కార్ల అమ్మకాలు కాస్త పుంజుకున్నాయ్
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు ఈ ఏడాది మార్చిలో కాస్త పుంజుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఫలితాలు కనిపిస్తున్నాయని నిపుణులంటున్నారు. హ్యుందాయ్, హోండా, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కంపెనీల అమ్మకాలు పెరగ్గా, మారుతీ సుజుకి, మహీంద్రా, టయోటా, అశోక్ లేలాండ్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు సానుకూల ఫలితాలనిస్తోందని వాహన పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం వాహన పరిశ్రమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలదని ఈ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా ఎంక్వైరీలైతే పెరిగాయి. కానీ, అమ్మకాల్లో మెరుగుదల లేదని కంపెనీలంటున్నాయి. అయితే ఎన్నికల అనంతరం పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి.
కంపెనీల పరంగా వివరాలు...
మారుతీ సుజుకి: మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 11% తగ్గగా,. కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లు 9% వృద్ధి సాధించాయి. ఎగుమతులు 8% తగ్గాయి.
నిస్సాన్: కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన డాట్సన్ గో కారుకు మంచి స్పందన లభిస్తోందని పేర్కొంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 36,975 వాహనాలు అమ్ముడవగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధితో 38,217 వాహనాలు విక్రయించామని తెలిపింది.
ఫోర్డ్ ఇండియా: దేశీయ అమ్మకాలు 21 శాతం పెరిగాయి.
హోండా మోటార్ సైకిల్: మోటార్ బైక్‌ల అమ్మకాలు 57 శాతం, స్కూటర్ల అమ్మకాలు 53 శాతం చొప్పున వృద్ధి సాధించాయి.
మెర్సిడెస్ బెంజ్: ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 2,554 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలం వాహన విక్రయాల(2,009)తో పోల్చితే 27 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది.
మార్చి నెల వాహన విక్రయాలు ఇలా..
కంపెనీ 2014 2013 వృ/క్షీ.(%లో)
మారుతీ సుజుకి 1,13,350 1,19,937 -6
హ్యుందాయ్‌ూ 35,003 33,858 3
హోండా కార్‌సూ 18,426 -- 83
నిస్సాన్ 7,019 2,125 230
ఫోర్డ్ ఇండియా 11,805 7,499 57
టయోటా 9,160 21,143 -57
మహీంద్రా 51,636 51,904 --
అశోక్ లేలాండ్ 10,286 14,019 -27
హోండా మోటార్ సైకిల్ 3,92,148 2,52,787 55