doubled
-
ఫెస్టివ్ సీజన్: దూసుకెళ్లిన ప్యాసింజర్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సీజన్ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 3,07,389 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 92 శాతం అధికం కావడం గమనార్హం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 13 శాతం అధికమై 17,35,199 యూనిట్లు నమోదైంది. వీటిలో మోటార్‌సైకిల్స్ 18 శాతం ఎగసి 11,14,667 యూనిట్లు, స్కూటర్స్ 9 శాతం పెరిగి 5,72,919 యూనిట్లు ఉన్నాయి. జూలై–సెప్టెంబర్ కాలంలో అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు 51,15,112 నుంచి 60,52,628 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ వాహనాలు 38 శాతం అధికమై 10,26,309 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 13 శాతం పెరిగి 46,73,931 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 39 శాతం దూసుకెళ్లి 2,31,880 యూనిట్లు సాధించాయి. -
స్విస్ బ్యాంకుల్లో.. మనోళ్ల సంపద ఎంతో తెలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకు భారతీయులు దాచిపెట్టిన సంపద గణనీయంగా పెరిగింది. వరుసగా రెండో ఏడాది కూడా భారీగా పుంజు కున్నాయి. భారతీయలు, కంపెనీలు, పెట్టుబడులు,హోల్డింగ్స్ విలువ 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. 2020 ముగింపు నాటికి స్విస్ బ్యాంకుల్లోని నిధులు దాదాపు మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 20,700 కోట్లు)గా ఉండటం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, కంపెనీల ద్వారా 2021లో 83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ.30,626 కోట్లకు) పెరిగాయని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో గురువారం వెల్లడించింది. సెక్యూరిటీలు, సంస్థాగత హోల్డింగ్స్ గణనీయంగా పెరిగాయని స్విస్ బ్యాంకు ధృవీకరించింది. దీని ప్రకారం మొత్తం స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో (239 బ్యాంకులు) కస్టమర్ డిపాజిట్లు 2021లో దాదాపు 2.25 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పెరిగాయి. ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ కు సంబంధించిన జాబితాలో భారత్ 44వ స్థానంలో ఉండగా యూకే, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. యూకే 379 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్. 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఆ తరువాత వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంగ్‌కాంగ్, లక్సెంబర్గ్, బహమాస్, నెదర్లాండ్స్, కైమన్ ఐలాండ్స్, సైప్రస్ దేశాలు టాప్‌లో ఉన్నాయి. కాగా స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల సంపద 2006లో గరిష్టంగా 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదయ్యాయి. కానీ 2018లో 11శాతం, 2017లో 44 క్షీణించాయి. అలాగే 2019 చివరి నుంచి కస్టమర్ డిపాజిట్లు పడిపోయాయని బ్యాంకు తెలిపింది. అయితే 2011, 2013, 2017, 2020, 2021లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది. స్విస్ బ్యాంకులకు తరలిపోతున్న భారతీయుల సంపద క్రమేపీ పెరుగుతూ వస్తోంది. -
