
న్యూఢిల్లీ: అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి 2 శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. పెరిగిన తయారీ ధరల భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకే ధరలను పెంచాల్సి వస్తున్నట్టు వివరణ ఇచ్చింది.
పెరిగిన వ్యయాల్లో ఎక్కువ మొత్తాన్ని తామే సర్దుబాటు చేసుకున్నట్టు, కొంత మేర కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తున్నట్టు పేర్కొంది. జనవరి నుంచి రేట్లను పెంచనున్నట్టు టాటా మోటార్స్ లోగడే ప్రకటించగా, తాజాగా ఎంత మేర పెంచేదీ ప్రకటించింది.
చదవండి: మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!