passenger car
-
మారుతీ కుటుంబం 2.5 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో భారత్‌లో అగ్రశేణి కంపెనీ మారుతీ సుజుకీ.. 2023 జనవరి 9 నాటికి దేశీయంగా 2.5 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అప్పటి మారుతీ ఉద్యోగ్ 1983 డిసెంబర్ నుంచి అమ్మకాలను ప్రారంభించింది. కంపెనీ 2012 ఫిబ్రవరి నాటికి 1 కోటి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. 2019 జూలై కల్లా 2 కోట్ల యూనిట్ల విక్రయాలను సాధించింది. జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుతం దేశీయంగా 17 మోడళ్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. క్రమంగా ఎస్యూవీ మోడళ్లను ప్రవేశపెడుతోంది. మరోవైపు హైబ్రిడ్, సీఎన్జీ విభాగంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ భారత్‌లో 21 లక్షల యూనిట్ల హైబ్రిడ్, సీఎన్జీ వాహనాలను విక్రయించింది. -
ఫెస్టివ్ సీజన్: దూసుకెళ్లిన ప్యాసింజర్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సీజన్ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 3,07,389 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 92 శాతం అధికం కావడం గమనార్హం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 13 శాతం అధికమై 17,35,199 యూనిట్లు నమోదైంది. వీటిలో మోటార్‌సైకిల్స్ 18 శాతం ఎగసి 11,14,667 యూనిట్లు, స్కూటర్స్ 9 శాతం పెరిగి 5,72,919 యూనిట్లు ఉన్నాయి. జూలై–సెప్టెంబర్ కాలంలో అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు 51,15,112 నుంచి 60,52,628 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ వాహనాలు 38 శాతం అధికమై 10,26,309 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 13 శాతం పెరిగి 46,73,931 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 39 శాతం దూసుకెళ్లి 2,31,880 యూనిట్లు సాధించాయి. -
కారులో 6 ఎయిర్ బ్యాగ్ నిబంధన పై కేంద్రం కీలక నిర్ణయం
-
పెరిగిన వెహికల్స్ ఎక్స్పోర్ట్..అగ్రస్థానంలో మారుతీ సుజికీ!
న్యూఢిల్లీ: లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ల ఊతంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 26 శాతం ఎగిశాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1,27,083 యూనిట్లతో పోలిస్తే 1,60,263 యూనిట్లకు పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 88 శాతం పెరిగి 1,04,400 యూనిట్లుగాను, యుటిలిటీ వాహనాలు 18 శాతం పెరిగి 55,547 యూనిట్లుగాను నమోదయ్యాయి. వ్యాన్ల ఎగుమతులు 588 యూనిట్ల నుంచి 316 యూనిట్లకు తగ్గాయి. ‘లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లు కోలుకుంటున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో, మన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో భారతీయ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తుండటం, ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మారుతీ టాప్.. తొలి త్రైమాసికంలో 68,987 ప్యాసింజర్ వాహనాలను (53 శాతం అధికం) ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిల్చింది. ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేసింది. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెసో, బ్రెజా మోడల్స్ టాప్‌లో ఉన్నాయి. ఇక హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎగుమతులు 34,520 యూనిట్లుగా (15 శాతం వృద్ధి) నమోదయ్యాయి. కియా ఇండియా 21,459 వాహనాలను (గత క్యూ1లో 12,448) ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటర్ ఇండియా 11,419 యూనిట్లు, ఫోక్స్‌వ్యాగన్ 7,146 యూనిట్లు, రెనో 6,658 వాహనాలు, హోండా కార్స్ 6,533 యూనిట్లను ఎగుమతి చేశాయి. వాహన రంగంలో కోటి ఉద్యోగాలు దేశీ ఆటోమొబైల్ రంగంలో వచ్చే 5–6 ఏళ్లలో యువతకు 1 కోటి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు సంబంధించి 40 శాతం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు దేశీయంగానే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగానికి భారత్ కీలక కేంద్రంగా మారనుంది. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి -
గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుందో.. నిజంగానే రాబోతుందండోయ్
మనం కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు భారీగా ట్రాఫిక్‌జామ్ అయితే... కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే ఏమనిపిస్తుంది? గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీని తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. కొత్తగా ఆవిష్కరించిన ఎగిరే కారును ఎవరు, ఎక్కడ రూపొందించారు, అది ఎలా ఉంటుందనే విశేషాలు చూద్దాం..! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 2027 నాటికల్లా వినియోగంలోకి.. యూరప్ దేశమైన స్లొవేకియాలో ఏరోమొబిల్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి ఫోర్‌సీటర్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఆవిష్కరించింది. దీని పేరు ఏఎం నెక్ట్స్. మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది. 2027నాటికల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్ కారు ఇది. సూపర్‌కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్’ను (అంటే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగరడం.. గాల్లో నుంచి రోడ్డు మీదికి దిగడం) మార్చుకోగలదు. హాయిగా వెళ్లొచ్చు... ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల విలువైన సమయం చాలా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యమైన నగరాల మధ్య 100 నుంచి 500 మైళ్ల దూరం వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటోంది. ఇందులో వెళ్తే ప్రయాణ బడలిక అస్సలుండదని, ఆడుతూపాడుతూ వెళ్లొచ్చని, అదీగాక భూమ్మీద ఉండే అందాలను వీక్షిస్తూ వెళ్లొచ్చని చెబుతోంది. అయితే ఫ్లయింగ్ ట్యాక్సీ ధర ఎంత అనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అలాగే ప్రయాణికులకు టికెట్ ఎంత ఉంటుందన్నది కూడా వెల్లడించలేదు. తొలుత ఏఎం 4.0 ఈ కంపెనీ మొదట రూపొందించిన టూసీటర్ ఫ్లయింగ్ కారు ఏఎం 4.0 మోడల్‌ను 2017 జూన్‌లో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. గాలిలో గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డుపై దీని గరిష్టవేగం గంటకు 160 కి.మీ. దీని ఖరీదు రూ.9.8 కోట్లు – 12 కోట్ల వరకు ఉంది. ఈ ఫ్లయింగ్ కారును గాలిలో నడపాలంటే మాత్రం పైలట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కారును వచ్చే ఏడాదికి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు 2024కు గానీ అందుబాటులోకి రాదని చెబుతోంది. అసలు సిసలు ఫ్లయింగ్ కారు ‘ఇది ఏరోమొబిల్ అసలు సిసలు ఫ్లయింగ్ కారు. ఇది రెండో విప్లవాత్మకమైన మోడల్’ అని కంపెనీ సీఈఓ పాట్రిక్ హెస్సెల్ చెప్పారు. ఒక్క ఉత్తర అమెరికా మార్కెట్లోనే ఏడాదికి 4 లక్షల కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగిరే కార్ల వల్ల వ్యక్తిగత రవాణాను మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. రోడ్డుపైగానీ, గాలిలో గానీ చాలా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి దోహదం చేస్తుందని అంటోంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్‌లకు దీంతో చెక్ పెట్టవచ్చంటోంది. ఈ ఎగిరే కారు కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న 10 వేల ల్యాండింగ్ స్ట్రిప్‌లను వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. -
కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా
ముంబై, సాక్షి: దేశీయంగా కార్ల విక్రయాలలో మెజారిటీ వాటాను 5 కంపెనీలు ఆక్రమిస్తున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సమాఖ్య(ఎఫ్ఏడీఏ) తాజాగా పేర్కొంది. దీంతో ప్యాసింజర్ వాహన మార్కెట్లో 85 శాతం వాటా వీటి సొంతంకాగా.. మరో 22 బ్రాండ్లు మిగిలిన 15 శాతం మార్కెట్లను పంచుకుంటున్నట్లు తెలియజేసింది. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధాన వాటాను గెలుచుకున్నట్లు పేర్కొంది. (ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?) పెద్ద మార్కెట్ గత నవంబర్ నుంచి చూస్తే ఈ నవంబర్ వరకూ టాప్-5 కంపెనీలు తమ మార్కెట్ వాటాను 4.5 శాతంమేర పెంచుకున్నట్లు ఎఫ్ఏడీఏ తెలియజేసింది. దీంతో వీటి వాటా 81.2 శాతం నుంచి 85 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది. సుప్రసిద్ధ గ్లోబల్ బ్రాండ్లు రేనాల్ట్, ఫోర్డ్, హోండా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ తదితరాలు పోటీ పడుతున్నప్పటికీ దేశీయంగా పరిస్థితులు వేరని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్.. ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఆటోమోటివ్ మార్కెట్ కాగా.. చైనా తొలి స్థానాన్ని ఆక్రమిస్తోంది. చైనాలో టాప్-5 కార్ల కంపెనీల వాటా 40 శాతమే. జర్మనీలో సైతం 50 శాతమేకాగా.. యూఎస్‌లో టాప్-5 కంపెనీలు 68 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అయితే జపాన్‌లో కూడా టాప్-5 కంపెనీల వాటా అత్యధికంగా 81 శాతంగా నమోదవుతుండటం గమనార్హం! జపాన్‌లో మార్కెట్ లీటర్లు జపనీస్ కంపెనీలేకావడం విశేషం! పలు దేశాలలో ప్రాధాన్యత కలిగిన టయోటా వాటా దేశీయంగా 3 శాతానికి పరిమితమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.(డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్) మారుతీ జోరు చౌక ధరల మోడళ్లు, ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు, భారీ నెట్వర్క్ వంటి అంశాల కారణంగా మారుతీ సుజుకీ కార్లకు డిమాండ్ కొనసాగుతున్నట్లు ఆటో నిపుణులు చెబుతున్నారు. దీంతో మారుతీ 50 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో హ్యుండాయ్ మార్కెట్ వాటా స్వల్ప క్షీణతతో 17.74 శాతం నుంచి 16.21 శాతానికి చేరింది. ఇదే కాలంలో టాటా మోటార్స్ వాటా 4.84 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఇక కియా మోటార్స్ వాటా 3.78 శాతం నుంచి 6.28 శాతానికి జంప్‌చేసింది. ఆల్ట్రోజ్.. థార్.. పండుగల సీజన్, కొత్త మోడళ్ల విడుదల, లాయల్టీ బెనిఫిట్స్, చౌక వడ్డీ రేట్లు తదితర పలు అంశాలు కార్ల విక్రయాలపై ప్రభావాన్ని చూపుతుంటాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. టాటా మోటార్స్‌కు ఆల్ట్రోజ్, ఎస్యూవీ నెక్సాన్ మోడళ్లు మద్దతుగా నిలిచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఎంఅండ్ఎం వాటా 6.78 శాతం నుంచి 5.48 శాతానికి నీరసించింది. కంపెనీ విడుదల చేసిన థార్ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ నెలకొన్నప్పటికీ తగిన స్థాయిలో వాహనాల తయారీ, సరఫరా చేయలేకపోవడం ప్రభావం చూపినట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. -
కరోనా ఎఫెక్ట్ : సగానికి పడిపోయిన వాహన విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి, దేశవ్యాప్త లాక్డౌన్ అమలు అన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక మందగమనంతో అసలే తక్కువగా ఉన్న ఆటోమొబైల్ సేల్స్ కరోనా ఎఫెక్ట్‌తో మరింత దిగజారాయి. మార్చిలో దేశీ ప్రయాణీకుల వాహన విక్రయాలు 51 శాతం పడిపోయాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్ఐఏఎం) పేర్కొంది. గత ఏడాది ఇదే మాసంలో 2,91,861 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో కేవలం 1,43,014 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్ఐఏఎం నివేదిక పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో దేశీ వాహన విక్రయాలు 7.61 శాతం తగ్గుదల నమోదు చేశాయని గత నెలలో ఎస్ఐఏఎం వెల్లడించిన నివేదిక పేర్కొంది. భారత్‌లో పలు ఆటోమొబైల్ కంపెనీలు ముడిపదార్ధాల్లో పదిశాతంపైగా చైనా నుంచి తెప్పించుకుంటాయని ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని కేటగిరీల్లో వాహనాల ఉత్పత్తి తగ్గుతుందని ఎస్ఐఏఎం గత నెలలోనే పేర్కొంది. దేశంలో కోవిడ్-19 వ్యాప్తి భయాలు వెంటాడటంతో డిమాండ్ దెబ్బతిందని, వినియోగదారుల్లో సెంటిమెంట్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఎస్ఐఏఎం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో దేశంలో ప్రయాణీకుల వాహన విక్రయాల్లో భారీ తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. మార్చిలో వాణిజ్య వాహన విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. 2019 మార్చిలో 109022 కమర్షియల్ వాహనాలు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో 88 శాతం తగ్గి కేవలం 13,027 యూనిట్ల విక్రయాలు సాగాయి. మరోవైపు త్రిచక్ర వాహనాల విక్రయాలు మార్చిలో 59 శాతం పడిపోగా, బైక్ సేల్స్ 39.83 శాతం మేర తగ్గాయి. చదవండి : పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్ -
5శాతం పెరిగిన ప్యాసింజర్ కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాలు మే నెలలో వృద్దిని నమోదు చేశాయి. పరిశ్రమ శుక్రవారం వెల్లడించిన డేటా ప్రకారం గత నెలలో 4.80 శాతం పెరిగాయి. ఈ డేటాను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (సియామ్) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 5శాతం పెరిగినట్టు వెల్లడించింది. సియామ్ సమర్పించిన నివేదిక ప్రకారం, 2017 మే అమ్మకాలు 1,66,630 (పాసెంజర్ కార్లు) యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదేకాలంలో( మే 2016) 1,58,996 యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే 18.80 శాతం పెరిగి 69,845 యూనిట్లు విక్రయించింది. వేన్ల విక్రయాలు 9.50 శాతం పెరిగి 15,167 యూనిట్లు విక్రయించింది. మే నెలలో 8.63 శాతం పెరిగి 2,51,642 యూనిట్లుగా నమోదు కాగా, అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 2,31,640 యూనిట్లు విక్రయించింది. -
కార్ల అమ్మకాలు కాస్త పుంజుకున్నాయ్
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు ఈ ఏడాది మార్చిలో కాస్త పుంజుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఫలితాలు కనిపిస్తున్నాయని నిపుణులంటున్నారు. హ్యుందాయ్, హోండా, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కంపెనీల అమ్మకాలు పెరగ్గా, మారుతీ సుజుకి, మహీంద్రా, టయోటా, అశోక్ లేలాండ్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు సానుకూల ఫలితాలనిస్తోందని వాహన పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం వాహన పరిశ్రమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలదని ఈ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా ఎంక్వైరీలైతే పెరిగాయి. కానీ, అమ్మకాల్లో మెరుగుదల లేదని కంపెనీలంటున్నాయి. అయితే ఎన్నికల అనంతరం పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి. కంపెనీల పరంగా వివరాలు... మారుతీ సుజుకి: మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 11% తగ్గగా,. కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లు 9% వృద్ధి సాధించాయి. ఎగుమతులు 8% తగ్గాయి. నిస్సాన్: కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన డాట్సన్ గో కారుకు మంచి స్పందన లభిస్తోందని పేర్కొంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 36,975 వాహనాలు అమ్ముడవగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధితో 38,217 వాహనాలు విక్రయించామని తెలిపింది. ఫోర్డ్ ఇండియా: దేశీయ అమ్మకాలు 21 శాతం పెరిగాయి. హోండా మోటార్ సైకిల్: మోటార్ బైక్‌ల అమ్మకాలు 57 శాతం, స్కూటర్ల అమ్మకాలు 53 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. మెర్సిడెస్ బెంజ్: ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 2,554 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలం వాహన విక్రయాల(2,009)తో పోల్చితే 27 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. మార్చి నెల వాహన విక్రయాలు ఇలా.. కంపెనీ 2014 2013 వృ/క్షీ.(%లో) మారుతీ సుజుకి 1,13,350 1,19,937 -6 హ్యుందాయ్ూ 35,003 33,858 3 హోండా కార్సూ 18,426 -- 83 నిస్సాన్ 7,019 2,125 230 ఫోర్డ్ ఇండియా 11,805 7,499 57 టయోటా 9,160 21,143 -57 మహీంద్రా 51,636 51,904 -- అశోక్ లేలాండ్ 10,286 14,019 -27 హోండా మోటార్ సైకిల్ 3,92,148 2,52,787 55