సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) సెప్టెంబర్ 2024లో ఆటో పరిశ్రమ విక్రయాల సంఖ్యను విడుదల చేసింది. గత నెలలో వెహికల్ సేల్స్ 24,62,431 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు సెప్టెంబర్ 2023 కంటే 12.6 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్ 2024లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,56,752 యూనిట్లు. 2023లో ఇదే నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 3,61,717 యూనిట్లు. 2023 సెప్టెంబర్ నెల కంటే కూడా 2024 సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొంత మందగించాయి.
సెప్టెంబర్ 2024లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 20,25,993 యూనిట్లు. కాగా ఇదే నెల 2023లో టూ వీలర్ సేల్స్ 17,49,794 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే గత నెలలో టూ వీలర్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయని తెలుస్తోంది.
ఇదీ చదవండి: రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్‌పేలో కొత్త ప్లాన్
వాహనాల అమ్మకాలను గురించి ఎస్ఐఏఎమ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొంత ఊపందుకుంది. టూ వీలర్, త్రీ వీలర్ సేల్స్ వరుసగా 12.6 శాతం, 6.6 శాతం వృద్ధి చెందాయి. అయితే ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం కొంత క్షీణతను నమోదు చేశాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment