ముంబై: పాత వాహనాలను తుక్కు కింద వేసే బదులు వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా రెట్రోఫిట్ చేసే ప్రయత్నాలకు తోడ్పాటునివ్వడం లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని కేంద్రం పరిశీలించే అవకాశముందని మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రైమస్ పార్ట్‌నర్స్, ఈటీబీ (యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్) ఒక నివేదికలో పేర్కొన్నాయి.
సాంప్రదాయ ఇంజిన్ల ఆధారిత వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడంలో పలు సవాళ్లు ఎదురు కావచ్చని తెలిపాయి. కానీ ప్రభుత్వ, పరిశ్రమ, ప్రజల సమన్వయంతో వీటిని సమర్ధంగా అధిగమించడానికి వీలుంటుందని వివరించాయి.
కాలుష్యకారకంగా మారే 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన ప్యాసింజర్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రీ–రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ‘పాత వాహనాలను తుక్కు కింద మార్చే బదులు విద్యుత్‌తో నడిచేలా వాటిని రెట్రోఫిట్ చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చు. తద్వారా ప్రస్తుత వాహనాల జీవితకాలం కూడా పెరుగుతుంది‘ అని ప్రైమస్ పార్ట్‌నర్స్, ఈటీబీ సంయుక్త నివేదికలో తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment