న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాలు మే నెలలో వృద్దిని నమోదు చేశాయి. పరిశ్రమ శుక్రవారం వెల్లడించిన డేటా ప్రకారం గత నెలలో 4.80 శాతం పెరిగాయి. ఈ డేటాను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (సియామ్) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 5శాతం పెరిగినట్టు వెల్లడించింది.
సియామ్ సమర్పించిన నివేదిక ప్రకారం, 2017 మే అమ్మకాలు 1,66,630 (పాసెంజర్ కార్లు) యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదేకాలంలో( మే 2016) 1,58,996 యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే 18.80 శాతం పెరిగి 69,845 యూనిట్లు విక్రయించింది. వేన్ల విక్రయాలు 9.50 శాతం పెరిగి 15,167 యూనిట్లు విక్రయించింది. మే నెలలో 8.63 శాతం పెరిగి 2,51,642 యూనిట్లుగా నమోదు కాగా, అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 2,31,640 యూనిట్లు విక్రయించింది.
5శాతం పెరిగిన ప్యాసింజర్ కార్ల విక్రయాలు
Published Fri, Jun 9 2017 2:23 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement