డొక్కు కారు ఇవ్వండి.. డబ్బు తీసుకెళ్లండి
వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. బాగా పాతబడిన వాహనాలను తీసుకొచ్చి సరెండర్ చేస్తే డబ్బులు ఇస్తామని ప్రకటించింది. పదేళ్లకు పైబడ్డ భారీ వాహనాలను తీసుకొస్తే.. 1.5 లక్షల రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామన్నారు.
అలాగే కార్ల లాంటి చిన్న వాహనాలను సరెండర్ చేస్తే 30 వేల రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో పాత వాహనాలను ఇక తొలగించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ సరికొత్త ఆలోచన చేస్తోంది.