యాక్సిస్ బ్యాంకు లాభంలో 94 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు లాభం జూన్ క్వార్టర్లో రెట్టింపైంది. స్టాండలోన్‌గా నికర లాభం 94 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం పుంజుకోవడం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల్లో వృద్ధికి దారితీసింది. బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.19,592 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో యాక్సిస్ బ్యాంకు రూ.1,112 కోట్ల లాభాన్ని, రూ.19,032 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 2021 మార్చి త్రైమాసికంలో (సీక్వెన్షియల్‌గా) ఆదాయం రూ.20,162 కోట్లతో పోలిస్తే తగ్గింది. లాభం కూడా మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.2,677 కోట్లతో పోలిస్తే క్షీణించింది. వడ్డీ ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.16,003 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.16,445 కోట్లతో పోలిస్తే క్షీణించింది. బ్యాంకు రుణాలు 12% వృద్ధి చెందాయి. ఆస్తుల నాణ్యత రుణ ఆస్తుల నాణ్యత కాస్త మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 3.85 శాతం, నికర ఎన్పీఏలు 1.20 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్పీఏలు 4.72%, నికర ఎన్పీఏలు 1.23% చొప్పున ఉండడం గమనార్హం. ఎన్పీఏలకు, కంటింజెన్సీలకు రూ.3,532 కోట్లను పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.4,416 కోట్లుగా ఉన్నాయి. -
స్త్రీలకు రెట్టింపు నిధి
వేపాడ: మహిళా సంఘాల సభ్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాల సభ్యు లకు ఇచ్చే స్త్రీ నిధి రుణాల మంజూరు మొత్తాన్ని రెట్టింపు చేసింది. వైఎస్సార్ క్రాంతి పథకం కింద బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం మంజూరు చేస్తోంది. జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న ఏడు క్లస్టర్ల పరిధిలో 43,752 మహిళా సంఘాలు ఉన్నాయి. స్త్రీనిధి రుణ లక్ష్యం 2019–20 ఆర్థిక సంవత్సంలో 7,775 సంఘాలకు 124.66 కోట్లు కాగా, ఇప్పటి వరకు 5,944 సంఘాలకు 83.89 కోట్లు స్త్రీనిధి రుణం అందజేశారు. లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి మొ త్తాన్ని రెట్టంపు చేయడం, వడ్డీ› తగ్గింపు, వాయిదాల కుదింపుతో మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పాడిపరిశ్రమ, కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర దుకాణాలు, పండ్ల దుకాణం తదితర వ్యాపారాలకు స్త్రీ నిధి రుణం తోడ్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. స్త్రీ నిధి రుణం మంజూరు ఇలా.. డ్వాక్రా సంఘంలో పదిమంది సభ్యుల్లో ఇద్దరు సభ్యులకు రూ.లక్ష చొప్పున, లేదంటే నలుగురు సభ్యులకు రూ.50 వేలు చొప్పున రెండు లక్షలు పొందవచ్చు. అదే 11 మంది సభ్యులున్న సంఘంలో ఆరుగురు మహిళలు రూ.మూడు లక్షల వ్యక్తిగత రుణం తీసుకునే అవకాశం ఉంది. స్త్రీ నిధి రుణాలకు అర్హత ఉన్న సంఘాలు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. గతంలో వడ్డీ 12.50 శాతం ఉండేది. ప్రస్తుత జగనన్న ప్రభుత్వం 11.75 శాతానికి తగ్గించింది. గతంలో బ్యాంకు లింకేజీ రుణంగా తీసుకుంటే 60 వాయిదాల్లో చెల్లించుకునేవారు. ఇకపై 48 నెలల్లో చెల్లించుకునే వెసులబాటు కల్పించారు. సక్రమంగా వాయిదాలు చెల్లించే సంఘాలకు ప్రభుత్వమే వడ్డీ లేని రుణం మంజూరు చేస్తుంది. మహిళలకు మేలు చేయాలనే... సీఎం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళల ఇబ్బందులకు స్వయంగా గమనించారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో స్త్రీ నిధి రుణం రెట్టింపు చేశారు. గత ప్రభుత్వంలో బ్యాంకు లింకేజీ రుణం గ్రూపునకు రూ.5 లక్షలు మించి తీసుకుంటే స్త్రీ నిధి రుణం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు రుణాన్ని డీఆర్డీఏ సిబ్బంది బ్యాంకు నుంచి అందజేస్తున్నారు. అంతకన్నా తక్కువ రుణం తీసుకున్న సంఘంలోని పది మంది సభ్యుల్లో ఇద్దరికి మాత్రమే స్త్రీ నిధి రుణం రూ.లక్ష మాత్రమే పొందే అవకాశం ఉంది. ఇద్దరికి చెరో రూ.50వేలు రుణం చాలక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని అవస్థలు పడేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు పొదుపు సంఘాల సంభ్యులకు మేలు చేకూర్చుతున్నాయి. పెరిగిన కేటాయింపులు: బ్యాంకు లింకేజీ రుణాలు, ఉన్నతి, స్త్రీనిధి, రుణాలు వసూలు చేయడం, సమావేశాలు, రికార్డుల నిర్వహణ, సమర్ధవంతంగా పనిచేస్తున్న మండల సమాఖ్యలను ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజిస్తారు. గతంలో గ్రేడ్లు వారీగా ఇచ్చే స్త్రీనిధి మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల్లో ఆనందం కలిగించింది. ఏ గ్రేడ్‌కు ఎంత పెంచారంటే... ఏ–గ్రేడ్‌లోని సంఘాలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు, బీ గ్రేడ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు, సీ–గ్రేడ్‌కు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు, డీ గ్రేడ్‌లోని సంఘాలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు రుణాన్ని పెంచారు. సక్రమంగా రుణాలు చెల్లించడంతో పాటు పేదరిక నిర్మూలన సంస్థ షరతులను సక్రమంగా అమలు చేస్తే సంఘాలకు అదనంగా నిధులు మంజూరు చేస్తారు. ప్రథమ స్థానంలో ఎస్.కోట... జిల్లాలోని 7 ఏసీ క్లస్టర్ల పరిధిలో ఎస్.కోట క్లస్టర్‌లోని 1464 సంఘాలకు రూ.25.43 కోట్లు రుణ లక్ష్యంకాగా.. ప్రోగ్రెస్‌లో ఉన్న వాటితో కలిపి 1716 సంఘాలకు 25.79 కోట్ల రుణాలు మంజూరు చేసి జిల్లాల్లో 101.42 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. పార్వతీపురం క్లస్టర్ రూ.63.44 కోట్లు రుణం ఇచ్చి ఆఖరు స్థానంలో నిలిచింది. ఆనందం రెట్టింపు మహిళా సంఘాల స భ్యులకు స్త్రీనిధి రుణం రెట్టింపు చేయడం ఆనందంగా ఉంది. చిన్నచిన్న వ్యాపారాల తో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కలి గింది. బయట అప్పులు చేసుకునే అవసరం లేదు. వాయిదాలు సకాలంలో కడితే వడ్డీ రాయితీ వస్తుందని చెబుతున్నారు. – భోజంకి మాధవి, సంఘసభ్యులు, వేపాడ స్వయం ఉపాధికి ఊతం స్త్రీనిధి రుణాల మంజూరుతో పొదుపు సంఘాల మహిళల స్వయం ఉపాధికి ఊతం లభిస్తుంది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్త్రీ నిధి రుణం ఇవ్వడం, గతంలో కంటే సభ్యులను పెంచడం, రెట్టింపు రుణం ఇవ్వడం చాలా మంచినిర్ణయం. మహిళలు ప్రైవేటు అప్పులు చేసే అవసరం ఉండదు. రుణాలతో వ్యాపారపురోగతి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో స్త్రీ నిధి లక్ష్యం చేరువలో ఉన్నాం. నేటికి ప్రోసెస్‌లో ఉన్న నంఘాలతో కలిపి 88.95 శాతం లక్ష్యం చేరుకున్నాం. ఎస్.కోట క్లస్టర్ మొదటి స్థానంలో నిలిచింది. స్త్రీనిధి రుణం రెట్టింపు వల్ల మహిళలకు ఆనందం కలుగుతోంది. – కె.సుబ్బారావు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ, విజయనగరం -
ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి తాము చాలా కష్టపడి పనిచేశామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, దీనికి డీమానిటైజేషన్ ముఖ్యమైన ఉదాహరణ అని అన్నారు. దీంతో గత మూడు సంవత్సరాల్లో ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. ఫిక్కీ సదస్సులో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్ళలో మొదటిసారిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారంలోకి వచ్చిందనీ, ఈ మార్పులో భారత ప్రజలు నిర్ణయాత్మక పాత్ర పోషించారని అమిత్ షా వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వం స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాల లాభాలపై దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చారు. ముద్రా బ్యాంకు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారని అమిత్ షా తెలిపారు. అలాగే 30 కోట్ల కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచినట్టు చెప్పారు. ఈ కారణంగా తమకు రాజకీయ నష్టం జరిగినా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే నిర్ణయాలపైనే మొగ్గు చూపిందని చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం అవసరం ఉందని షా చెప్పారు.