హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సీజన్ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 3,07,389 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 92 శాతం అధికం కావడం గమనార్హం.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 13 శాతం అధికమై 17,35,199 యూనిట్లు నమోదైంది. వీటిలో మోటార్‌సైకిల్స్ 18 శాతం ఎగసి 11,14,667 యూనిట్లు, స్కూటర్స్ 9 శాతం పెరిగి 5,72,919 యూనిట్లు ఉన్నాయి. జూలై–సెప్టెంబర్ కాలంలో అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు 51,15,112 నుంచి 60,52,628 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ వాహనాలు 38 శాతం అధికమై 10,26,309 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 13 శాతం పెరిగి 46,73,931 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 39 శాతం దూసుకెళ్లి 2,31,880 యూనిట్లు సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment