సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం చొరవ తీసుకుంది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో 15 ఏళ్ల కిందటి పెట్రోల్ వాహనాలు, పదేళ్ల కిందటి డీజిల్ వాహనాల రాకపోకలను నిషేదించింది. రాజధాని రోడ్లపై ఈ వాహనాలు తిరిగితే స్వాధీనం చేసుకోవాలని రవాణా శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఢిల్లీలో ప్రస్తుత కాలుష్య తీవ్రతకు ఈ నిర్ణయం అనివార్యమని కోర్టు స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ మండలి, రవాణా శాఖ వెబ్‌సైట్‌లలో ఈ వాహనాల జాబితాను ప్రకటించాలని పేర్కొంది. పౌరులు కాలుష్యంపై ఫిర్యాదు చేసేందుకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే సోషల్ మీడియలో ఖాతాను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. గతంలో దేశ రాజధానిలో పాత వాహనాల రాకపోకలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment