దేశ రాజధాని వాయు కాలుష్యం కొరల్లో చిక్కుకుని ఎప్పటి నుంచో విలవిలాడుతోంది. సరి బేసి సంఖ్య విధానం ప్రవేవపెట్టిన పరిస్థితి అదుపులోకి రాలేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ప్రోత్సహించేందుకు ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఐప్పటికీ ఆశించిన స్థాయిలో ఈవీలు ఢిల్లీలో పెరగలేదు. దీంతో మరోసారి ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఈవీ వెహికల్స్ అందివ్వాలని నిర్ణయించింది. ఈ పథకం తొలి దశలో టూ వీలర్స్ అందివ్వనున్నారు. అంతేకాదు ముందుగా ఈవీ వెహికల్ కొనుగోలు చేసిన పది వేల మంది ఉద్యోగులకు రూ. 5000 ఇన్సెంటీవ్‌గా అందిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. దీంతో పాటు మొదటి వెయ్యి ఈవీ కొనుగోలుదారులకు అదనంగా మరో రూ.2000 ప్రోత్సాహక నగదు ఇస్తామని చెబుతోంది ఆప్ సర్కారు. మొత్తంగా వాయు కాలుష్యాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శ్రమిస్తోంది.
చదవండి: Electric Vehicle: రెండేళ్లే! ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment