాప్ పాలసీలో ఎలాంటి స్పష్టత లేదని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలసీ వల్ల కనిపించని ప్రయోజనం రవాణాశాఖ లెక్కల్లో మాత్రమే కనిపించే ఈ వినియోగంలో లేని వాహనాలపైన వాహనదారులు పెద్దమొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొత్త బండి కొనుగోలు చేసే సమయంలో రెండో వాహనంగా పరిగణించి 2 శాతం పన్నును అదనంగా విధిస్తున్నారు. దీంతో కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసే వారు రూ.వేలల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు రెండో బండి కింద ద్విచక్ర వాహనాల కొనుగోలుపై కూడా భారం మోపుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగంలో లేని వాహనాలను తుక్కుగా పరిగణించకుండానే రూపొందించిన కొత్త పాలసీ వల్ల వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పాత వాహనాలపై ఫిర్యాదుల వెల్లువ.. మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కాలపరిమితి ముగిసినవిగా పరిగణిస్తారు. తాజా నిబంధనల మేరకు వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది. ఇక వ్యక్తగత వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. వద్దనుకుంటే స్వచ్ఛందంగా తుక్కు చేసి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. పాతబండి స్క్రాబ్ చేయడం వల్ల 2 శాతం అదనపు పన్ను నుంచి ఊరట లభిస్తుంది. అలాగే కొత్త వాహనం జీవితకాల పన్నులోనూ రాయితీ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వినియోగంలో లేని వాహనాల సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలపరిమితి ముగిసి వినియోగానికి పనికి రాకుండా ఉన్నవి ఆటోమేటిక్‌గానే తుక్కుగా మారాయి. పెద్ద సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అలాంటి వాటిపైన పోలీస్స్టేషన్లలో, ఆర్టీఏ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ఫిర్యాదులు పరిష్కారానికి నోచడం లేదు.ఊరించి ఉస్సూరుమనిపించారు.. కాలపరిమితి ముగిసిన వాటిలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, లారీలు, డీసీఎంలు, లారీలు, టాటాఏస్‌లు వంటి వివిధ కేటగిరీలకు చెందిన రవాణా వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. రవాణా వాహనాలకు 15 ఏళ్లు కాలపరిమితి కాగా, వ్యక్తిగత వాహనాలకు నిర్దిష్టమైన పరిమితి లేదు. 15 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించుకోవచ్చు. దీంతో ఈ కేటరికీ చెందినవి ఎక్కువ. అదే సమయంలో వినియోగంలో లేనివి కూడా వ్యక్తిగత వాహనాల కేటగిరీలోనే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి వాటిపైన ఈ పాలసీ ఊరించి ఉస్సూరుమనిపించింది.చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం అపహరణకు గురైనప్పటికీ.. పోగొట్టుకున్న వాహనాలు లభించకపోవడంతో కొత్తవి కొనుగోలు చేసే సమయంలో 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అపహరణకు గురైనప్పటికీ ఆ వాహనం సదరు యజమాని పేరిట నమోదై ఉందనే సాకుతో రవాణా అధికారులు అదనపు భారం మోపుతున్నారు. వినియోగంలో లేకపోయినా పన్ను చెల్లించాల్సి రావడం అన్యాయమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా రూపొందించిన స్క్రాప్ పాలసీలో తమకు ఊరట లభించవచ్చని చాలామంది భావించారు. కానీ వాటిపైన ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. వాహనదారులు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయవచ్చని మాత్రం వెల్లడించారు. -
తెలంగాణలో నవంబర్ నుంచే ‘వాహనాల స్క్రాపింగ్’
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ నవంబరు మొదటివారంలో ప్రారంభం కానుంది. వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహన తుక్కు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకోసం ప్రైవేటు కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కుగా (స్వచ్ఛంద విధానం) మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ఈ విధానం కింద తెలంగాణకు మూడు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. ప్రస్తుతానికి నాలుగు ప్రైవేట్ సంస్థలు దరఖాస్తు చేశాయి. ఆయా కేంద్రాలు కేంద్ర నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు ఇటీవల అధికారులు వాటిని తనిఖీ చేశారు. మరో పది రోజుల్లో వాటిల్లో అనుకూలమైన కేంద్రాలకు పచ్చజెండా ఊపనున్నారు. ఆ వెంటనే వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. కేవలం ఐదుగురు వాహనదారులే ముందుకు..కేంద్ర ప్రభుత్వం 2021లో చట్ట సవరణ చేయగా, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో స్క్రాపింగ్ విధానం అమలవుతోంది. తుక్కు విధానం ప్రకటించిన ఈ వారం రోజుల్లో తెలంగాణలో కేవలం ఐదుగురు వాహనదారులు మాత్రమే తమ 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఆసక్తి చూపారు.చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికంనిర్బంధం కాకపోవటంతో.. పదిహేనేళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్ చేయించి గ్రీన్ ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకొనే విధానం అమలవుతోంది. గ్రీన్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో చాలా రాష్ట్రాలు స్క్రాపింగ్ విధానంలో దాన్ని కొనసాగిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్నే అనుసరించాలని నిర్ణయించి పాలసీలో పొందుపరిచింది. దీంతో కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చటం కంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి ఐదేళ్లు చొప్పున రెండు దఫాలు అనుమతి పొంది నడుపుకొనేందుకే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ విధానం తెచ్చిన తర్వాత (ఢిల్లీ మినహా) దేశవ్యాప్తంగా కేవలం 44,900 వాహనాలను మాత్రమే తుక్కుగా మార్చారు.అధికారులు అడిగినా స్పందించని ఓ సెంటర్ఓ బడా వాహన తయారీ సంస్థకు నగర శివారులో స్క్రాపింగ్ సెంటర్ ఉంది. వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసింది. కానీ ఆ తర్వాత స్పందించటం మానేసింది. దీంతో దరఖాస్తు చేసిన మరో మూడు కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడి వసతులను తనిఖీ చేసి వచ్చారు. -
15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం
vehicle scrapping policy 2024: పదిహేను ఏళ్లు దాటిన వాహనాల విషయంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ రవాణాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 15 ఏళ్లు గడువు తీరిన వాహనాలు దాదాపు 21 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. స్క్రాపింగ్ తప్పనిసరి కాదనడంతో కొందరు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆరీ్వఎస్ఎఫ్) పేరిట స్క్రాపింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా సదుపాయాలు కల్పించనున్నారు. ద్విచక్రవాహనాలే అధికం మొత్తంగా 21.27 లక్షల వాహనాల కాలం తీరిపోయింది. అయితే వీటిని ఇప్పటికిప్పుడు స్క్రాప్‌నకు పంపాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వీటిలో ఫిట్నెస్ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు రూ.5 వేలు చెల్లించి ఐదేళ్లు, ఆ తర్వాత కూడా ఫిట్‌గా ఉంటే.. రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 21,27,912 వాహనాలు 15 ఏళ్లు వయసు పైబడ్డాయి. ఇందులో 9 లక్షల వాహనాలు హైదరాబాద్‌లో ఉండగా.. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో అధికశాతం ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం.మళ్లీ అందులోనూ 1.3 లక్షల బైకులు హైదరాబాద్‌కు చెందినవి కాగా, 1.8 లక్షల ద్విచక్రవాహనాలు రంగారెడ్డిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల తర్వాత 15 ఏళ్లు పైబడిన వాహనాలు వరుసగా మేడ్చల్ (1.5 లక్షలు), కరీంనగర్ (1.5 లక్షలు) నిజామాబాద్ (1.2 లక్షలు) జిల్లాల్లో ఉన్నాయి. ఈ లెక్కన గ్రీన్ ట్యాక్స్ అత్యధికంగా గ్రేటర్ పరిధిలోనే వసూలు కానుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. -
స్క్రాప్ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని, గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్ స్క్రాపింగ్ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. ఏ వాహనాలకు ఏ విధానం? ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్‌కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్‌లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. – ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. – ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్‌గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. – ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎ‹స్ఎఫ్)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల ‘ఫిట్నెస్’ పక్కాగా తేల్చేందుకు... 15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్నెస్ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గానే టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్ స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఫిట్నెస్ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‌లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. భద్రతపై దృష్టి సారించాం దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్‌ట్యాక్స్ మాఫీ..15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్‌ట్యాక్స్ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. -
పాత వాహనాలను ఈ వీలుగా మార్చేందుకు ప్రోత్సాహకాలు
-
పాత వాహనాలను ఈవీలుగా మార్చేందుకు ప్రోత్సాహకాలు?
ముంబై: పాత వాహనాలను తుక్కు కింద వేసే బదులు వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా రెట్రోఫిట్ చేసే ప్రయత్నాలకు తోడ్పాటునివ్వడం లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని కేంద్రం పరిశీలించే అవకాశముందని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రైమస్ పార్ట్నర్స్, ఈటీబీ (యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్) ఒక నివేదికలో పేర్కొన్నాయి. సాంప్రదాయ ఇంజిన్ల ఆధారిత వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడంలో పలు సవాళ్లు ఎదురు కావచ్చని తెలిపాయి. కానీ ప్రభుత్వ, పరిశ్రమ, ప్రజల సమన్వయంతో వీటిని సమర్ధంగా అధిగమించడానికి వీలుంటుందని వివరించాయి. కాలుష్యకారకంగా మారే 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన ప్యాసింజర్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రీ–రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ‘పాత వాహనాలను తుక్కు కింద మార్చే బదులు విద్యుత్‌తో నడిచేలా వాటిని రెట్రోఫిట్ చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చు. తద్వారా ప్రస్తుత వాహనాల జీవితకాలం కూడా పెరుగుతుంది‘ అని ప్రైమస్ పార్ట్నర్స్, ఈటీబీ సంయుక్త నివేదికలో తెలిపాయి. -
15 ఏళ్లు దాటిన వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద అమ్మేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో 15 ఏళ్లు దాటిన వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. బుధవారం డీటీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సామర్ధ్య పరీక్షల్లో విఫలం అయితే తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందన్నారు. -
Vehicle scrapping policy: డొక్కు బండ్లు తుక్కుకే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్‌లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం.. పాత వాహనాలు అంటే? ► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్‌ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్‌ను స్క్రాప్‌గా మార్చాలి. ► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్‌సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్‌నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్వీ)గా పరిగణిస్తారు. ► ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి. ► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనదారులకు ప్రోత్సాహకాలు ► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది. ► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు. స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు! పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏమిటి? పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్‌తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్జీ, బయో–ఎల్ఎన్జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు ► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే. ► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి. ► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం!
ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిందే. ఈ నేపథ్యంలో ఆ వాహనాల్ని రద్దు చేస్తూ..స్క్రాప్‌గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023,ఏప్రిల్ 1 నుంచి దేశంలో 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేయనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖల బస్సులు, ఇతర వాహనాలకు ఈ కొత్త నియమం తప్పనిసరి. రాబోయే ౩౦ రోజుల్లో దీనికి సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది. అధికారిక వెబ్సైట్ comments-morth@gov.in కు పంపించాలని కోరింది. స్క్రాప్‌గా మార్చేస్తాం 15 ఏళ్లు పైబడిన భారత ప్రభుత్వ వాహనాలన్నింటినీ స్క్రాప్ (చెత్త) గా మారుస్తామని, దీనికి సంబంధించిన విధి, విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు అగ్రికల్చర్ కార్యక్రమం 'ఆగ్రో విజన్' ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓల్డ్ గవర్నమెంట్ వెహికల్స్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారిక ఫైల్లో సంతకం చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలకు పంపాను. ఆయా ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అమలు చేయాలని కోరారు. వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ 2021లో వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ పాలసీ ద్వారా పరిశ్రమకు మూడు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. అందులో పాత వాహనాల నుండి వెలువడే ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించడానికి సహాయపడుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభసాటిగా మారుతుంది. ఎందుకంటే పాత వాహనాలను కొత్త వాహనాలతో భర్తీ చేసేలా డిమాండ్‌ను పెంచుతుంది. ఉక్కు పరిశ్రమ కోసం చౌకైన ముడి పదార్థాలు స్క్రాప్ మెటీరియల్ నుండి లభిస్తాయి. ఈ చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించేందుకు దోహద పడతాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
పాత వాణిజ్య వాహన వ్యాపారంలోకి అశోక్ లేలాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ పాత వాణిజ్య వాహనాల విక్రయంలోకి ప్రవేశించింది. ఈ మేరకు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్‌తో చేతులు కలిపింది. అశోక్ లేలాండ్ తయారీ పాత వాహనం ఇచ్చి కొత్తది కొనుగోలు, పాత వాహన విక్రయానికి మహీంద్రాకు చెందిన 700లకుపైగా పార్కింగ్ కేంద్రాలు వేదికగా మారనున్నాయి. పాత వాహనాల మార్కెట్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అశోక్ లేలాండ్ తెలిపింది. -
వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్!
మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన ఏదైనా ఒక పాత వాహనం ఉందా?.. అయితే, మీకో షాకింగ్ న్యూస్. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్సీ రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇకపై, 15 ఏళ్లు పైబడిన కారు ఆర్సీ రెన్యువల్‌కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక, ఆర్సీ రెన్యువల్ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్లో ఆలస్యం చేస్తే, నెలకు 300 నుంచి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది. ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ.50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ.1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ కోసం రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న కార్ల ఆర్సీ రెన్యువల్ ఫీజు రూ.15,000 నుంచి రూ.40,000కి పెరిగింది. భారతదేశం అంతటా ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. అయితే, ఈ రూల్ ఢిల్లీలో వర్తించదు. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు & 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. ఒకవేళ వారు తమ వాహనాలను దేశ రాజధాని ఢిల్లీలో నడపాలనుకుంటే తమ పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది. కొత్త ఫీజులు ఇలా.. వ్యక్తిగత వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజు వెహికల్ టైప్ రిజిస్ట్రేషన్ ఫీజు రెన్యువల్ ఫీజు మోటార్ సైకిల్: 300 1,000 థ్రీవీలర్ : 600 2,500 కారు/జీపు : 600 5,000 ఇంపోర్టెడ్ వెహికల్: 5,000 40,000 కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజు వెహికల్ టైప్ ఫిట్నెస్ ఫీజు రెన్యువల్ ఫీజు మోటార్ సైకిల్: 500 1,000 థ్రీవీలర్ : 1,000 3,500 ట్యాక్సీ/క్యాబ్ : 1,000 7,000 మీడియం గూడ్స్ /ప్యాసింజర్: 1,300 10,000 హెవీ గూడ్స్/ప్యాసింజర్: 1,500 12,500 (చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ!) -
ఆనంద్ మహీంద్రా కోరిక నెరవేరింది
దేశం గర్వించదగ్గ వ్యాపారదిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడమే కాదు.. అవసరమైతే సాయానికి సైతం వెనకాడని నైజం వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాది. అలాంటిది మాట ఇచ్చాక ఊరుకుంటాడా? ఆ మధ్య మహారాష్ట్రకు చెందిన ఓ సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారుచేశాడు దత్తాత్రేయ లొహార్ అనే అతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. ఆ వాహనం ఇస్తే.. బదులుగా కొత్త బొలెరో వాహనం ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు మొత్తానికి ఆ పని చేసి చూపించారాయన. ‘‘కొత్త బొలెరో తీసుకుని తన వాహనాన్ని మార్చుకునే ప్రతిపాదనను అతను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. నిన్న అతని కుటుంబం బొలెరోను అందుకుంది. మేము అతని సృష్టికి సగర్వంగా బాధ్యత వహిస్తాం. ఇది మా రీసెర్చ్ వ్యాలీలో మా అన్ని రకాల కార్ల కలెక్షన్లో భాగంగా ఉండనుంది ఇక. స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. Delighted that he accepted the offer to exchange his vehicle for a new Bolero. Yesterday his family received the Bolero & we proudly took charge of his creation. It will be part of our collection of cars of all types at our Research Valley & should inspire us to be resourceful. https://t.co/AswU4za6HT pic.twitter.com/xGtfDtl1K0 — anand mahindra (@anandmahindra) January 25, 2022 సంబంధిత వార్త: బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే.. దత్తాత్రేయ లొహార్ స్వస్థలం మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! షోరూంలో దత్తాత్రేయ కుటుంబంతో సహా వాహనం అందుకున్న ఫొటోల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt — anand mahindra (@anandmahindra) December 21, 2021 -
ఈ 3 రాష్ట్రాల్లో పాత వాహనాలు ఎక్కువ
సాక్షి, బెంగళూరు: దేశంలోనే కర్ణాటకలో అత్యధిక పాత వాహనాలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఉత్తర కర్ణాటక, ఢిల్లీలో ఎక్కువగా పాత వాహనాలు ఉన్నట్లు ఇటీవల లోకసభలో కేంద్రం బదులిచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే పార్లమెంటులో ఈ మేరకు పాత వాహనాల సంఖ్యపై బదులిచ్చారు. అత్యధికంగా కర్ణాటక, ఢిల్లీల్లో పాత వాహనాలు ఉన్నట్లు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో 20 ఏళ్లకు పైబడిన వాహనాల సంఖ్య 39.38 లక్షలుగా ఉంది. ఢిల్లీలో 36.14 లక్షల పాత వాహనాలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇక 20.67 లక్షల పాత వాహనాలతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 20 ఏళ్లు దాటిన వాహనాలు మొత్తం 2.15 కోట్లు ఉన్నాయి. -
కాలం చెల్లితే.. 'తుక్కే'
సాక్షి, అమరావతి: కాలుష్యాన్ని నివారించి అనుకూలమైన పర్యావరణాన్ని నెలకొల్పే చర్యల్లో భాగంగా 15 సంవత్సరాలకు పైగా వినియోగించిన రవాణా (ట్రాన్స్పోర్ట్) వాహనాలను ఫిట్నెస్ ఆధారంగా తుక్కు చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 20 ఏళ్లు పైబడి వినియోగించిన రవాణేతర (నాన్–ట్రాన్స్పోర్ట్) పాత వాహనాల ఫిట్నెస్ ఆధారంగా తుక్కు చేయించేలా వాటి యజమానులను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం తొలి దశలో పాత వాహనాల ‘వలంటీరీ స్క్రాపింగ్’ (స్వచ్ఛందంగా తుక్కు చేసే) విధానాన్ని ప్రకటించింది. పాత వాహనాలను తుక్కు చేసి.. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి వాహన పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇందుకోసం రవాణా, రవాణేతర రంగాల వాహనాలకు వేర్వేరుగా రాయితీలను ప్రకటించింది. ఇందుకోసం రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ ఫెసిలిటీలను (తుక్కు చేసే సదుపాయ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఫెసిలిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తాయా అనే అంశంతో పాటు పాత వాహనాలను తుక్కు చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే రాయితీలపై కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం రాష్ట్రాల్లోని రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. స్క్రాపింగ్ ఫెసిలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని రాయితీపై కేటాయించే అంశంపైనా కేంద్రం చర్చించింది. పాత వాహనాలను తుక్కు చేయాలంటే ఆ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే సంబంధిత వాహనాల పన్ను బకాయిలు గానీ, గ్రీన్ ట్యక్స్గానీ, చలానా బకాయిలు గానీ ఉండకూడదు. పాత వాహనాలను తుక్కు చేసేందుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు వీలుగా ఆ బకాయిలను ఏడాది పాటు రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. రాయితీల ప్రతిపాదన ఇలా.. ► పాత వాహనాన్ని తుక్కు చేసినందుకు దాని విలువలో 5 శాతం నగదును వాహనదారుడికి చెల్లించాలని కేంద్రం సూచించింది. ► వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఆ వాహనాల ధరలో 5 శాతం రాయితీ ఇచ్చేలా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ► రాష్ట్రంలో మొత్తం 1,41,50,277 వాహనాలుండగా.. 15 ఏళ్ల వినియోగం దాటిన వాహనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి 27,47,943 ఉంటాయని రాష్ట్ర రవాణా శాఖ లెక్క తేల్చింది. ► పాత వాహనాలను తుక్కు చేసిన సర్టిఫికెట్ చూపి కొత్తగా కొనుగోలు చేసే రవాణేతర (నాన్–ట్రాన్స్‌పోర్టు) వాహనాలకు 15 ఏళ్ల పన్నుపై 25 శాతం, రవాణా (ట్రాన్స్‌పోర్టు) వాహనాలకైతే 8 ఏళ్ల పన్నులో 15 శాతం రాయితీ ఇవ్వాలని సూచించింది. -
రహదార్లపై 4 కోట్లకు పైగా పాత వాహనాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పాత వాహనాలు (15 ఏళ్లు పైబడినవి) రహదారులపై తిరుగుతున్నాయి. వీటిలో రెండు కోట్ల పైగా వాహనాలు 20 ఏళ్ల పైబడినవి ఉన్నాయి. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల్లో వాహనాల గణాంకాలను డిజిటైజ్ చేసిన నేపథ్యంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్ గణాంకాలను ఇందులో పొందుపర్చలేదు. కర్ణాటకలో ఇలాంటివి అత్యధికంగా 70 లక్షలు పైచిలుకు ఉన్నాయి. 56.54 లక్షల పాత వాహనాలతో ఉత్తర్‌ప్రదేశ్ రెండో స్థానంలో, 49.93 లక్షల వాహనాలతో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలోనూ ఉన్నాయి. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో కాలుష్యకారక పాత వాహనాలపై పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే హరిత పన్నుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. దీని ద్వారా వచ్చే నిధులను కాలుష్య నియంత్రణకు వినియోగించనుంది. హైబ్రీడ్, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ, ఈథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచేవి, వ్యవసాయ రంగంలో ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మొదలైన వాటికి హరిత పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. -
స్క్రాపేజ్ పాలసీతో కొత్త వాహనాలకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు వాహన స్క్రాపేజ్ పాలసీ కలిసొస్తుందని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛంధ వాహన స్క్రాపింగ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వెహికిల్స్‌కు 15 ఏళ్ల ఫిట్నెస్ టెస్ట్‌లను నిర్వహిస్తారు. భారీ వాణిజ్య వాహనాలకు 2023 ఏప్రిల్ నుంచి, ఇతర వాహనాలకు 2024 జూన్ నుంచి పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అనర్హమైన వాహనాలు తొలగిపోతాయని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరగడంతో పాటు వాహన పరిశ్రమ స్థిరపడుతుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. దీంతో పాటు కాలుష్యం, చమురు ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం, మెటల్ రీసైక్లింగ్, ముడి పదార్థాల వ్యయాలను తగ్గించడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే స్క్రాపింగ్ పాలసీ విజయవంతం కావాలంటే మౌలిక వసతుల ఏర్పాటు, స్క్రాప్ విలువల మదింపుపై మరింత స్పష్టత, స్క్రాప్ సర్టిఫికెట్ సామర్థ్యం వంటివి కీలకమని అభిప్రాయపడ్డారు. 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి 15 ఏళ్ల కంటే పాత వాహనాలు 1.1 మిలియన్ యూనిట్లు ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. అయితే ఆయా వాహనాల వినియోగం, స్వభావాలను బట్టి వాస్తవిక స్క్రాపేజీ సంభావ్యత కొంత మేర తగ్గొచ్చని తెలిపింది. -
ఇక ‘తుక్కు’ రేగుతుంది..!
న్యూఢిల్లీ: కాలుష్యకారక పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ఇచ్చి, స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకుంటే కొత్త కారుకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేయాలని భావిస్తోంది. అలాగే, వ్యక్తిగత వాహనాలకు 25 శాతం దాకా, వాణిజ్య వాహనాలకు 15 శాతం దాకా రోడ్ ట్యాక్స్‌లో రిబేటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనుంది. ఇక స్క్రాపింగ్ సర్టిఫికెట్ గల వాహనదారులకు కొత్త వాహనాలపై అయిదు శాతం మేర డిస్కౌంటు ఇచ్చేలా వాహనాల తయారీ సంస్థలకు కూడా సూచించనుంది. వాహనాల స్క్రాపేజీ విధానంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విధానంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లో ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్టర్డ్ తుక్కు కేంద్రాల్లో పాత, అన్‌ఫిట్ వాహనాలను స్క్రాప్ కింద ఇచ్చేసి, స్క్రాపింగ్ సర్టిఫికెట్ పొందే యజమానులకు ఈ స్కీమ్ కింద పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. స్క్రాప్ కింద ఇచ్చేసే వాహనాల విలువ.. కొత్త వాహనాల ఎక్స్‌షోరూం రేటులో సుమారు 4–6% దాకా ఉండేలా స్క్రాపింగ్ సెంటర్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. దేశీ వాహన పరిశ్రమ టర్నోవరు ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెరిగేందుకు స్క్రాపేజీ పాలసీ తోడ్పడగలదని మంత్రి తెలిపారు. అందరికీ ప్రయోజనకరం..: స్క్రాపేజీ విధానం అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా ఉండబోతోందని గడ్కరీ తెలిపారు. ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కాలుష్య కారక వాయువుల విడుదలను నియంత్రించేందుకు, రహదారి.. వాహనాల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రాణాంతకంగా రోడ్డు ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కోవిడ్–19 మరణాల కన్నా ఎక్కువ ఉండటం ఆందోళనకరమని గడ్కరీ తెలిపారు. గతేడాది కోవిడ్–19తో 1.46 లక్షల మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధిక శాతం 18–35 ఏళ్ల మధ్య వయస్సున్న వారేనని మంత్రి చెప్పారు. తుక్కు పాలసీ ప్రతిపాదనల్లో మరికొన్ని... ► వాహనాల ఫిట్నెస్ టెస్టులు, స్క్రాపింగ్ సెంటర్ల సంబంధ నిబంధనలు 2021 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తుక్కు కింద మారుస్తారు. ► 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేస్తారు. మిగతా వాహనాలకు దశలవారీగా 2024 జూన్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెస్తారు. ► ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైనా సదరు వాహనాల జీవితకాలం ముగిసినట్లుగా పరిగణిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైన వాణిజ్య వాహనాలను డీ–రిజిస్టర్ చేస్తారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా 15 ఏళ్ల పైబడిన కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ టెస్టు, సర్టిఫికెట్ల ఫీజును భారీగా పెంచుతారు. ► ప్రైవేట్ వాహనాల విషయానికొస్తే .. 20 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్టులో లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైన పక్షంలో డీ–రిజిస్టర్ చేస్తారు. 15 ఏళ్ల నుంచే రీ–రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతారు. ► ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది. స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాల ముసాయిదా.. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 100 స్క్రాపింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఆర్వీఎస్ఎఫ్ ఏర్పాటుకు రూ. లక్ష లేదా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్దేశించే మొత్తం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంటుంది. ప్రతీ ఆర్వీఎస్ఎఫ్కు ముం దస్తు డిపాజిట్‌గా రూ.10 లక్షల బ్యాంక్ గ్యా రంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కో సం దరఖాస్తు చేసుకున్న 60 రోజులల్లోగా అనుమ తులపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ముసా యిదా నిబంధనలపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలి. -
పాత ప్రభుత్వ వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ నిలిపివేత
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో వినియోగిస్తున్న వాహనాలు 15 ఏళ్లకు మించి పాతబడిన పక్షంలో రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయరాదని భావిస్తోంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ప్రతిపాదన రూపొందించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ శాఖలు పదిహేనేళ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యూ చేసుకోవడానికి ఉండదంటూ ఒక ట్వీట్లో పేర్కొంది. కొత్త నిబంధనల ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మునిసిపల్, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు మొదలైన వాటిల్లో ఉపయోగిస్తున్న వాహనాలకు ప్రతిపాదిత నిబంధనలను ప్రభుత్వం వర్తింప చేయనుంది. 20 ఏళ్లు పాతబడిన వ్యక్తిగత వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందంటూ 2021–22 బడ్జెట్లో కేంద్రం స్వచ్ఛంద స్క్రాపేజీ (తుక్కు) పాలసీని ప్రకటించిన నేపథ్యంలో తాజా ముసాయిదా నోటిఫికేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
తిరుమలలో ఆ వాహనాలు నిషేధం
సాక్షి, తిరుమల: కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని ఆయన వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల క్షేత్రం ‘నో హారన్’ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని ఏయస్పీ మునిరామయ్య తెలిపారు. -
'15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు నిషేధం'
పాట్నా : బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ వాహనాలను సోమవారం నుంచే పూర్తిగా నిషేదించినట్లు నిర్ణయం తోసుకుంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇటివలే పండుగ సీజన్లో నమోదైన కాలుష్య స్థాయిని గమనిస్తే అందులో ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే పాట్నా మెట్రో పాలిటన్ ఏరియాలో 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలను నిషేదించామని తెలిపారు. అయితే ప్రైవేటు వాహనాలను ఈ నిషేధం నుంచి మినహాయించామని, కానీ యజమానులు తమ వాహనాలకు కొత్తగా కాలుష్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఇంటెన్సివ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం జారీ చేస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కిరోసిన్‌తో నడుస్తూ అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆటో రిక్షాలు కొత్తగా పొల్యుషన్ టెస్ట్‌ను చేయించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను త్వరలోనే పూర్తిస్థాయి సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిని మార్చుకోవడానికి ఆటో యజమానులకు ప్రోత్సాహం కింద సబ్సిడీలు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రాధిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అదే విధంగా ప్రైవేట్ భవనాలకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్‌లెస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగించుకునేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. చెత్తను పారవేసే ట్రక్కులు, ఇతర వ్యాన్లు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెత్తను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. -
ఆ వాహనాలపై సుప్రీం నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం చొరవ తీసుకుంది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో 15 ఏళ్ల కిందటి పెట్రోల్ వాహనాలు, పదేళ్ల కిందటి డీజిల్ వాహనాల రాకపోకలను నిషేదించింది. రాజధాని రోడ్లపై ఈ వాహనాలు తిరిగితే స్వాధీనం చేసుకోవాలని రవాణా శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో ప్రస్తుత కాలుష్య తీవ్రతకు ఈ నిర్ణయం అనివార్యమని కోర్టు స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ మండలి, రవాణా శాఖ వెబ్సైట్లలో ఈ వాహనాల జాబితాను ప్రకటించాలని పేర్కొంది. పౌరులు కాలుష్యంపై ఫిర్యాదు చేసేందుకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే సోషల్ మీడియలో ఖాతాను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. గతంలో దేశ రాజధానిలో పాత వాహనాల రాకపోకలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం నిషేధించింది. -
20 ఏళ్లకు పైబడిన వాహనాలకు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: 20 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను తప్పనిసరిగా వినియోగం నుంచి తప్పించడానికి ఉద్దేశించిన విధానానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ విధానం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ తుది దశకు చేరుకుందని రవాణా మంత్రి గడ్కరీ గతంలో చెప్పారు. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంఓలో జరిగిన భేటీలో ఈ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సీనియర్ అధికారి చెప్పారు. -
కాలం చెల్లిన వాహనాలకు చెక్
గుంటూరు వెస్ట్: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించాలంటే కాలం చెల్లిన వాహనాలను తీసేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలిచ్చారు. పాత వాహనాలకు సరైన ఇంధనం వాడడం లేదన్నారు. దీంతో కాలుష్యం ఊహకందని విధంగా పెరిగిపోతుందన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశం మందిరంలో జిల్లా కాలుష్య నియంత్రణా మండలి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందన్నారు. 2017లో నగరంలో ఒక ఘనపు మీటరుకు దుమ్ము సాంద్రత 66.5 మైక్రో గ్రాములు ఉందన్నారు. దీనిని 60 మైక్రో గ్రాములకు తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. కాలుష్య నివారణకు జిల్లా కాలుష్య నివారణ మండలి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలు కూడా దీనిపై తమ వంతు బాధ్యతను గుర్తెరగాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఆర్వో నాగబాబు, జిల్లా కాలుష్య నియంత్రణా మండలి ఈఈవీఆర్.మహేశ్వరరావు, ఉప రవాణా కమిషనర్ రాజారత్నం, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం. అజయ్‌కుమార్, జిల్లా సరఫరాల అధికారి ఇ.చిట్టిబాబు పాల్గొన్నారు. -
కాలం చెల్లినా బేఫికర్
సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్ నుంచి కాలం చెల్లిన ఆక్షన్డ్ వాహనాలను ఖరీదు చేయడం... మెకానిక్‌ల సాయంతో వీటికి ఇంజన్, ఛాసిస్ నెంబర్లు వేయించడం... ఆర్టీఏ దళారులు, అధికారుల సాయంతో కొత్తగా ఆర్సీలు సృష్టించడం... వీటి సాయంతో వాహనాలను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం... 2015 నుంచి ఈ పంథాలో దందా చేస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారితో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒకరు బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం దళారిగా డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. ఈ వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆ విభాగానికి లేఖ రాయనున్నామన్నారు. ఉత్తరాదిలో వాహనాల వేలం.. గుజరాత్‌కు చెందిన యు.హితేష్ పటేల్ నగరానికి వలసవచ్చి మిఠాయిల వ్యాపారం చేసేవాడు. కవాడిగూడ, నాగోల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వీట్ షాప్‌లు నష్టాలు మిగల్చడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో ఇతడి దృష్టి కాలం చెల్లిన వాహనాలపై పడింది. ఉత్తరాదికి చెందిన పోలీసు విభాగాలతో పాటు ఆర్మీ సైతం 15 ఏళ్లకు మించిన వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణిస్తాయి. వీటి ఆర్సీలు ఇతర పత్రాలు ధ్వంసం చేయడంతో పాటు ఇంజన్, ఛాసిస్ నెంబర్లు సైతం తుడిచేసి వేలంలో విక్రయిస్తారు. ఇలాంటి వాటిని ఉత్తరాదికి చెందిన దళారులు పెద్ద మొత్తంలో ఖరీదు చేస్తారు. ఆపై వీటిని స్క్రాప్‌గా, విడి భాగాలు విక్రయించడానికి ఓఎల్ఎక్స్లో పెడుతున్నారు. వెబ్సైట్లో సెర్చ్ చేసి నంబర్లు... హితేష్ ఈ వాహనాలను ఓఎల్ఎక్స్ ద్వారా రూ.10 వేల నుంచి రూ.15 వేలు వెచ్చించి ఖరీదు చేస్తున్నాడు. వీటిని హైదరాబాద్‌కు తెప్పించిన తర్వాత తనకు పరిచయస్తులైన దాదాపు 20 మంది మెకానిక్‌లకు సమాచారం ఇచ్చేవాడు. యథాతథంగా వాహనం కావాలంటూ రూ.25 వేలకు విక్రయించేస్తున్నాడు. ఎవరైనా తమకు రిజిస్ట్రేషన్‌తో సహా కావాలని కోరితే అసలు కథ ప్రారంభిస్తున్నాడు. ఆర్టీఏ కార్యకలాపాలపై పట్టున్న హితేష్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ విభాగంలోకి ప్రవేశిస్తాడు. తమ దగ్గర ఉన్న వాహనం ఏ మోడల్‌కు చెందినదో గుర్తిస్తాడు. అప్పట్లో ఉండే రిజిస్ట్రేషన్ సిరీస్‌కు చెందిన ఏదో ఒక నెంబర్ అందులో ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాడు. ఆ నెంబర్ దాదాపు 15 ఏళ్లకు పూర్వానిది కావడంతో ‘నో డేటా ఫౌండ్’ అంటూ వస్తుంది. ఈ నెంబర్ నోట్ చేసుకునే హితేష్... మెకానిక్స్ సాయంతో ఆయా వాహనాలపై తనకు తోచిన ఇంజన్, ఛాసిస్ నెంబర్లను ప్రత్యేక ఉపకరణాల ద్వారా ముద్రించేస్తాడు. ఆర్టీఏ దళారి సాయంతో... ఇలా సిద్ధమైన వాహనాలకు సంబంధించిన నెంబర్లను ఓ చీటీపై రాసే హితేష్ దాన్ని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం ఏజెంట్ ఎ.విఠల్‌రావుకు అందిస్తాడు. ఒక్కో వాహనానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసే విఠల్‌రావు ఈ వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారుల సాయంతో ఆర్సీలు జారీ చేయిచేస్తాడు. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చే వాహనాలకు రీ–అసైన్మెంట్ పద్దతిలో, కాలం చెల్లినప్పటికీ ఫిట్నెస్తో ఉన్న వాహనాలకు రీ–రిజిస్ట్రేషన్ పద్దతిలో ఆర్టీఏ అధికారులు కొత్తగా వేరే నెంబర్లు లేదా పాత నెంబర్లు కేటాయిస్తారు. ఈ రెండు పద్దతుల్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్న విఠల్‌రావు ఆర్సీలు జారీ చేయించి హితేష్‌కు అప్పగించేవాడు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ కార్యాలయంలో తన పరిచయస్తులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తూ నకిలీ యజమానులుగా ప్రవేశపెడుతున్నాడు. వీరితోనే వేలిముద్రలు వేయించడం, ఫొటోలు దిగేలా చేయడం, డిజిటల్ సంతకాలు పెట్టించడం చేస్తున్నాడు. భారీ మొత్తాలకు అమ్మేసుకుంటూ... ఇలా ‘తయారైన’ వాహనాలను హితేష్ తన ముఠాలోని మెకానిక్‌ల సాయంతో భారీ మొత్తాలకు విక్రయించేస్తున్నాడు. 1962 మోడల్‌కు చెందిన ‘ఏబీడీ 1’ రిజిస్ట్రేషన్‌తో కూడిన వాహనాన్ని ఏకంగా రూ.1.5 లక్షలకు అమ్మారు. విక్రయించేది సైతం మెకానిఖలే కావడం, వాహనాలు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకుని ఉండటం, ఆర్టీఏ రికార్డుల్లోనూ వివరాలు ఉంటుండటంతో ఖరీదు చేసే వారికీ ఎలాంటి అనుమానాలు రావడం లేదు. మరోపక్క హితేష్, విఠల్‌రావు ఏలాంటి వాహనాలు లేకుండానే 14 ఆర్సీలు వివిధ పేర్లు, నెంబర్లతో జారీ చేయించి సిద్ధంగా ఉంచారు. ఏవైనా వాహనాలు దొరికితే వాటిపై ఈ నెంబర్లు వేసి విక్రయించాలని భావించారు. మరోపక్క ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ సహాయంతో 72 నెంబర్లను సిద్ధం చేసి ఉంచారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. క్రేజ్ ఉన్న వాహనాలే ఎక్కువగా... ప్రధాన సూత్రధారి హితేష్, ఆర్టీఏ దళారి విఠల్‌రావులతో పాటు సహకరించిన మెకానిక్స్ మైఖేల్ మోది (ఆలుగడ్డబావి), హకీం అబు నాసిర్ (శాస్త్రిపురం), మహ్మద్ ఆరిఫ్‌లను (వారాసిగూడ) అరెస్టు చేసింది. వీరి నుంచి, వీరు విక్రయించిన 15 రాయల్ ఎన్ఫీల్డ్, 2 యమహా బైక్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ గ్యాంగ్ ఎక్కువగా క్రేజ్ ఉన్న వాహనాలకే రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆర్టీఏ అధికారుల వివరాలు ఆరా తీయడానికి పోలీసు కమిషనర్ ద్వారా ఆర్టీఏ కమిషనర్‌కు లేఖ రాయనున్నామని డీసీపీ పేర్కొన్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం బోయిన్పల్లి, గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
‘ఆ వాహనాలకు చెల్లు’
సాక్షి, న్యూఢిల్లీ : 15 ఏళ్లకు పైబడిన వాహనాల వాడకాన్ని నిషేధిస్తూ త్వరలోనే ఓ విధానాన్ని తీసుకువస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతుందన్నారు. దీనిపై ఇప్పటికే నీతిఆయోగ్‌తో ఈ వాహనాలను తొలగించే విధానానికి తుదిరూపు ఇచ్చామని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపై తిరిగేందుకు అనుమతించబోమని చెప్పారు. వాహనాల స్క్రాప్‌ను ఆటో విడిభాగాల తయారీకి ఉపయోగిస్తే ధరలు తగ్గుముఖం పట్టి భారత్ ఆటో హబ్‌గా ఎదిగేందుకూ ఉపకరిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. చెత్త నుంచి వాహనాలకు ఉపయోగపడే ప్లాస్టిక్, రబ్బర్, అల్యూమినియం, రాగి వంటి ముడిపదార్ధాలను చౌకగా సమీకరించుకోవచ్చని అన్నారు.