ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) భారతదేశంలో గణనీయమైన విక్రయాలను పొందుతోంది. 2024లో కంపెనీ 113 కార్లను సేల్ చేసింది. దీంతో సంస్థ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.
2023తో పోలిస్తే 2024లో లంబోర్ఘిని విక్రయాలు 10 శాతం పెరిగాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 10,687 కార్లను విక్రయించింది. ఇందులో అధిక భాగం రెవెల్టో హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఉంది. అంతకు ముందు ఏడాదిలో హురాకాన్ మంచి అమ్మకాలను పొందింది. ఈ ఏడాది కంపెనీ ఉరుస్ ఎస్ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.
గత ఏడాది అన్ని ప్రధాన మార్కెట్లలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. లంబోర్ఘిని.. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో 4,227 కార్లను విక్రయించింది. అమెరికాలో 3,712 యూనిట్లు, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 2,748 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment