మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన ఏదైనా ఒక పాత వాహనం ఉందా?.. అయితే, మీకో షాకింగ్ న్యూస్. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్సీ రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇకపై, 15 ఏళ్లు పైబడిన కారు ఆర్సీ రెన్యువల్‌కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అంతేగాక, ఆర్సీ రెన్యువల్ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్లో ఆలస్యం చేస్తే, నెలకు 300 నుంచి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది. ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ.50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ.1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ కోసం రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దిగుమతి చేసుకున్న కార్ల ఆర్సీ రెన్యువల్ ఫీజు రూ.15,000 నుంచి రూ.40,000కి పెరిగింది. భారతదేశం అంతటా ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. అయితే, ఈ రూల్ ఢిల్లీలో వర్తించదు. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు & 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. ఒకవేళ వారు తమ వాహనాలను దేశ రాజధాని ఢిల్లీలో నడపాలనుకుంటే తమ పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది.
కొత్త ఫీజులు ఇలా..
వ్యక్తిగత వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజు
వెహికల్ టైప్ రిజిస్ట్రేషన్ ఫీజు రెన్యువల్ ఫీజు
మోటార్ సైకిల్: 300 1,000
థ్రీవీలర్ : 600 2,500
కారు/జీపు : 600 5,000
ఇంపోర్టెడ్ వెహికల్: 5,000 40,000
కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజు
వెహికల్ టైప్ ఫిట్నెస్ ఫీజు రెన్యువల్ ఫీజు
మోటార్ సైకిల్: 500 1,000
థ్రీవీలర్ : 1,000 3,500
ట్యాక్సీ/క్యాబ్ : 1,000 7,000
మీడియం గూడ్స్ /ప్యాసింజర్: 1,300 10,000
హెవీ గూడ్స్/ప్యాసింజర్: 1,500 12,500
(చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ!)
Comments
Please login to add a commentAdd a comment