బడ్జెట్‌ 2018 : ఈ - వెహికల్స్‌కు వరాలు | Tax sops for electric vehicles likely in Budget  | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2018 : ఈ - వెహికల్స్‌కు వరాలు

Published Sun, Jan 28 2018 4:02 PM | Last Updated on Wed, Sep 5 2018 3:47 PM

Tax sops for electric vehicles likely in Budget  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ర్టిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు భారీగా వరాలు, రాయితీలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. సంప్రదాయ వాహనాలతో కాలుష్యం, పెట్రోల్‌ వాడకం విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ర్టిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు రానున్న బడ్జెట్‌లో ఈ వెహికల్స్‌కు తక్కువ జీఎస్‌టీ, ఈ వాహనాల కొనుగోలుదారులకు పన్ను రాయితీలను కల్పించే దిశగా పలు చర్యలు ప్రకటించవచ్చు.

ఈ వెహికల్స్‌ను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్పించే బడ్జెట్‌లో ఈ దిశగా చర్యలుంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలక్ర్టిక్‌ వాహనాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్‌టీని ప్రభుత్వం 5 శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎలక్ర్టిక్‌ వాహనాల కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు ఐటీ రాయితీలనూ అందించే దిశగా చర్యలు ప్రకటిస్తారని అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement