Duster SUV
-
స్పోర్టీ లుక్ లో కొత్త రెనాల్ట్ డస్టర్
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఫ్రెంచ్ కార్ల తయారీదారు రెనాల్డ్ తన పాపులర్ కారులో రెనాల్ట్ డస్టర్ టర్బో 2020 మోడల్ కారును భారతదేశంలో లాంచ్ చేసింది. తమ కొత్త డస్టర్ ఎస్యూవీ మోడల్ ఇప్పుడు దేశంలో ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైనది నిలిచిందనీ, ఆటోమోటివ్ మార్కెట్లలో ఐకానిక్ హోదాను సాధించిందని కంపెనీ సీఈఓ వెంకట్రావ్ మామిళ్ల పల్లె ప్రకటించారు. రెనాల్ట్ డస్టర్ టర్బో వేరియంట్లు 1.3 లీటర్ బీఎస్-6- కంప్లైంట్ మోటర్ఇన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు సీఈటీ ఆప్షన్‌తో ఐదు వేరియంట్లలో లభిస్తుంది.1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్ మోడళ్లను తీసుకురాగా, సీవీటిలో ఆర్ఎక్స్ఎస్ , ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్లలో మాత్రమే లభించనుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో బేస్ మోడల్ రెనాల్ట్ డస్టర్ టర్బో మోడల్ ధర 10.49 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. సీవీటి వెర్షన్ ధరలు 12.99 లక్షలతో ప్రారంభం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్ధ్యంతో లభిస్తున్న రెనాల్డ్ డస్టర్ ధరలు 8.59 లక్షల రూపాయలనుంచి 9.99 లక్షల మధ్య ఉండ నున్నాయి. 500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 154 బిహెచ్పి శక్తిని, 1,600 ఆర్‌పిఎమ్ వద్ద 254 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్ లో ఇంధన సామర్ధ్యం లీటరు 16.5 కిలోమీటర్లు, సీవీటీ మోడల్ కారు 16.42 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రిమోట్ ప్రీ-కూలింగ్ ఫంక్షన్‌తో క్యాబిన్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 7అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను రెనాల్ట్ డస్టర్ టర్బోలో జోడించింది. -
ధైర్యంగా ఉండండి.. డస్టర్ - 2019 కమింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ తన పాపులర్మోడల్ కారు డస్టర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఆధునిక సెక్యూరీటీ ఫీచర్లతో డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. గర్వంగా ఉండండి.. ధైర్యంగా వుండండి. విసుగు చెందకండి. బోర్డర్లను బద్దలుకొట్టండి.. న్యూ రెనాల్ట్ డస్టర్ జూలై 8వ తేదీన మార్కెట్లోకి వస్తోందని రెనాల్ట్ ట్వీట్ చేసింది. ఆర్ ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్ మూడు వేరియంట్లలో వస్తున్న డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలను రూ. 8 లక్షలనుంచి రూ.13.10 లక్షలు(ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఆర్ఎక్స్ఎస్ మోడల్ ఆల్‌వీల్ డ్రైవ్(ఏడబ్ల్యుడీ) ఆప్షన్‌ను అందిస్తోంది. బీఎస్ 6 నిబంధనలకనుగుణంగా 1.5 పెట్రోలు, డీజిల్ ఇంజీన్లలో తీసుకొస్తోంది. పెట్రోల్ , డీజీల్ ఇంజీన్ 108 బీహెచ్పీ పవర్‌ను, పెట్రోలు వెర్షన్ లీటరుకు 14 కి.మీలు, డీజిల్ వెర్షన్ లీటరు 19-20 కి.మీ మైలేజీనీ ఇస్తుంది. కొత్త వెర్షన్ డస్టర్ కారు హుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎక్సో స్పోర్ట్, మహీంద్ర ఎక్స్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. Be audacious, be daring, just don't be boring. Dare to push all limits in the #NewRenaultDUSTER. #NowEvenBOLDER Know more: https://t.co/IVCIbpfpTB pic.twitter.com/uOq1UmVagX — Renault India (@RenaultIndia) July 6, 2019 -
ఈ కారుపై లక్ష వరకు ధర తగ్గింపు
ఆటోమేకర్ రెనాల్ట్ ఇండియా తన ఎస్యూవీ డస్టర్‌పై భారీగా ధర తగ్గించింది. ఈ కారుపై 29,746 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ధర తగ్గింపు అమల్లోకి వస్తుందని గురువారం రెనాల్ట్ ఇండియా తెలిపింది. ధర తగ్గింపు అనంతరం పెట్రోల్‌తో నడిచే డస్టర్ ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో 7.95 లక్షల రూపాయల నుంచి 9.95 లక్షల రూపాయల వరకు ఉంది. అంతకముందు ఇది 8.5 లక్షల రూపాయల నుంచి 10.24 లక్షల రూపాయలకు లభ్యమయ్యేది. డీజిల్‌తో నడిచే డస్టర్ ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో రూ.8.95 లక్షల నుంచి రూ.12.79 లక్షలకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర కూడా అంతకముందు 9.45 లక్షల రూపాయల నుంచి 13.79 లక్షల రూపాయల వరకు ఉండేది. తాము ఆఫర్ చేసే వాహనాల రేంజ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం, కొత్త డస్టర్ కస్టమర్లకు ఈ ప్రయోజనాలను అందించడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ దేశీయ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సావ్నీ తెలిపారు. హ్యుందాయ్ క్రిటా, మారుతీ విటారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి ఎస్‌యూవీలకు డస్టర్ గట్టి పోటీగా ఉంది. చెన్నైలో ఉన్న తయారీ యూనిట్ నుంచి ఈ డస్టర్‌ను రెనాల్ట్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. -
రెనో నుంచి డస్టర్ కొత్త వెర్షన్..
ప్రారంభ ధర రూ.8.46 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో తాజాగా ఎస్యూవీ డస్టర్లోనే కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8.46-రూ.13.56 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. దీనితోపాటు కంపెనీ సిక్స్-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వేరియంట్‌ను కూడా మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.11.66 లక్షలుగా ఉంది. పెట్రోల్ వేరియంట్స్ ధరలు రూ.8.46 లక్షలు-రూ.9.26 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్స్ ధరలు రూ.9.26 లక్షలు-రూ.13.56 లక్షల శ్రేణిలో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఎస్యూవీ విభాగంలో వాటా మరింత పెంచుకోవడానికి కొత్త డస్టర్ తమకు దోహదపడుతుందని రెనో ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో సుమిత్ సావ్నే తెలిపారు. కొత్త వెర్షన్ డ స్టర్‌కు నేటి నుంచి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. కొత్త డస్టర్‌లో రియర్ వ్యూ కెమెరా, ఆటోమెటిక్ ఎయిర్ కండీషనింగ్, మీడియా నావిగేషన్, ఏబీఎస్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.